పవన్ కల్యాణ్ లెజెండ్.. ఆయన రేంజ్ వేరు.. అల్లు అర్జున్ అభిమానిగా అలాంటి ఫీలింగ్.. ప్రియా ప్రకాశ్ వారియర్
తమిళంలో భారీ విజయం సాధించిన వినోదయ సీతమ్ సినిమా ఆధారంగా రూపొందుతున్న చిత్రం బ్రో (Bro The Avatar). పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రానికి నటుడు, డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో వింక్ గర్ల్ ప్రియా ప్రకాశ్ వారియర్, అందాల భామ కేతిక శర్మ నటించారు. జూలై 28వ తేదీన ఈ చిత్రం రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ప్రియా ప్రకాశ్ వారియర్ ఫిలింబీట్‌తో మాట్లాడుతూ..
నేను తమిళంలో వినోదయ సీతమ్ సినిమా చూసినప్పుడే చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఓ రోజు సముద్రఖని నాకు ఫోన్ చేసి లుక్ టెస్ట్‌కు రమ్మని చెప్పారు. పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ లాంటి స్టార్ హీరోలు నటిస్తున్న ఈ సినిమాలో నాకు అవకాశం వస్తుందనే విషయం తెలుసుకొని చాలా ఆనందించాను. నాలాంటి అప్ కమింగ్ హీరోయిన్‌కు ఆఫర్ రావడం గొప్పగా భావించాను. పవన్ కల్యాణ్ పక్కన ఒకట్రెండు సీన్లు నటిస్తే చాలు అనుకొనే నాకు సినిమా మొత్తంలో భాగం కావడం హ్యాపీగా ఉంది. నా కెరీర్‌కు అంతకంటే కావాల్సింది ఏముంది? అని ప్రియా ప్రకాశ్ వారియర్ అన్నారు.

నా కెరీర్ ఆరంభంలోనే పవన్ కల్యాణ్, సాయిధరమ్ తేజ్ లాంటి హీరోల పక్కన నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆ ఇద్దరి హీరోలతో నాకు కాంబినేషన్ సీన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని పాత్రలో నేను కనిపిస్తాను. ఫ్యామిలీ విలువలు ఉన్న సాధారణమైన యువతి పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర ఏమిటి అనే విషయం చెప్పను. కానీ స్క్రీన్ మీద చూస్తే మీరు థ్రిల్ అవుతారు అని ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపారు.

బ్రో సినిమా చూస్తే.. ఒరిజినల్ కంటే ఎక్కువగా కథలో మార్పులు, చేర్పులు చేశారు. తమిళ సినిమా డిఫరెంట్. తెలుగు బ్రో మూవీ డిఫరెంట్. పవన్ కల్యాణ్ ఇమేజ్, ఆయన ఫెర్ఫార్మెన్స్‌కు స్కోప్ ఇస్తూ బ్రో మూవీ రూపొందించారు. తమిళ వెర్షన్ కంటే మరో స్టెప్పు ముందు వేసి పూర్తి కమర్షియల్ హంగులతో రూపొందించారు.ఒరిజినల్ సినిమా కంటే ఎక్కువ సన్నివేశాలు కథలో ఉంటాయి అని ప్రియా ప్రకాశ్ వారియర్ చెప్పారు.

పవన్ కల్యాణ్‌తో సీన్లు ఉన్నాయి.. కాకపోతే ఎక్కువ సీన్లు లేవు. కానీ ఆయనతో నటించిన సీన్లు చాలా బాగున్నాయి. ఆయన సెట్లో ఉంటే ఒకరకమైన ఆరా (Aura), ఎనర్జీ ఉండేది. ఆయన సెట్లోకి అడుగుపెట్టగానే అందరికీ గొప్ప అనుభూతి ఉండేది. చాలా కామ్‌గా, కంపోజ్‌గా ఉండేవారు. షూట్‌లో నేను ఏమీ చేయాలో మీరు చెప్పండి అంటూ వినయంగా మాట్లాడేవారు. సింగిల్ టేక్‌లో సీన్ కంప్లీట్ అయ్యేది. మంచి మనసు ఉన్న మనిషి. ఆయనతో కలిసి నటించడం వల్ల చాలా నేర్చుకొన్నాను. ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా చాలా ఒదిగి ఉండటం నాకు ఆశ్చర్యం, స్పూర్తిని కలిగించింది అని ప్రియా ప్రకాశ్ వారియర్ చెప్పారు.



Click it and Unblock the Notifications











