మూవీ సూపర్ హిట్ అయినా నిర్మాతకు నష్టాలే.. హీరోల రెమ్యునరేషన్లపై నిర్మాత బెక్కెం వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు

నూతన నటీనటులను, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులను పరిచయం చేస్తూ భారీ విజయాలతో దూసుకెళ్తున్న టాలీవుడ్ నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ఆయన జన్మదినం ఏప్రిల్ 27వ తేదీ. 2006లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన బెక్కెం వేణుగోపాల్ నిర్మాతగా ఆయన 16వ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా తన విజయయాత్రను, నిర్మాతగా ఆయన అనుభవాలను, అనుభూతులను మీడియాతో పంచుకొంటూ..

కార్తీక్ దండుతో ఏడేళ్ల పరిచయం : విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో నాకు సుదీర్ఘమైన పరిచయం ఉంది. నాకు ఒక మంచి కథ చెప్పాడు.. అది నాకు నచ్చింది. విరూపాక్ష సినిమా ఆయనకు మంచి హిట్ వచ్చింది. ఆ సక్సెస్‌ను ఎంజాయ్ చేయనివ్వండి. నాతో సినిమా చేస్తాడా? లేదా అనేది ఆయన చెబితే మంచింది. కార్తీక్ దండుతో నాకు ఏడేళ్ల పరిచయం. కథ అద్బుతంగా చెబుతాడు. కథ చెప్పేటప్పుడే ఒక డిఫరెంట్ వరల్డ్‌లోకి తీసుకెళ్తాడు. కథ చెప్పే విధానం బాగుంటుంది. ఆయన ఇంకా భారీ విజయాలు అందుకోవాలని నేను భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.

Bekkem Venugopal

కొత్తవారితో సినిమాలు చేయడం రిస్కే : కొత్త వాళ్లతో సినిమాలు చేస్తూ హిట్ కొట్టడం వెనుక నేను కథను నమ్ముకోవడమే. కొత్త వారిని పరిచయం చేస్తూ సినిమాలు తీయడం రిస్కే. కానీ నేను కథలను నమ్ముకొంటాను. లిరిక్, మ్యూజిక్, యూత్ సినిమాలను నేను టార్గెట్ చేస్తాను. ఇప్పుడు రోటి కపడా రొమాన్స్ సినిమా తీస్తున్నాను. నిర్మాతగా నా నెక్ట్స్ సినిమా అదే. షూటింగ్ దాదాపు పూర్తి కావొచ్చింది అని బెక్కెం వేణుగోపాల్ తెలిపారు.

అగ్ర నిర్మాతలకు అలాంటి కష్టాలు : నిర్మాతగా కొనసాగుతూ నటించాలనే కోరిక ఉంది. రామానాయుడు మాదిరిగా నేను గెస్ట్ రోల్స్ చేయాలని ఉంది. అంతేగానీ.. నేను దర్శకత్వం చేపట్టను. నిర్మాత అనేవాడు రోజు యాక్టింగ్ చేస్తూనే ఉంటాడు. ఇక కొత్తగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడూ నిర్మాతల పరిస్థితి క్లిష్టపరిస్తితే. బిజినెస్‌పై అవగాహన ఉండి.. అనుభవం ఉన్న నిర్మాతలు తీసే సినిమాల్లో 50 శాతమే విజయం సాధిస్తున్నాయి. మిగితా 50 శాతంలో 30 శాతం కొంత ప్రాఫిట్ వస్తున్నాయి. అనుభవం లేని నిర్మాతలు సినిమాలు తీసి నష్టాలను చవిచూస్తున్నారు అని బెక్కెం వేణుగోపాల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Bekkem Venugopal

కథలు కాకుండా కాంబినేషన్లను నమ్ముకొని.. : సినిమాల మీద సోకుతో సినిమాలు తీస్తూ బిజినెస్ మీద అనుభవం లేని కారణంగా నష్టాల బారిన పడుతున్నారు. ప్రతీ సంవత్సరం 150 మంది సినిమాలు తీస్తే. అందులో 20 మంది అనుభవం ఉన్న నిర్మాతలే నిలబడగలుగుతున్నారు. 130 మంది నిర్మాతలు కొత్తవారే. ఇప్పుడు కథలు నమ్ముకొని సినిమాలు తీసేవారు చాలా తక్కువ. హీరోలు, డైరెక్టర్ల కాంబినేషన్లు నమ్ముకొనే తీసేవారు ఎక్కువయ్యారు. దాని వల్ల సినిమాలు సూపర్ హిట్ అయినా నిర్మాతలకు డబ్బులు రావడం లేదు. కాంబినేషన్లు నమ్ముకొని హీరోలకు చెల్లించే రెమ్యునరేషన్ల వల్ల నిర్మాతలు నష్టపోతున్నారు అని బెక్కెం వేణుగోపాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bekkem Venugopal

చివరి శ్వాస వరకు సినిమా రంగంలోనే.. : నిర్మాతగా చివరి శ్వాస వరకు సినిమాలు నిర్మించడమే నా చివరి లక్ష్యం. అంతకు మించిన టార్గెట్ ఏమీ లేదు. మంచి సినిమాలు తీసి మంచి నిర్మాత అనిపించుకొంటాను. కథలను నమ్మి సినిమాలు చేయడాన్ని కొనసాగిస్తాను. ప్రస్తుతం కొత్తవాళ్లతో రోటి కపడా రొమాన్స్, అలాగే సుడిగాలి సుధీర్‌తో పాగల్ డైరెక్టర్ నరేష్‌తో చంద్రశేఖరరెడ్డితో సినిమా చేస్తున్నాను. ఓటీటీ కోసం రెండు సినిమాలు తీస్తున్నాను. అందులో అవికా గోర్‌తో స్వరూప్ డైరెక్టర్‌తో థ్రిల్లర్ చేస్తున్నాం అని వేణు బెక్కెం తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X