ఏజెంట్‌కు ముందు.. ఏజెంట్ తర్వాత.. మూవీ రిలీజ్ తర్వాత అఖిల్ రేంజ్ అలా: నిర్మాత అనిల్ సుంకర (ఇంటర్వ్యూ)

అక్కినేని నట వారసుడు అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి కాంబినేషన్‌లో వస్తున్న స్టైలిష్ యాక్షన్, స్పై థ్రిల్లర్ ఏజెంట్. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర నిర్మాణంలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్చ సురేందర్ 2 సినిమా బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌‌కు సిద్ధమవుతున్నది. రామబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైన నేపథ్యంలో నిర్మాత అనిల్ సుంకర మాట్లాడుతూ..

ఒకవైపు ఆనందం.. మరోవైపు ఒత్తిడి : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో ఏజెంట్ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాం. దాంతో మాకు ఓ వైపు ఎక్సైట్‌మెంట్ మరోవైపు ఒత్తిడికి గురవుతున్నాం. నిజాయితీగా చెప్పాలంటే.. మాపై ఒత్తిడి ఫలితం గురించి కాదు. గత నెల రోజులుగా మా యూనిట్ సభ్యులు రాత్రి, పగలు కష్టపడుతూ పని చేస్తున్నది. మా బ్యానర్‌లో చాలా బిగ్ మూవీ. ఈ సినిమాలో గంటన్నర కంప్యూటర్ గ్రాఫిక్ (సీజీ) వర్క్ ఉంది. ప్రతి ఫ్రేమ్‌లో సీజీ ఉంటుంది. మంచి అవుట్ పుట్ ఇవ్వాలనేది మాపై ఒత్తిడిని పెంచింది అని నిర్మాత అనిల్ సుంకర తెలిపారు.

Producer Anil Sunkara

ప్రేక్షకుడికి కొత్త అనుభూతి : ఏజెంట్ చిత్రం భారీగా టెక్నికాలిటీ ఉన్న చిత్రం. స్పై థ్రిల్లర్ కావడంతో చాలా వరకు అవుట్ డోర్‌లో షూటింగ్ చేశాం. దాదాపు ఎక్కువ భాగంగా బుడాపెస్ట్, ఓమన్ లాంటి ఫారిన్ లొకేషన్లలో భారీ యాక్షన్ సీన్లు షూట్ చేశాం. అలాంటి సీన్లను ఎడిట్, డీఐ చేసిన తర్వాత ఏదైనా మార్పులు చేయాల్సి వస్తే.. చాలా కష్టం. చిన్న తప్పులుంటే వదిలేయవచ్చు. కానీ ఏజెంట్ లాంటి మూవీని ప్రేక్షకుడికి కొత్త అనుభూతికి గురిచేసే థ్రిల్లర్‌గా అందించాలనేది మా ప్రయత్నం అని అనిల్ సుంకర్ చెప్పారు.

మార్కెట్ పరిధి పెరిగింది : ప్రస్తుతం సినిమా పరిశ్రమలో బడ్జెట్‌కు పరిమితులనేవి లేవు. మంచి కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. మంచి కంటెంట్ ఉంటే.. ఖర్చు ఎంతైనా వెనుకకు తీసుకురావొచ్చు. మేము ఈ ప్రాజెక్టు స్టార్ట్ చేసినప్పటికీ.. మార్కెట్ పరిధి పెరిగింది. అది మాకు అడ్వాంటేజ్‌గా మారిన అంశం. మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు అయిన బిజినెస్‌లో సగం వస్తే చాలూ అనుకొన్నాం. హిట్ పడితే మనది మనకు వచ్చేస్తుందనే నమ్మకం నిర్మాతకు ఉంటుంది అని అనిల్ సుంకర అన్నారు.

Producer Anil Sunkara

పాన్ ఇండియా రిలీజ్ ఎందుకు లేదంటే? : ఏజెంట్ సినిమాను పలు భాషల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనతో మొదలుపెట్టాం. అయితే ఇండియా మొత్తం రిలీజ్ చేయాలంటే మూడు నెలల సమయం ఉండాలి. ప్రస్తుతం తెలుగు, మలయాళంలో రిలీజ్ చేసి ఆ తర్వాత మిగితా భాషల్లో రెండు వారాల తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇప్పటికే అన్ని భాషల డబ్బింగ్ పూర్తి చేసుకొన్నాం. బడ్జెట్ పరంగా ఎలాంటి ఇబ్బంది లేదు. ఏజెంట్ సినిమా తర్వాత అఖిల్ రేంజ్ మామూలుగా ఉండదు. ఏజెంట్‌కు ముందు.. ఏజెంట్‌కు తర్వాత అనే రేంజ్‌లో సినిమా ఉంటుంది అని అనిల్ సుంకర తెలిపారు.

Producer Anil Sunkara

సూపర్ హిట్ కావాలని కోరుకొంటాను : సినిమాను బిజినెస్‌లా చూస్తారా? లేదా ప్యాషన్‌తో చూస్తారా? అని అడిగితే.. నేను బిజినెస్‌గానే చూడాలనుకొంటాను. కానీ చివరికి సినిమా మాత్రం హిట్ కావాలని కోరుకొంటాను. పది కోట్లు కావాలా? సూపర్ హిట్ కావాలా? అని నిర్మాతను అడిగితే.. ప్రతీ ఒక్కరు సూపర్ హిట్ కావాలని కోరుకొంటారు. అలాగని హిట్ అయిన ప్రతీ సినిమాకు కాసులు రాలుతాయని చెప్పలేం అని అనిల్ సుంకర అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X