అంతమంది అలా చుట్టుముట్టారు.. ఆ క్షణంలో గుండె జారి పోయింది.. ప్రియా ప్రకాశ్ వారియర్

లవర్స్ డే చిత్రంతో తెలుగులో భారీగా అభిమానులను సంపాదించుకొన్న ప్రియా ప్రకాశ్ వారియర్ రెండేళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. యూత్ స్టార్ నితిన్‌, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్‌లో ఇంటెలిజెంట్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానరపై వీ ఆనంద ప్రసాద్ నిర్మించిన చెక్ చిత్రం ఫిబ్రవరి 26వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ...

Check Movie Pre Release Event Photos

చెక్ మూవీ నాకు గొప్ప అనుభవం

చెక్ మూవీ నాకు గొప్ప అనుభవం

చెక్ మూవీ షూటింగ్ ప్రాసెస్ నా కెరీర్‌లో నాకు మంచి అనుభవాన్ని ఇచ్చింది. సినిమా సెట్స్ మీదకు వెళ్లక ముందు డైలాగ్ రీడింగ్ సెషన్ జరిగింది. నా పాత్రకు సంబంధించిన ప్రతీ డైలాగ్‌ను చదివి క్షణ్ణంగా అర్ధం చేసుకొన్నాను. ప్రతీ పదానికి సంబంధించిన అర్ధాన్ని తెలుసుకొన్నాను. డైలాగ్ అర్థం తెలిస్తే గానీ నేను భావోద్వేగాన్ని పండించలేను. సెట్లో నేను నటిస్తుంటే వెనుక నుంచి డైలాగ్స్ అందించడం నాకు నచ్చదు. అలాంటి పరిస్థితుల్లో యాక్టింగ్‌పై దృష్టిపెట్టడం కష్టమవుతుంది అని ప్రియా ప్రకాశ్ వారియర్ అన్నారు.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ మీదపడేలా

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఫ్యాన్స్ మీదపడేలా

నా తొలి చిత్రం లవర్స్ డే నుంచి తెలుగు ప్రేక్షకులు నాపై చూపిస్తున్న ప్రేమకు ధన్యురాలిని. చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక్కసారిగా ఎక్కువ మంది నన్ను చుట్టుముట్టారు. ఆ జనం మధ్య చిక్కుకుపోవడంతో కంగారు పడ్డాను. నేను ఎలా బయటపడుతాననే భయం వెంటాడింది. స్టేజ్ నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది అని ప్రియా వారియర్ పేర్కొన్నారు.

అభిమానంలో తడిసి ముద్దయ్యాను

అభిమానంలో తడిసి ముద్దయ్యాను

చెక్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నన్ను చుట్టుముట్టడాన్ని తప్పుపట్టను. అంతమంది అభిమానాన్ని సొంతం చేసుకోవడం జీవితంలో అదృష్టంగా భావిస్తాను. రెండేళ్లుగా తెలుగులో సినిమా చేయలేదు. కానీ నన్ను ఇంతలా ఆదరించడం నాకు ఆనందంగా ఉంది. హైదరాబాద్‌లో పర్యటించిన ప్రతీసారి అభిమానుల ప్రేమలో ఇలా తడిసి ముద్దవుతాను అని ప్రియా వారియర్ చెప్పారు.

చెక్ సినిమా కొచీలో చూస్తా

చెక్ సినిమా కొచీలో చూస్తా

తెలుగు ప్రేక్షకుల మధ్య చెక్ సినిమా చూడాలని ఉంది. హైదరాబాద్‌లోనే నా కుటుంబ సభ్యులతో కలిసి చూడాలనుకొన్నాను. కానీ కొన్ని కారణాల వల్ల కుదరడం లేదు. చెక్ చిత్రం కొచ్చిలో కూడా రిలీజ్ అవుతున్నది. అక్కడే నా ఫ్యామిలీతో చూడాలని ప్లాన్ చేశాను అని ప్రియా ప్రకాశ్ వారియర్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X