‘నేను బతికి ఉండగా ఆ హీరోలతో సినిమాలు తీయను.. ఆ ఇద్దరు నిర్మాతకు విలువ ఇవ్వడం లేదు’

తెలుగు సినిమా పరిశ్రమలో సుదీర్ఘమైన కెరీర్ ఉన్న నిర్మాత, దర్శకుల్లో చదలవాడ శ్రీనివాసరావు ఒకరంటే ఎలాంటి సందేహం అక్కర్లేదు. నిర్మాతగా, డిస్టిబ్యూటర్‌గా, దర్శకుడిగా ఆయన తనదైన శైలిలో రాణిస్తున్నారు. బిచ్చగాడు లాంటి సినిమాను భారీగా అందించాడు. తాజాగా భారీ బడ్జెట్‌తో కొత్త హీరోలతో రికార్డ్ బ్రేక్ అనే పాన్ ఇండియా సినిమాను మార్చి 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమా గురించి, తన సుదీర్ఘమై కెరీర్ గురించి ఆయన మాట్లాడుతూ..

రికార్డు బ్రేక్ సినిమాను సుమారుగా రెండేళ్ల కాలంలో నిర్మించాను. ఎందుకంటే కరోనా తర్వాత ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. క్వాలిటీ కంటెంట్ ఉంటే సినిమాను భారీగా ఆదరిస్తున్నారు. బిచ్చగాడు సినిమా అందించిన తర్వాత కంటెంట్ ఉంటే ఎలాంటి సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారనే మంచి నమ్మకం కుదిరింది. అందుకే ప్రేక్షకుల హృదయాలకు హత్తుకొనేలా భారీగా ఖర్చు చేసి మంచి కంటెంట్‌తో అందిస్తున్నాం. అందుకే కొంత ఎక్కువ సమయం పట్టింది అని చదవలవాడ శ్రీనివాసరావు తెలిపారు.

Producer Chadalavada Srinivasa Rao sensational Comments on Heros Directors in Tollywood in Record Break Promotions

రికార్డు బ్రేక్ సినిమాపై ఉన్న నమ్మకాన్ని ట్రైలర్ మరింత పెంచింది. ఇక ఇటీవల మీడియాకు వేసిన స్పెషల్ షో తర్వాత మాలో మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది. సినిమా చూసిన వారంతా ఈ సినిమాకు టైటిల్ పూర్తిగా జస్టిఫై అయిందని చెప్పారు. సినిమా రిలీజ్ తర్వాత మాకున్న నమ్మకాన్నే ప్రేక్షకులు కూడా వెల్లడిస్తారనే ఆశాభావంతో ఉన్నాం అని అన్నారు.

మా సినిమాకు కొత్తవాళ్లే కరెక్ట్. మేము అనుకొన్న కథకు, క్యారెక్టర్లకు కావాల్సిన విధంగా బాడీ ఉన్న హీరోలు ఎవరు లేరు. గతంలో రామారావు, కృష్ణంరాజు లాంటి ఉండేవాళ్లు. ప్రస్తుతం నిహిర్ కపూర్, నాగార్జున ఈ పాత్రలకు కరెక్ట్‌గా సూట్ అయ్యారు. కథపై ఉన్న నమ్మకంతోనే భారీగా కూడా ఖర్చు పెట్టాం. క్వాలిటీగా గ్రాఫిక్స్‌తో సినిమాను అందిస్తున్నాం అని తెలిపారు.

Producer Chadalavada Srinivasa Rao sensational Comments on Heros Directors in Tollywood in Record Break Promotions

ఈ సినిమాలో మదర్ సెంటిమెంట్ అందరి హృదయాలను హత్తుకొనేలా ఉంటుంది. ఈ మూవీలో తన బిడ్డల కోసం తల్లి ఏం చేసిందనే కాన్సెప్ట్ అందరికి కనెక్ట్ అవుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అందర్నీ కదలిస్తుంది. తన బిడ్డల కోసం తల్లి తన రక్తాన్ని అమ్మి లడ్డూలు తినిపించే సీన్ బాగుంటుంది. నాకు ఇష్టమైన సీన్ కూడా అదే అని నిర్మాత చదలవాడ చెప్పారు.

ప్రస్తుత సినిమా రంగంలో నిర్మాతకు విలువ లేదు. దర్శకుడు, హీరో ఒక్కటై నిర్మాతకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదు. సినిమాల సక్సెస్ రేట్ గణనీయంగా తగ్గడానికి ప్రధాన కారణం ఇదే. నేను బతికి ఉండగా పెద్ద హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలు తీయను. నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉండటానికి కారణం భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు చేయకపోవడమే అని అన్నారు.

నిర్మాతగా నేను ఎన్నో సినిమాలు చేశాను. ఈ సినిమాతో డైరెక్షన్ ఎలా చేయాలో తెలుసుకొన్నాను. ఈ సినిమా సక్సెస్ తర్వాత హై స్టాండర్డ్ టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో సినిమాలు తీస్తాను. వార్నర్ బ్రదర్స్ స్థాయిలో గొప్ప సినిమాలు తీస్తాను. ఈ సినిమా చూసి ప్రేక్షకుల మంచి మార్కులు వేస్తే మంచి సినిమాలు తీస్తాను అని చదలవాడ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X