Slum Dog Husband పక్కా మాస్ ఎంటర్‌టైనర్.. ఆ విషయంపై సెటైర్.. నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ రెడ్డి
టాలీవుడ్‌లో సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, నూతన నటి ప్రణవి మానుకొండ జంటగా నటించిన చిత్రం స్లమ్ డాగ్ హజ్బెండ్ (Slum Dog Husband). రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పించిన ఈ చిత్రాన్నిమైక్ మూవీస్ బ్యానర్ నిర్మిస్తున్నది. ఈ చిత్రానికి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని జూలై 29న రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో నిర్మాతలు అప్పిరెడ్డి, వెంకట్ రెడ్డి ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..
మాది సూర్యాపేట జిల్లా. మాకు ఊరిలో థియేటర్ కూడా ఉండేది. ఆ థియేటర్ వల్ల మాకు సినిమాల మీద ఇష్టం ఏర్పడింది. వ్యాపారం కోసం విదేశాలకు వెళ్లాం. ఆ సమయంలో సినిమాపై ఉన్న ఇంట్రెస్ట్‌తో ఓ హాలీవుడ్ సినిమాను 2016లో నిర్మించాం. ఆ చిత్రానికి జురాసిక్ పార్క్ సినిమా సినిమాటోగ్రాఫర్ పని చేశారు. ఆ తర్వాత 2017 సంవత్సరంలో హైదరాబాద్‌కు వచ్చేశాం అని నిర్మాతలు తెలిపారు.

మేము మా బ్యానర్‌లో తొలిసారి జార్జిరెడ్డి చిత్రాన్ని నిర్మించాం. ఉస్మానియా యూనివర్సిటీలో రెబల్ లాంటి కథను చెప్పాలిని ఆ సినిమా తీశాం. మా సంస్థలో మంచి సినిమాలు అందించాలని నిర్ణయించుకొన్నాం. ప్రస్తుతం ఆరు సినిమాలు మా బ్యానర్ నుంచి రిలీజ్ కానున్నాయి. కొత్త దర్శకులతోనే సినిమాలు తీస్తున్నాం. అలాగే పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాం అని అప్పిరెడ్డి, వెంకట్ రెడ్డి చెప్పారు.
స్లమ్ డాగ్ హజ్బెండ్ అనేది పూర్తిగా వినోదంతో సాగే సినిమా. వినోదంతోపాటు ఓ సందేశాన్ని కూడా అందిస్తున్నాం. మూఢనమ్మకాల మీద సెటైర్‌లా ఉంటుంది. మంచి పాటలతో రిలీజ్‌కు ముందే మ్యూజికల్ ఎంటర్‌టైనర్ అనే ఫీల్‌ను కలిగించింది. కొత్తగా ఉండే కథ అందర్ని నవ్విస్తుంది. హీరో సంజయ్ డాగ్ లవర్. ఈ సినిమా ఆయనను కోరుకొన్నది. అని తెలిపారు.
ప్రతీ శుక్రవారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. బ్రో శుక్రవారం వస్తోంది. మేం శనివారం వస్తున్నాం. సినిమా ఆద్యంతం నవ్వుకునేలా ఉంటుంది. సంగీతం బాగుంటుంది. ఓ రెండు గంటల పాటు ప్రేక్షకులను నవ్విస్తాం.
సీనియర్ నటులు బ్రహ్మాజీ స్లమ్ డాగ్ హస్పెండ్‌ను నమ్మారు. మా కంటే ఆయనే ముందుండి ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఆయన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. స్లమ్ డాగ్ హజ్బెండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు శ్రీలీల, సుకుమార్ గారు ముఖ్య అతిథులుగా రాబోతోన్నారు. జూలై 27న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతోన్నాం అని చెప్పారు.


Click it and Unblock the Notifications











