For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఆయన ఫోన్ చేయడంతో... కథ వినకుండానే ఒప్పేసుకొన్నా.. చెక్ గురించి ప్రియా ప్రకాశ్ వారియర్

  |

  మలయాళంలో ఓరు ఆడార్ లవ్ (తెలుగులో లవర్స్ డే) చిత్రానికి సంబంధించిన టీజర్‌లో ప్రియా ప్రకాశ్ వారియర్ ఒకేసారి కన్నుగీటి దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే సౌత్‌లో పాపులర్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకొన్నది. లవర్స్ డే తర్వాత ప్రస్తుతం యూత్ స్టార్ నితిన్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ పతాకంపై వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా 'చెక్'. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ కథానాయిక. శుక్రవారం (ఫిబ్రవరి 26న) సినిమా విడుదల కానున్న సందర్భంగా ప్రియా ప్రకాశ్ వారియర్ మీడియాతో మాట్లాడుతూ...

   లవర్స్ డే తర్వాత చాలా కథలు విన్నా

  లవర్స్ డే తర్వాత చాలా కథలు విన్నా

  లవర్స్ డే మూవీ తర్వాత నాకు చాలా కథలు డైరెక్టర్లు చెప్పారు. కథలు నచ్చకపోవడంతో టాలీవుడ్‌లో సరైన ఎంట్రీ కోసం ఎదురు చూశాను. అలాంటి నేపథ్యంలో నాకు చంద్రశేఖర్ యేలేటి ఫోన్ చేసి సినిమా చేయాలని అడిగినప్పుడు కథ వినకుండానే ఒప్పేసుకొన్నాను అని ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపారు.

  చందూ సార్ గొప్ప డైరెక్టర్

  చందూ సార్ గొప్ప డైరెక్టర్

  దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి గురించి నాకు ముందు నుంచి తెలుసు. తెలుగులో రూపొందిన మనమంతా చిత్రం మలయాళంలో విస్మయంగా రిలీజైంది. ఆ చిత్రంలో నా అభిమాన నటుడు మోహన్‌లాల్ నటించారు. ఆ సినిమా చూసిన తర్వాత చందూ సార్ ఎంత గొప్ప నటుడు అనే విషయం అర్ధమైంది. చెక్ సినిమాలో నటించాలని అడిగినప్పుడు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను. ఇంకా భవ్య క్రియేషన్ నిర్మిస్తుండటం, నితిన్, రకుల్ ప్రీత్ నటిస్తున్నారని చెప్పగానే మరోసారి ఆలోచించకుండా ఓకే చెప్పాను అని ప్రియా ప్రకాశ్ వారియర్ అన్నారు.

  నా పాత్ర గురించి చెప్పలేను

  నా పాత్ర గురించి చెప్పలేను

  చెక్ చిత్రంలో నా పాత్ర పేరు యాత్ర. ఆదిత్య (నితిన్)కు లవర్‌గా నటిస్తున్నాను. అయితే నా పాత్ర చాలా ఎమోషనల్‌తో కూడుకొన్నది. నా రోల్ గురించి ఎక్కువగా రివీల్ చేయలేను. నాపై నిర్మాత ఆనందప్రసాద్ గారు పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టానని అనుకొంటున్నాను. షూటింగ్ సమయంలో చంద్రశేఖర్ యేలేటి నాకు పుల్ సపోర్ట్ ఇచ్చారు. దాంతో నాకు నటించడం చాలా సులభం అయింది అని ప్రియా ప్రకాశ్ వారియర్ పేర్కొన్నారు.

  నితిన్‌ పక్కన అనగానే ఒప్పేసుకొన్నా

  నితిన్‌ పక్కన అనగానే ఒప్పేసుకొన్నా

  నితిన్‌తో సినిమా అనగానే ఆఫర్‌ను ఒప్పుకొన్నాను. ఎన్నో చిత్రాల్లో నటించిన అనుభవం ఉన్న హీరో అతను. సినిమా షూటింగ్ సమయంలో తొలుత కంగారు పడ్డాను. ఆ తర్వాత ఆయన తీరుతో నేను కంఫర్టబుల్‌గా ఫీలయ్యాను. సీనియర్, జూనియర్ అనే తేడా సెట్స్‌లో కనిపించలేదు అని ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపారు.

  త్వరలోనే గాయనిగా మారుతాను

  త్వరలోనే గాయనిగా మారుతాను

  చెక్ సినిమా సెట్లో ఖాళీగా ఉంటే నేను పాటలు పాడేదాన్ని. కొద్ది రోజుల క్రితం లడీ లడీ అనే ప్రైవేట్ పాటను పాడను. అవకాశం లభిస్తే సినిమాల్లో కూడా పాడుతాను. చెక్‌లోని నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను అనే పాటను పాడించాలని ప్రయత్నించారు. కొన్ని కారణాల వల్ల అది సాధ్యపడలేదు. త్వరలోనే డబ్బింగ్‌తోపాటు పాటలు కూడా పాడేందుకు ప్రయత్నిస్తాను అని ప్రియా ప్రకాశ్ వారియర్ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

  English summary
  Wink Girl Priya Prakash Varier's Latest movie is Check. Popular Director Chandra Sekhar Yeleti is the director. Nithiin is the hero. This movie made under the Bhaya Creation banner. Check movie is set to release on February 26th. In this occassion, Priya Prakash Varrier speaks to Telugu filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X