For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు అలాంటి భర్త దొరకడం అదృష్టం.. అందుకే నా కెరీర్.. ప్రియమణి ఎమోషనల్

  |

  జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు అందుకొన్న అసురన్ చిత్రానికి రీమేక్‌గా నారప్ప జూలై 20వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ అవుతున్నది. ఈ చిత్రంలో హీరో వెంకటేష్ సరసన ప్రియమణి కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా గురించి, తన పాత్ర గురించి ప్రియమణి మాట్లాడుతూ..

  నారప్ప గొప్ప చిత్రం అవుతుంది

  నారప్ప గొప్ప చిత్రం అవుతుంది

  నారప్ప బ్యూటిఫుల్ ఫిలిం. ఎమోషనల్ రోలర్ కోస్టర్. ఇప్పటికే అసురన్ సినిమాను ఇప్పటికే చాలా మంది చూశారు. తెలుగు నేటివిటి కోసం కొన్ని చోట్ల మార్చారు. నారప్ప గొప్ప చిత్రం అవుతుంది. వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల, శ్యామ్, మణిశర్మ లాంటి టాప్ పర్సనాలిటీలతో కూడిన టీమ్‌తో పనిచేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభిస్తుందనే విశ్వాసం ఉంది అని ప్రియమణి అభిప్రాయపడ్డారు.

   100 శాతం న్యాయం చేశా

  100 శాతం న్యాయం చేశా

  నారప్పలో అవకాశం అంత సులభంగా రాలేదు. లుక్ టెస్ట్ చేసి రకరకాల పరీక్షల తర్వాత ఆఫర్ వచ్చింది. ఒక్కసారి అసురన్ సినిమా రీమేక్‌లో మంజు వారియర్ పోషించిన పాత్ర నాకు వచ్చిన తర్వాత హ్యాపీగా అనిపించింది. మంజు వారియర్ చాలా అద్భుతంగా చేసింది. ఆమె స్థాయి మేరకు నేను నటించడానికి ప్రయత్నించాను. మంజు వారియర్‌ నుంచి సలహాలు తీసుకోలేదు. స్పూర్తి పొందలేదు. నా స్థాయిలో నేను 100 శాతం ఇచ్చాను అని ప్రియమణి అన్నారు.

  Narappa on Amazon అభిమానులకు సారీ చెబుతున్నా.. అది చాలా రిస్క్.. వెంకటేష్ ఎమోషనల్!

   వెంకటేష్‌తో కలిసి పనిచేయడం ...

  వెంకటేష్‌తో కలిసి పనిచేయడం ...

  వెంకటేష్‌తో నటించాలన్నది ఓ కోరిక. కెరీర్‌లో ఒక సినిమా అయిన నటించాలని ఉండేది. నారప్పలో వెంకటేష్‌తో కలిసి నటిస్తున్నానని తెలిసిన తర్వాత నా కల నిజమైందని భావిస్తున్నాను. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్, సురేష్ ప్రొడక్షన్, వెంకటేష్ సహ నటుడు అనే విషయాలు డ్రీమ్ కమ్ ట్రూ అనే ఫీలింగ్ కల్పించాయి. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా హోంవర్క్ చేయలేదు. డైలాగ్ ఎలా చెప్పాలనే విషయం గురించి శ్రీకాంత్ అడ్డాల నాకు కొన్ని సూచనలు ఇచ్చారు అని ప్రియమణి తెలిపారు.

  నా సక్సెస్‌లో నా భర్త పాత్ర

  నా సక్సెస్‌లో నా భర్త పాత్ర

  పెళ్లి తర్వాత బిజీ అయిన విషయం నిజమే. దీని కోసం ఎలాంటి ప్లాన్ చేయడం లేదు. నా ముందుకు వచ్చిన పాత్రలను జాగ్రత్తగా పరిశీలించిన ఎంపిక చేసుకొంటున్నాను. అయితే నన్ను అర్ధం చేసుకొనే పార్ట్‌నర్ నాకు లభించారు. నా ప్రొఫెషన్‌ను అర్ధం చేసుకొని ప్రోత్సహిస్తున్నారు. అలా అర్ధం చేసుకొనే భర్త లభించడం నిజంగా అదృష్టమే. ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినా ఇద్దరం కలిసి మాట్లాడుకొంటాం అని ప్రియమణి చెప్పారు.

  విక్రమార్కుడు చిన్నారి 'అనీ' ఇప్పుడు ఎలా ఉందో తెలుసా.. హీరోయిన్స్ రేంజ్‌లో..

   మా మధ్య పరస్పర అవగాహన

  మా మధ్య పరస్పర అవగాహన

  నా కెరీర్ విషయంలో నా భర్త చాలా జాగ్రత్తలు తీసుకొంటారు. ఆయనను ఎవరైనా సంప్రదించి ప్రియమణి డేట్స్ కావాలని అడిగితే.. నాకు చెబుతారు. అలాంటి విషయాలపై కూడా మేము చర్చించుకొంటాం. ఏది మంచిది? ఏది చెడు అనే విషయాను బేరిజు వేసుకొంటాం. అలా మా మధ్య అవగాహన ఉంది. నిర్ణయం తీసుకోవడంలో మా ఇద్దరి అభిప్రాయలను పరిగణనలోకి తీసుకొంటాం అని ప్రియమణి చెప్పారు.

  నాకు అవి ఛాలెంజింగ్‌గా

  నాకు అవి ఛాలెంజింగ్‌గా

  నారప్ప మూవీలో ఎమోషనల్ సీన్లు ఛాలెంజింగ్‌గా అనిపించాయి. మెంటల్‌గా కంటే ఫిజికల్‌గా పరిస్థితులు కష్టం అనిపించాయి. మేము షూటింగ్ చేసే ప్రాంతంలో చాలా డస్ట్ ఉండేది. అదే మాకు చాలా ఇబ్బంది అనిపించింది అని ప్రియమణి చెప్పారు.

  English summary
  Victory Venkatesh Latest movie is Narappa. This movie is releasing on July 20 in Amazon Prime Video. In this occassion, Priyamani speaks to filmibeat about Narappa release on Amazon Prime Video
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X