Sabari సినిమా నాకు ప్యాషన్.. ఆ రకంగా బిజినెస్.. శబరి గురించి మహేంద్రనాథ్ కూండ్ల

అమెరికాలో వ్యాపార రంగంలో రాణిస్తున్న మహేంద్రనాథ్ కూండ్ల సినిమా రంగంపై ఉన్న అభిరుచితో నిర్మాతగా మారారు. యాంగ్రీ యంగ్ ఉమెన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన శబరి చిత్రం మే 3వ తేదీన రిలీజ్ కానున్నది. మహర్షి కూండ్ల సమర్పిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ అవుతున్నది. ఈ నేపథ్యంలో మహేంద్రనాథ్ తెలుగు ఫిలింబీట్‌తో మాట్లాడుతూ..

అమెరికాలో నాకు రకరకాల బిజినెస్‌లు ఉన్నాయి. ఆ బిజినెస్ మాదిరిగానే సినిమా నిర్మాణం అనే బిజినెస్ కూడా చూస్తాను. వరలక్ష్మీ శరత్ కుమార్‌తో మూవీ అనగానే ఎవరూ బెదిరించలేదు. ఆమెతో నా మొదటి సినిమా చేయాలనే ప్లాన్ కూడా లేదు. డైరెక్టర్ వచ్చి నాకు కథ చెప్పడంతో అలా కుదిరింది.

అప్పటికే శబరి కథను వరలక్ష్మీ శరత్ కుమార్‌కు డైరెక్టర్ చెప్పారు. ఆమె సినిమా చేయడానికి అంగీకరించారు. ఆ తర్వాత నా వద్దకు ఈ ప్రాజెక్టు వచ్చింది. ఈ ప్రాజెక్టుకు ఆమె కరెక్టా? కాదా అనుకొన్నాను. ఆ తర్వాత నేను ప్రోసీడ్ అయ్యాను అని మహేంద్రనాథ్ కండ్రా తెలిపారు.

Producer Mahendra Nath Kondla about Varalaxmi Sarathkumar s Sabari movie Production and Making

నేను ఫస్ట్ సినిమా నిర్మాణంలోకి వచ్చాను. అలాగని నేను ఓ స్క్రిప్టు పట్టుకొని పది మంది నటుల వద్దకు తిరగలేదు. రెడీమెడ్ ప్రాజెక్టు నా ముందుకు వచ్చింది. నేను సినిమా ఎలా చేయాలనే విషయం గురించి ఆలోచించకుండా ముందుకెళ్లాను. వరలక్ష్మీ శరత్‌కుమార్ సినిమా ఒప్పుకొందంటే.. ఆ కథలో విషయం ఇంకా ఏమీ ఆలోచించలేదు అని మహేంద్రనాథ్ చెప్పారు.

Producer Mahendra Nath Kondla about Varalaxmi Sarathkumar s Sabari movie Production and Making

సినిమా నిర్మాణం నాకు ప్యాషనా? బిజినెసా? అని అడిగితే.. సినిమా రంగంలోకి అడుగు పెట్టాలనే కోరికను పరిగణనలోకి తీసుకొంటే.. ప్యాషన్‌గా భావిస్తాను. చేయడానికి బిజినెస్. నా ప్యాషన్ కోసం ఎప్పుడూ సినిమాలు తీయను. కానీ ఆడియెన్స్ కోసం సినిమా చేస్తాను. దీనిని ప్యూర్‌గా సినిమాను బిజినెస్‌గానే చూస్తాను అని ఆయన తెలిపారు.

Producer Mahendra Nath Kondla about Varalaxmi Sarathkumar s Sabari movie Production and Making

ప్యాషన్‌తో సినిమాలు ఒకట్రెండు చేస్తాం. కానీ అవి వర్కవుట్ కాకపోతే.. బిజినెస్‌గానే చూడాల్సి వస్తుంది. ఈ రంగంలో ఎక్కువగా రిస్క్ ఉంటుంది. నాకు సినిమాలంటే ఇష్టం. చిన్నప్పటి నుంచి ప్యాషన్ ఉంది. నా వయసు మళ్లినా తర్వాత నేను నేను అనుకొన్నది చేయలేకపోయాననే బాధ ఉండకూడదు. నష్టాలు ఉంటాయని తెలిసి కూడా రిస్క్ తీసుకోవడానికి ఈ సినిమా నిర్మాణంలోకి వచ్చాను అని మహేంద్ర నాథ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X