Nag Ashwin వల్లే మేము మా బ్యానర్ స్థాయిలో.. ఆ సినిమా హిట్ అవుతుందా? అంటే.. ప్రియాంక, స్వప్న దత్ (ఇంటర్వ్యూ)
ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో ట్యాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అన్నీ మంచి శకునములే. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మే 18వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్నదత్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
పెద్ద సినిమా, చిన్న సినిమా ఉండదు: ఏ సినిమా కూడా పెద్దది.. చిన్నది అనేది ఉండదు. కథ చెప్పాలనిపించినప్పుడు మంచి కథ అనిపించినప్పుడు చేసిన చిత్రం అన్ని మంచి శకునాలే. ప్రాజెక్ట్ K పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నాం. మేము పెద్ద సినిమా, చిన్న సినిమా అనేది చూడం. మా లైఫ్ జర్నీ స్టార్ట్ అందింది ఎవడే సుబ్రమణ్యం. మా వరకు ఆ సినిమా పెద్దది. మంచి కథ అనుకొని చేసిన సినిమా ఇది. మూడు, నాలుగు సినిమాలు ఒకేసారి చేయడం మాకు ఇష్టం ఉండదు. అంతా స్థోమత కూడా ఉందని అనుకొం. మేము చేసే ప్రతీ సినిమా దర్శకుడికి సపోర్ట్‌గా ఉండాలని కోరుకొంటాం. కోవిడ్ కారణంగా రెండు మూడు సినిమాలు చేయాల్సి వచ్చింది అని ప్రియాంక, స్వప్నదత్ అన్నారు.

విక్టోరియాపురం అనే విలేజ్‌ను క్రియేట్ చేశాం: అన్ని మంచి శకునాలే సినిమాలో ఎలాంటి ట్విస్టులు, టర్న్‌లు ఉండవు. భారీ కమర్షియల్, మాస్ అంశాలు ఎలా ఉండవు. వేసవిలో అమ్మమ్మ ఊరికి వెళ్లి పది రోజులు గడిపి వస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలా ఉంటుంది. మా పర్సనల్ లైఫ్‌కు ఎలాంటి కనెక్షన్ లేదు. కూనూర్ లాంటి హిల్ స్టేషన్‌లో సినిమా జరుగుతుంది. విక్టోరియాపురం అనే టౌన్‌ను క్రియేట్ చేసి షూట్ చేశాం. తప్పకుండా మంచి అనుభూతిని అన్ని మంచి శకునాలే ఇస్తుంది అని ప్రియాంక, స్వప్న దత్ చెప్పారు.

నటీనటుల ఎంపిక గురించి: ఏ సినిమాకైనా నేను, ప్రియా, డైరెక్టర్ కలిసి నటీనటుల ఎంపిక చేస్తాం. సీతారామం లాంటి పెద్ద ప్రాజెక్టులు చేసేటప్పుడు నాన్న అశ్వినీదత్ గారి సలహాలు తీసుకొంటాం. ఊర్వశి లాంటి నటీనటులను తమిళం, మలయాళం నుంచి తీసుకోవడానికి ప్యాన్ సౌత్ చేయాలనే కారణం కాదు. ఆ పాత్రకు ఎవరు న్యాయం చేస్తారో వారిని ఎంచుకొన్నాం. ఊర్వశి పాత్ర చిన్నగా ఉంటుంది. కానీ ఆమె తప్ప ఎవరు చేయలేరనే అభిప్రాయం కలిగింది. వాసుకీని ఎప్పటి నుంచి అడిగితే ఈ సినిమా చేశారు. గౌతమిని తీసుకోవాలని అందరం నిర్ణయం తీసుకొన్నాం అని ప్రియాంక, స్వప్నదత్ తెలిపారు.

జాతిరత్నాలు హిట్ అవుతుందని అనుకోలేదు: జాతిరత్నాలు సినిమా ఆడుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. కానీ నాగ్ అశ్విన్‌కు గొప్ప నమ్మకం ఉంది. ఆ సమయంలో ఓటీటీ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. ఓటీటీకి ఇచ్చేద్దామన్నాను. కానీ నాగ్ అశ్విన్ ఒప్పుకోలేదు. మనకు వయసు చాలా ఉంది. ముందు ముందు బోలెడ్ సంపాదించుకోవచ్చు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ అయితే రెండింతలు వస్తుంది. హిట్ కాకపోతే మొత్తం పోతుందని నాగ్ అశ్విన్ అన్నాడని ప్రియాంక చెప్పారు. సీతారామం సినిమాపై నాకు మంచి నమ్మకం ఉండేది. మహానటికి అందరికి నమ్మకం ఉండేది అని ప్రియాంక చెప్పారు.

నాగ్ అశ్విన్ బలం, విజన్ వల్లే: నాగ్ అశ్విన్ బలం, విజన్ వల్లే వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు వల్లే ఈ స్థాయిలో ఉంది. ఆ సమయంలో మేము కలిసి నిర్ణయం తీసుకొన్నందుకే మా ప్రయాణం ఇలా సాగుతున్నది. మహానటి చేస్తున్న సమయంలో మాకు క్లారిటీ వచ్చింది. ఆయన ఏ దర్శకుడి పనిలో వేలు పెట్టరు. జోక్యం చేసుకోరు. జాతిరత్నాలు సినిమా సమయంలో మార్కెటింగ్ చేసి పెట్టారు. మా సినిమాల వెనుక ఆయన ఏదో ఒక రూపంలో ఉంటారు. మంచి సినిమాలు చేయడానికి దోహదపడుతారు అని ప్రియాంక, స్వప్నదత్ చెప్పారు.


Click it and Unblock the Notifications











