ఆ సినిమా డిజాస్టర్‌కు తప్పు నాదే.. డైరెక్టర్‌ను బలిపశువు చేయలేదు.. అఖిల్ బాకీ తీర్చుకొంటా.. అనిల్ సుంకర

అక్కినేని వారసుడు అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. ఆ సినిమా డిజాస్టర్ తర్వాత నిర్మాత అనిల్ సుంకర చేసిన ట్వీట్ భారీ చర్చకు దారి తీసింది. బైండెడ్ స్క్రిప్టు లేకపోవడం వల్లే ఏజెంట్ సినిమా డిజాస్టర్ అయింది అంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం సృష్టించాయి. సామజవరగమన సినిమా సక్సెస్ సందర్భంగా మీడియాతో అనిల్ సుంకర మాట్లాడుతూ..

చిరంజీవితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, ఇమేజ్‌కు పక్కాగా సూట్ అయ్యే సినిమా భోళాశంకర్. కీర్తీ సురేష్, చిరంజీవి పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా పండింది. చక్కటి ఫ్యామిలీ మూవీ. చిరంజీవితో పనిచేయడం మంచి అనుభవం కలిగింది. చాలా విషయాలు చెప్పేవారు. ఈ సినిమా షూటింగ్‌ను చాలా ఎంజాయ్ చేశాను అని అనిల్ సుంకర తెలిపారు.

Producer Anil Sunkara reaction on Agent movie disaster at Samajavaragamana success meet

ఏజెంట్ డిజాస్టర్ తర్వాత నేను చేసిన ట్వీట్‌లో ఏం తప్పులేదు. డైరెక్టర్‌ను నిందించలేదు. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా చేయడం తప్పు. సినిమా విషయంలో నా జడ్జిమెంట్ పూర్తి తప్పింది. ఈ సినిమా డిజాస్టర్ కావడం అందరిది తప్పే. అందరి కంటే నాదే తప్పు. ఆ ఫలితాన్ని అందరం అనుభవించాల్సిందే. ఒకరిని నిందించడం తప్పుపట్టడం నా ట్వీట్ ఉద్దేశం కాదు అని అనిల్ సుంకర తెలిపారు.

సినిమా డిజాస్టర్ అయితే నాపై ఎవరు కూడా ఒత్తిడి తీసుకురాలేదు. నాపై ఎవరు ఒత్తిడి చేయలేదు. ఏజెంట్ సినిమా విషయంలో ఫస్ట్ అనుకొన్నది వేరు. భారీ బడ్జెట్ కాబట్టి ప్లాన్ వేరే ఉంది. సినిమా ప్రారంభం తర్వాత కోవిడ్ వచ్చింది. బుడాపెస్ట్ షూటింగ్ తర్వాత ఆ ప్రాజెక్టు మా చేతి నుంచి జారి పోయింది. దానికి నేనే ఎక్కువగా బాధ్యత వహిస్తాను అని అనిల్ సుంకర తెలిపారు.

మా బ్యానర్‌ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌పై ఒక గౌరవం ఉంది. ఏజెంట్ సినిమా ద్వారా అఖిల్ కెరీర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లేలా సినిమా చేయాలని అనుకొన్నాం. డైరెక్టర్ సురేందర్ రెడ్డి, నేను మంచి ప్లాన్ చేశాం. కానీ కొన్ని కారణాల వల్ల వర్కవుట్ కాలేదు. సినిమా ఫ్లాప్ అయిన తర్వాత మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. దాదాపు రెగ్యులర్‌గా అఖిల్, సురేందర్ రెడ్డి మాట్లాడుకొంటాం అని అనిల్ సుంకర చెప్పారు.

Producer Anil Sunkara reaction on Agent movie disaster at Samajavaragamana success meet

అఖిల్ కెరీర్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లాలనే కోరిక ఇంకా ఉంది. అఖిల్ బాకీ తీర్చుకొంటాను. మేము మంచి సినిమా ప్లాన్ చేస్తున్నాం. అఖిల్‌కు మంచి హిట్ ఇచ్చే విషయంలో రాజీ లేదు. నాగార్జున అక్కినేనితో సినిమా తీయాలనే డ్రీమ్ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. త్వరలోనే నాగార్జునతో సినిమా చేయాలని ఆలోచిస్తున్నాం అని అనిల్ సుంకర్ అన్నారు.

చిన్న సినిమా సేఫా? పెద్ద సినిమా సేఫా? అనేది ఏమీ లేదు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా సేఫే. నేను పెద్ద సినిమాలు చేయడాన్ని ఎంజాయ్ చేస్తాను. ఆ సినిమాలకు సినిమాల థియేటర్ల సంఖ్య, ప్రమోషన్స్ మంచి జోష్ కలిగిస్తాయి అని అనిల్ సుంకర్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X