Kalki 2898 AD Part 2: కల్కి 2898 ఏడి పార్ట్ 2 షూటింగ్ పరిస్థితి ఏంటి? రిలీజ్ డేట్ ఎప్పుడంటే?

ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా సెలెబ్రేట్ చేసుకుంటున్న మరో బిగ్గెస్ట్ సక్సెస్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది రెబల్ స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన తాజా చిత్రం "కల్కి 2898 ఎడి" అనే చెప్పుకోవాలి. అన్ని ముఖ్య భాషలు నుంచి కీలక నటుల సమాహారంతో దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఆసక్తికరంగా అన్ని భాషలు ఆడియెన్స్ ని మెప్పించింది. ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సాధిస్తున్న సమయంలో నిర్మాత మీడియాతో మాట్లాడుతూ.. పార్ట్ 2 రిలీజ్ డేట్ గురించి ఏం చెప్పారంటే?

ఇటీవల కాలంలో ఎప్పుడూ లేని విధంగా ఓ సినిమాని ఇతర భాషలకి చెందిన దర్శకులు ప్రముఖులు అంతా కొనియాడుతూ వస్తుండడం మరొక ఎత్తు అని చెప్పాలి. కాగా మరి ఇంతలా సెలెబ్రేట్ చేసుకుంటున్న ఈ సినిమా సక్సెస్ తో అయితే మేకర్స్ రివీల్ చేసిన పార్ట్ 2 పై కూడా అందరిలో చాలా ఆసక్తి నెలకొంది. కాగా సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి బిగ్ స్టార్ నే కల్కి 2 కోసం వెయిట్ చేస్తున్నా అని అశ్వినీదత్ తెలిపారు.

Producer C Ashwinidutt leaks kalki 2898 AD part 2 shoot and release date

దీనితో కల్కి 2 కోసం అంచనాలు ఎలా ఉన్నాయో అర్ధం చేసుకోవచ్చు. మరి అసలు ఇన్నేళ్ల సమయంలో మేకర్స్ కేవలం ఒక్క మొదటి భాగాన్ని మాత్రమే షూట్ చేసారా? ఒకవేళ అంతే చేస్తే ఇక పార్ట్ 2 పూర్తి కావడానికి ఇంకెన్నాళ్లు పడుతుంది అని చాలా ప్రశ్నలే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా ఈ పార్ట్ 2 సంబంధించి ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది అని అశ్వినీదత్ పేర్కొన్నారు.

స్వయంగా నిర్మాత అశ్వినీ దత్ పార్ట్ 2 షూటింగ్ 60 శాతం పూర్తయ్యిపోయింది అని బిగ్ అప్డేట్ అందించారు. అలాగే రిలీజ్ ఎప్పుడు అనేది ఇంకా క్లారిటీ ఇవ్వలేదు కానీ ప్రస్తుతానికి ఉన్న బజ్ ప్రకారం అయితే ఈ సినిమా విడుదల వచ్చే ఏడాది కాకుండా ఆ మరు ఏడాది ఉంటుంది అని తెలుస్తుంది. అంటే కల్కి రెండో భాగం 2026లో వస్తుందని ఆయన వెల్లడించారు.

Producer C Ashwinidutt leaks kalki 2898 AD part 2 shoot and release date

ఇంకా మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం ఏమిటంటే ప్రభాస్ మరియు కమల్ నడుమ యాక్షన్ సీక్వెన్స్ లు మైండ్ బ్లోయింగ్ లెవెల్లో నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్నాడని వినిపిస్తుంది. మొత్తానికి అయితే పార్ట్ 1 ని మించి మరింత గ్రాండ్ లెవెల్లో సినిమా ఉండబోతుంది అని చెప్పాలి. అలాగే ఈసారి పార్ట్ 2 ని అయితే ప్రపంచ వ్యాప్తంగా మరింత చేరువయ్యేలా ఇంటర్నేషనల్ భాషల్లో కూడా విడుదల చేసేలా నాగ్ అశ్విన్ అండ్ టీం ప్లాన్ చేస్తున్నారని నిర్మాత తెలిపారు.

కల్కి పార్ట్ 1 మూవీలో ప్రభాస్ రోల్ చిన్నగా ఉన్నప్పటికీ.. ఆయన అభ్యంతరం చెప్పలేదు. ఆయన సహకారం లేకపోతే కల్కి 2898 ఏడీ సినిమా బయటకు రాకపోయేది. అందుకే ఆయనను డార్లింగ్ అంటారు. కల్కి సినిమా బోర్డుపైకి కమల్ రావడం సర్‌ప్రైజింగ్ అనిపించింది. మిగితా వారందరినీ ముందు నుంచే ప్లాన్ చేశాం అని ఆయన చెప్పారు.

దీనినే రీసెంట్ గా కమల్ కూడా మెన్షన్ చేశారు. మరి చూడాలి కల్కి రెండో భాగం ఎలా ఉంటుందో చూడాలి అని అభిమానులు, ఆడియెన్స్ ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పుడు పార్ట్ 1 అయితే భారీ వసూళ్లతో దుమ్ము లేపుతూ బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తుంది. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె లు అత్యంత కీలక పాత్రలు పోషించగా విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ లాంటి యంగ్ నటీనటులు కూడా కీలక పాత్రలు పోషించారు. అలాగే సంతోష్ నారాయణన్ ఈ సినిమాని సంగీతం అందించిన విషయం తెలిసిందే.

More from Filmibeat

Read more about: prabhas amitab bachchan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X