Producer Chiranjeevi Interview స్టార్ హీరోతో చేయాల్సిన మూవీ.. కిరణ్‌ అబ్బవరంతో మీటర్ ఎందుకు చేశామంటే?

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మాతలు నవీన్ యెర్నేనీ, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత నిర్మించిన చిత్రం మీటర్. యువ హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ అతుల్య రవి జంటగా నటించిన ఈ సినిమా మాస్, యాక్షన్, ఎంటర్‌టైనర్‌గా రూపొందింది. దర్శకుడు రమేష్ కడూరి రూపొందించిన ఈ సినిమా ఏప్రిల్ 7వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో నిర్మాత చెర్రీ మాట్లాడుతూ...

 బాక్సాఫీస్ వద్ద మీటర్ రేంజ్ ఎంతంటే?

బాక్సాఫీస్ వద్ద మీటర్ రేంజ్ ఎంతంటే?


మీటర్ సినిమా బాగా వచ్చింది. ఈ సినిమాపై మాకు ఉన్న కాన్ఫిడెన్స్ మరింత పెరిగింది. టీజర్, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో బాక్సాఫీస్ విషయంలో మా మీటర్ 100 స్పీడ్‌లో సాగుతుంది. ఈ సినిమా హై స్పీడ్‌లో ఉంటుంది. దర్శకుడు దర్శకుడు రమేష్ కడూరి కథ చెప్పినప్పుడు స్టార్ హీరోతో చేద్దామని ప్రయత్నించాం. పెద్ద హీరోలందరూ బిజీగా ఉండటంతో కుదర్లేదు. దాంతో ఎస్ఆర్ కల్యాణమండపంతో హిట్ మీద ఉన్న కిరణ్ అబ్బవరంకు కథ చెప్పాం. తనకు నచ్చడంతో ఈ సినిమా ప్రారంభమైంది. ఖచ్చితంగా ఇది పెద్ద హీరోతో చేసే కథే. అయితే రమేష్ కి పెద్ద హీరోతో కుదరలేదు అని చెర్రీ చెప్పారు.

మీటర్ పక్కా కమర్షియల్ మూవీ

మీటర్ పక్కా కమర్షియల్ మూవీ


నిర్మాతగా నేను నా కెరీర్ ఆరంభంలో ప్రయోగాత్మక చిత్రాలను నిర్మించాను. గోపిచంద్‌తో ఒక్కడున్నాడు, మత్తు వదలరా, హ్యాపీ బర్త్ డే లాంటి చిత్రాలతో ప్రయోగం చేశాం. తొలిసారి మేము పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తోపాటు ఎంటర్‌టైన్‌మెంట్‌తో మీటర్ సినిమాను చేశాం. బలమైన కథతోపాటు పాటలు, ఫైట్స్, కామెడీ అన్నీ చక్కగా కుదిరాయి. ఈ సారి మంచి కథను కమర్షియల్‌గా చెప్పబోతున్నాం. బాబీ, గోపిచంద్ మలినేని వద్ద పనిచేసిన రమేష్ మా అంచనాలకు మించి అవుట్‌పుట్ ఇచ్చారు అని చెర్రీ తెలిపారు.

 కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్ అద్భుతం

కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్ అద్భుతం


యువ హీరో కిరణ్ అబ్బవరం మేనరిజం, ఎనర్జీ, స్టయిల్‌కు తగినట్టుగానే మీటర్ ఉంటుంది. ఇప్పటికే చాలా సినిమాలు చేసిన కిరణ్.. మంచి ఈజ్ ఉన్న నటుడు. దర్శకుడు రమేష్ విజన్‌కు తగినట్టే కిరణ్ అబ్బవరం ఫెర్ఫార్మెన్స్ అద్బుతంగా ఉంటుంది. మీటర్ మేము అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువగానే అయింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్‌గా ఉండాలని మేము రాజీ పడలేదు. కొన్నిసార్లు బడ్జెట్ పరంగా అంచనాలు తప్పుతాయి. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబట్టే సినిమా అని చెర్రీ అన్నారు.

 31 ఏళ్ల నా జర్నీలో

31 ఏళ్ల నా జర్నీలో


టాలీవుడ్‌లో నా జర్నీ 31 సంవత్సరాలుగా కొనసాగుతున్నది. మనీ, మనీ మనీ, గులాబీ, రంగీలా, యమలీల, ఒక్కడున్నాడు లాంటి సినిమాలకు పనిచేశాను. వ్యాపార అవకాశాల కోసం కొన్నాళ్లు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాను. మైత్రీ మూవీస్ బ్యానర్ ఏర్పాటు తర్వాత వారి కోరిక మేరకు నేను నవీన్, రవిశంకర్‌తో కలిశాను. మైత్రీ మూవీస్‌తో పనిచేస్తూనే నేను సొంతంగా ప్రొడక్షన్ చేస్తున్నాను. చిన్న సినిమాలు చేసే అవకాశం వస్తే వారు నాకు సపోర్ట్‌గా ఉంటున్నారు అని చెర్రీ చెప్పారు.

 కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వస్తారు..

కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు వస్తారు..


సినిమా బాగుంటే.. చిన్న సినిమా పెద్ద హీరోల మూవీనా అని ప్రేక్షకులు చూడటం లేదు. రైటర్ పద్మభూషణ్, బలగం లాంటి చిన్న చిత్రాలను ఆలరించారు. సంక్రాంతి రేసులో వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యకు బ్రహ్మండమైన ఆదరణను చూపించారు. ఇలాంటి పరిస్థితులను చూస్తే.. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారని అర్ధం అని చెర్నీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X