For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Prashanth Neel రెమ్యునరేషన్ ఎంత.. క్లారిటీ ఇచ్చిన KGF డైరెక్టర్.. రాజమౌళి, శంకర్ రేంజ్‌లో!

  |

  దేశవ్యాప్తంగా KGF చిత్రం భారీ రేంజ్‌లో హంగామా సృష్టించడంతో హీరో యష్‌తోపాటు దర్శకుడు ప్రశాంత్ నీల్ పేరు మారుమోగింది. దాంతో ఒక్కసారిగా కన్నడ సినిమా పరిశ్రమపై అందరి కళ్లు పడ్డాయి. టాలీవుడ్‌లోనే కాకుండా అన్ని పరిశ్రమలోని హీరోలు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేయాలనేంతగా క్రేజ్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ మీడియాలో చర్చనీయాంశమైంది. అయితే ప్రశాంత్ నీల్ ఇటీవల తన జన్మదినం జూన్ 4 తేదీన ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆ విషయాల్లోకి వెళితే..

  దక్షిణాదిలో టాప్ డైరెక్టర్లుగా

  దక్షిణాదిలో టాప్ డైరెక్టర్లుగా

  దక్షిణాదిలో టాప్ దర్శకుల పేర్లను ప్రస్తావిస్తే.. ముందుగా గుర్తొచ్చిది సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. శంకర్ పలు సంచలన చిత్రాలతో ప్యాన్ ఇండియా డైరెక్టర్‌గా మారితే.. రాజమౌళి మాత్రం ఒకే ఒక బాహుబలితో దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా పాపులర్ అయ్యారు.

  శంకర్ టాప్ రేంజ్‌కు అలా..

  శంకర్ టాప్ రేంజ్‌కు అలా..

  దర్శకుడు శంకర్ విషయానికి వస్తే జెంటిల్మెన్, ప్రేమికుడు భారతీయుడు, రోబో లాంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకొన్నారు. రోబో 2 పెద్దగా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపకపోయినప్పటికీ.. ఆయన రెమ్యునరేషన్ దాదాపు రూ.50 కోట్లు ఉంటుందనే వార్త దక్షిణాది మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది.

  బాహుబలితో ఎస్ఎస్ రాజమౌళి టాప్...

  బాహుబలితో ఎస్ఎస్ రాజమౌళి టాప్...

  ఇక బాహుబలి సక్సెస్‌తో ఎస్ఎస్ రాజమౌళి టాప్ రేంజ్‌కు ఎదిగాడు. నిర్మాత నామ మాత్రంగా ఉన్న ఆయన సొంతంగా సినిమాలు చేసుకోవడమే ఆయన స్టైల్. బాహుబలిలో లాభాల్లో షేర్ అందుకొన్నట్టు వార్తలు రాగా.. ఆయనకు ఆ సినిమా ద్వారా రూ.100 కోట్లకుపైగానే పారితోషికం ముట్టినట్టు సినీ వర్గాలు చెప్పుకొంటారు.

  కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ గ్రాఫ్

  కేజీఎఫ్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ గ్రాఫ్

  ఇక కేజీఎఫ్ తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ గ్రాఫ్ కూడా భారీగా పెరిగింది. తన కేజీఎఫ్ చాప్టర్ 2 తర్వాత ఏకంగా ప్రభాస్‌తో సినిమా తీసే అవకాశాన్ని చేజిక్కించుకొన్నారు. దాంతో ఆయన రెమ్యునరేషన్ ఇప్పుడు అందరికంటే ఎక్కువే అనే మాట వినిపిస్తున్నది. దాదాపు దక్షిణాదిలో టాప్ రేంజ్‌లో పారితోషికం పుచ్చుకొంటున్నారనే వార్త మీడియాలో వైరల్ అవుతున్నది.

  నా రెమ్యునరేషన్ గురించి..

  నా రెమ్యునరేషన్ గురించి..

  అయితే తన పారితోషికంపై ప్రశాంత్ నీల్ స్పందిస్తూ.. ఇండస్ట్రీలో హయ్యెస్ట్ ఫిల్మ్ మేకర్ అనే విషయాన్ని, వార్తలను నేను నమ్మను. అలాగే సినిమా కోసం నేను తీసుకొనే రెమ్యునరేషన్ గురించి మాట్లాడుకోవడం ఇష్టం ఉండదు. రెమ్యునరేషన్ తీసుకొనే విషయంలో నేను టాప్ పోజిషన్‌లో ఉన్నాను అనే ప్రస్తావనే నాకు నచ్చదు అని అన్నారు.

  Tollywood హీరో పై Prashant Neel ఫోకస్ | NTR 31 | Salaar | KGF Chapter 2 || Filmibeat Telugu
  కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ కెరీర్ గురించి...

  కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ కెరీర్ గురించి...

  దర్శకుడు ప్రశాంత్ నీల్ కెరీర్ విషయానికి వస్తే... ఉగ్రం సినిమాతో కన్నడ సినీ పరిశ్రమలోకి వచ్చారు. కేజీఎఫ్: చాప్టర్ 1 మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం కేజీఎఫ్: 2 సినిమా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ప్రభాస్‌తో సలార్ చిత్రం సెట్లో ఉంది. ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయడానికి అంగీకరించారు. అల్లు అర్జున్, రాంచరణ్‌తో సినిమాలు చేస్తున్నట్టు వార్త ప్రచారంలో ఉంది. ఈ సినిమాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

  English summary
  Director Prashanth Neel become huge popularity after KGF Chapter 1. Now news viral in the media about her Prashanth neel remuneration. In this occassion, He has given clarity about his remuneration: In this time Shankar, SS Rajamouli's Fee for movie, become hot topic in the Industry.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X