Santhosh Soban చాలా రిచ్ అనుకొన్నా.. కానీ అలా షాకిచ్చాడు.. ప్రియా భవానీ శంకర్
ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై యువ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ నటిస్తున్న కొత్త సినిమా కళ్యాణం కమనీయం. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకరమైన కథనాలతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్నది. ఈ సందర్భంగా ప్రియా భవానీ శంకర్ మాట్లాడుతూ..
సంతోష్ శోభన్ చాలా కూల్ పర్సన్. ఈ సినిమాకు ముందు అతడి గురించి ఎక్కువ తెలియదు. ఆయన సినిమాలు చూడలేదు. ఆయన రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చారని అనుకొన్నాను. కానీ ఆయన ఎన్నో సమస్యలను ఎదుర్కొని.. జీవితంలో పైకి వచ్చారని తెలిసిన తర్వాత నాకు ఆయనపై గౌరవం పెరిగింది. ఆయన బ్రిల్లియెంట్ యాక్టర్. అమేజింగ్ ఫెర్ఫార్మర్. అలాంటి హీరోతో తెలుగులో లాంచ్ కావడం చాలా హ్యాపీగా ఉంది అని ప్రియ భవానీ శంకర్ తెలిపారు.

ప్రతీ ఒక్కరికి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్. తను ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి వచ్చాడు కాబట్టి.. ఆయనతో పనిచేయడం చాలా ఈజీ అయింది. చాలా విషయాలు షేర్ చేసుకొనే అవకాశం కలిగింది. సీనియర్ నటులతో పనిచేస్తే.. ఆ అవకాశం ఉండదు

తమిళంలో ఇటీవల ధనుష్‌తో ఓ సినిమాలో అతిథి పాత్రలో నటించాను. కల్యాణం కమనీయం సినిమా పూర్తయిన తర్వాత ఆ చిత్రంలో నటించాను. ధనుష్ మల్టీ టాస్కింగ్ పర్సనాలిటీ. ఆయన చూసి అనేక విషయాల్లో స్పూర్తి పొందగలిగే వ్యక్తిత్వం కలిగిన నటుడు. ప్రస్తుతం నాగచైతన్య, విక్రమ్ కుమార్‌తో కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నాను


Click it and Unblock the Notifications











