కన్ను కొట్టగానే ఇంటివద్ద కర్ఫ్యూ.. శ్రీదేవి బంగ్లాతో టెన్షన్.. సింబా ఆఫర్ ఎలా మిస్.. ప్రియా వారియర్

నేషన్ సెన్సేషన్ ప్రియా వారియర్ నటించిన ఒరు ఆధార్ లవ్ సినిమా తెలుగులో లవర్స్ డేగా రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో కన్నుగీటే సీన్ సోషల్, యూట్యూబ్ మీడియాలో సంచలనం రేపింది. మిలియన్ల కొద్ది వ్యూస్ గంటల్లోనే వచ్చాయి. యధాలాపంగా చేసిన సీన్‌ను ఇంత క్రేజ్ తెస్తుందని ఊహించలేదు. నా కుటుంబ సభ్యులను కొన్ని రకాల ఇబ్బందుల్లోకి నెట్టింది అని ప్రియా వారియర్ చెప్పింది. లవర్స్ డే సినిమా నా జీవితాన్ని ఎలా మలుపు తిప్పిందంటే అంటూ ప్రియా చెప్పిన విషయాలు మీకోసం..

వింక్ గర్ల్ అనే ట్యాగ్‌ను ఎంజాయ్ చేస్తున్నా

వింక్ గర్ల్ అనే ట్యాగ్‌ను ఎంజాయ్ చేస్తున్నా

కన్ను గీటిన అమ్మాయి (వింక్ గర్ల్) అనే ట్యాగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. తప్పకుండా ఆ ట్యాగ్ నా కెరీర్ వృద్ధికి తోడ్పాటునందిస్తున్నది. దాని వల్ల వచ్చిన పాపులారిటీ, గుర్తింపును జాగ్రత్తగా ఉపయోగించుకొంటున్నాను. వింక్ గర్ల్ అనే దానివల్ల ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. దానిని కంప్లీట్‌గా ఎంజాయ్ చేస్తున్నాను.

 సింగిల్ టేక్‌లోనే షాట్ ఓకే

సింగిల్ టేక్‌లోనే షాట్ ఓకే

లవర్స్ డే సినిమా కోసం కన్ను గీటే సీన్లకు రిహార్సల్ చేయలేదు. సింగిల్ టేక్ షాట్ అది. కానీ ఎదో తెలియకుండా అలా పాపులర్ అయిపోయాను. అమ్మాయిల కాలేజీ కావడంతో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదు. గూగుల్‌లో మోస్ట్ ట్రెండింగ్‌ వ్యక్తిగా నిలిచారనే వార్తతో మరింత పాపులారిటీ పెరిగింది. దానిని హ్యాండిల్ చేయడానికి ఇంటి వద్ద కర్ఫ్యూ పెట్టే పరిస్థితికి దారి తీసింది.

ఫ్యామిలీపై మీడియా ఒత్తిడి

ఫ్యామిలీపై మీడియా ఒత్తిడి

ఊహించని విధంగా పాపులారిటీ రావడం వల్ల నా కుటుంబానికి కొంత ఇబ్బంది ఎదురైంది. చెప్పపెట్టకుండా మీడియా మా ఇంటికి వచ్చేవాళ్లు. ఇంటర్వ్యూలు కావాలని ఒత్తిడి తెచ్చేవారు. కానీ నేను ఇంట్లో లేనని అబద్దం చెప్పి నా ఫాదర్ వారిని వెనుకకు పంపించే వారు.

తెలుగులో భారీగానే ఆఫర్లు

తెలుగులో భారీగానే ఆఫర్లు

అప్పట్లో తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చాయి. ఇప్పుడు నా ముందు కొన్ని ఆఫర్లు ఉన్నాయి. ప్రస్తుతం స్టోరీలు వింటున్నాం. సినిమాలను అంగీకరించడంలో నా తండ్రి నిర్ణయం తీసుకొంటారు. శ్రీదేవి బంగ్లా తర్వాత సినిమాలను అంగీకరించలేదు. లవర్స్ డే సినిమా రిలీజ్ తర్వాత నేను ఆఫర్లపై దృష్టిపెడుతాను.

సింబాలో రణ్‌వీర్ సింగ్ పక్కన

సింబాలో రణ్‌వీర్ సింగ్ పక్కన

సింబా సినిమాలో రణ్‌వీర్ సింగ్ పక్కన నటించే అవకాశం వచ్చిందని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదు. సింబా యూనిట్ నుంచి నాతో ఎవరూ సంప్రదింపులు జరుపలేదు. ఆ వార్తలన్నీ నా గాసిప్సే. ఇక శ్రీదేవి బంగ్లా వివాదంలో నాకు ఎలాంటి నోటీసులు అందలేదు.

 శ్రీదేవి బంగ్లా వివాదం గురించి

శ్రీదేవి బంగ్లా వివాదం గురించి

శ్రీదేవి బంగ్లాలో బాత్‌రూమ్ సీన్లు కేవలం సినిమాపై క్యూరియాసిటీ పెంచడానికే ఉపయోగపడుతాయి. ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించడానికి కారణమవుతాయి. అందంతా దర్శకుడు, సినిమా యూనిట్ క్రియేటివిటికి సంబంధించినది మాత్రమే. నటిగా నేను నటించాను తప్ప ఆ సీన్ల రూపకల్పనలో నాకు ఎలాంటి సంబంధాలు లేవు.

బోనికపూర్ హెచ్చరికల గురించి

బోనికపూర్ హెచ్చరికల గురించి

శ్రీదేవి బంగ్లా సినిమా రిలీజ్‌ను అడ్డుకొంటానని బోనికపూర్ అన్నట్టు వార్తలు చూశాను. బోనికపూర్ లీగల్ నోటీసులు పంపనున్నారనే వార్త విన్నాను. ఆ వివాదానికి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా సమస్యలు ఉంటే నిర్మాత, దర్శకులు చూసుకొంటారు. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అని, బాలీవుడ్ ఎంట్రీకి సరిగ్గా పనికి వస్తుందని ఆ సినిమాను అంగీకరించాను. వివాదాలు చుట్టుముడుతాయని ఊహించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X