Samajavaragamana శ్రీవిష్ణు కాకుండా నాని లేదా మరో హీరో ఉంటే? అనిల్ సుంకర జవాబు ఏమిటంటే?
యువ హీరో శ్రీవిష్ణు, హీరోయిన్ రెబ్బా మోనిక జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం సామజవరగమన. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో భారీ కలెక్షన్లను సాధిస్తున్నది. ఈ నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర మీడియాతో మాట్లాడుతూ..
సమజవరగమన సినిమా ప్రివ్యూలు వేసినప్పుడు ముందు రోజు మాకు కొంత టెన్షన్ ఉంది. ప్రీమియర్ల తర్వాత మాకు కొంత కాన్ఫిడెన్స్ వచ్చింది. సినిమా రిలీజ్ తర్వాత వస్తున్న రెస్సాన్స్ చూస్తే చాలా రిలీఫ్‌గా ఉంది. సినిమా పెద్ద విజయం సాధించడం చాలా హ్యాపీగా ఉంది. మా బ్యానర్‌లో వరుస ఫ్లాపుల తర్వాత ఇలాంటి విజయం దక్కడం చాలా ఆనందంగా ఉంది అని నిర్మాత అనిల్ సుంకర అన్నారు.

మా బ్యానర్ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆరంభంలో వచ్చిన సినిమాలు భారీ విజయాలు అందుకొన్నాయి. ఇటీవల కాలంలో కొన్ని సినిమాలు మా అంచనాలు తప్పాయి. సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. వేరే బ్యానర్లతో చేసిన సినిమాలు మంచి విజయాలు అందుకోవడం చాలా హ్యాపీగా ఉంది అని అనిల్ సుంకర చెప్పారు.
సామజవరగమన సినిమా కథను హీరో సందీప్ కిషన్ నా వద్దకు పంపాడు. అయితే ప్రస్తుతం ఉన్న టెన్షన్ల మధ్య నేను చిన్న సినిమాలు చేయనని సందీప్‌కు చెప్పాను. అయితే మీరు కథ వినండి. తప్పకుండా చేస్తారని డైరెక్టర్‌ను నా వద్దకు పంపారు. గంటన్నర సేపు కథ విన్న తర్వాత వెంటనే ఓకే చెప్పాను అని అనిల్ సుంకర తెలిపారు.

సామజవరగమన సినిమాలో హీరో పాత్రకు శ్రీ విష్ణు పక్కా ఛాయిస్ అని నమ్మాం. మైఖేల్ సినిమా ఉండటంతో సందీప్ కిషన్ ఈ సినిమాను వదులుకొన్నాడు. కథ చెప్పిన వెంటనే ఆ పాత్రకు నరేష్ అనుకొన్నాం. ఆయన కోసం రెండు నెలలు ఆగాం. ఆ పాత్రకు వస్తున్న స్పందన చూసిన తర్వాత మాకు హ్యాపీగా ఉంది అని అనిల్ సుంకర చెప్పారు.
సామజవరగమన సినిమాలో నాని, శర్వానంద్ ఉంటే బాగుంటుందనే కామెంట్ విన్నాం. కానీ ఈ సినిమాకు శ్రీ విష్ణు సరిపోతాడని నమ్మాం. శ్రీవిష్ణు బాగా చేశాడు. ఇలాంటి సినిమా చేయాల్సి వస్తే శ్రీవిష్ణుతోనే చేస్తాను. ఒకవేళ నాని, శర్వానంద్ ఉన్నా ఫలితం ఇలానే ఉండేది. కాకపోతే కలెక్షన్ల రేంజ్ పెరిగి ఉండేది. మహేష్ బాబుతో చేస్తే 200 కోట్లు వస్తాయి. చిరంజీవి గారితో చేస్తే మరో రేంజ్‌లో ఉంటుంది. అంతేగానీ సక్సెస్ విషయంలో ఎలాంటి మార్పు ఉండేది కాదు. శ్రీ విష్ణు, వీకే నరేష్ మధ్య డైలాగ్స్ సినిమాకు హైలెట్ అయ్యాయి అని అనిల్ సుంకర అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











