జగదేక వీరుడు.. అతిలోక సుందరి సీక్వెల్.. హింట్ ఇచ్చిన ప్రియాంక, స్వప్న దత్
అన్ని మంచి శకునములే సినిమా హీరో, హీరోయిన్ల మధ్య జరిగే కథ కాదు. ప్రతి సినిమాలో కొన్ని క్యారెక్లర్లు ఉంటాయి. ఈ సినిమా రెండు కుటుంబాల మధ్య జరిగే కథ. ఈ సినిమాలో ఉండే ఎమోషన్స్ మాటల్లో చెప్పలేం. ఒక మంచి అనుభూతి, ఆనందం కలిగితే వచ్చే కంటతడి లాంటి ఎమోషన్స్ ఉంటాయి అని ప్రియాంక అన్నారు. మే 18వ తేదీన ఈ సినిమా రిలీజ్ అవుతున్న నేపథ్యంలో స్వప్న దత్, ప్రియాంక దత్ తెలుగు ఫిల్మీ బీట్‌తో మాట్లాడుతూ..
హృదయానికి టచ్ అయ్యే కథలతో: మహానటి నుంచి సీతారామం వరకు చేసిన సినిమాలు హిట్లు కావడంతో మాకు ప్రతీ సినిమా ఒత్తిడిని పెంచుతుంది. తక్కువ సినిమాలే చేస్తున్నాం. కానీ మా హృదయానికి టచ్ అయ్యే కథలను ఎంచుకొంటున్నాం. 80 శాతం ఆడియెన్స్‌కు ఉండే టేస్ట్ మాకు ఉంటుందని అనుకొన్నాం. సీతారామం సినిమా మాకు మంచి సంతృప్తిని ఇచ్చింది. మేము ఆ సినిమా చేసినప్పుడు హీరో, హీరోయిన్ మన భాష వాళ్లు కాదు.. ప్రేక్షకుల ఆదరిస్తారా? లేదా అని చిన్న డౌట్ ఉండేది. కానీ తప్పకుండా ఆడుతుందనే నమ్మకం అంతకంటే బలంగా ఉండేది అని ప్రియాంక, స్వప్నదత్ చెప్పారు.

లెక్కలు వేసుకొని సినిమాలు తీయం: మేము క్యాలికులేషన్ పెట్టుకొని సినిమాలు చేయం. లెక్కలు వేసుకొని చేస్తే సినిమాను నిర్మించలేం. అశ్వినీదత్ గారు కూడా లెక్కలు వేసుకొని ఏనాడు సినిమాలు తీయలేదు. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకొన్నాం. ఏ సినిమా కూడా హీరోను దృష్టిలో పెట్టుకొని సినిమా తీయలేదు. ఆ పాత్రకు ఎవరు సూట్ అవుతారో అనే విషయం ద్వారా సినిమాలు చేశాం. మంచి కథలు చేయడానికే ప్రయత్నిస్తుంటాం. లెక్కలు వేసుకొంటే సీతారామం చేయలేం అని ప్రియాంక, స్వప్పదత్ అన్నారు.
ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో: ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కథలు వింటాం. ప్రేక్షకుల ఎలా ఫీలవుతారో అలా మేము కథ వినేటప్పడు ఆలోచిస్తాం. దాంతో మంచి చిత్రాలను ఎంపిక చేసుకొనే అవకాశం కలుగుతుంది. నిర్మాతలుగా ఒక్కో పనిని ఒక్కరు షేర్ చేసుకొంటాం. అవసరమైనప్పుడు సలహాలు ఒకరినొకరరం అడిగి తీసుకొంటాం. సెట్లో మేము ఉండటం ద్వారా ధైర్యాన్ని ఇచ్చి అండగా ఉండేలా బిహేవ్ చేస్తాం అని ప్రియాంక, స్వప్నదత్ అన్నారు.

తొలి సినిమా సమయంలో కొట్టుకొనేంతగా: మేము ఫస్ట్ సినిమా తీసేటప్పడు రకరకాల అభిప్రాయాల బేధాలతో కొట్టుకొన్నంత పనిచేశాం. కానీ ఆ తర్వాత ఎవరు ఏ పని చేయాలో డిసైడ్ చేసుకొన్నాం. సినిమా చేయడానికి అనువుగా ఉండే ఒక సిస్టమ్‌ను డిజైన్ చేసుకొన్నాం. మా ఇద్దరిలో జడ్జిమెంట్ ఎవరిది గొప్పగా ఉందంటే.. ఇద్దరం ఒక్కొ సినిమాకు ఒకరకమైన జడ్జిమెంట్‌తో ఉంటాం అని ప్రియాంక, స్వప్నదత్ తెలిపారు.

జగదేకవీరుడు.. అతిలోక సుందరి సీక్వెల్‌పై: వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి ఎన్నో మంచి చిత్రాలు, గొప్ప చిత్రాలు వచ్చాయి. మా బ్యానర్‌లో వచ్చిన జగదేక అతిలోక వీరుడు సినిమాకు సీక్వెల్‌గా చేయాలని అనుకొంటున్నాం. అది ఎప్పుడు అవుతుందో చూడాలి. ఆ సినిమాకు సీక్వెల్‌ను మాత్రం తప్పకుండా చేస్తాం అని ప్రియాంక దత్, స్వప్నదత్ అన్నారు.


Click it and Unblock the Notifications











