కింగ్డమ్ అసలు బడ్జెట్ చెప్పిన నిర్మాత.. కానీ నాగ వంశీకి అదొక్కటే టెన్షన్

సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం తర్వాత పెద్ద హిట్ అందుకోలేకపోయాడు. కల్కి 2898 ఏడీలో క్యామియోతో అలరించాడు. ఇక విజయ్ దేవరకొండ క్రేజ్ తగ్గ ఒక్క సినిమానైనా ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కింగ్డమ్ పై భారీ ఆశలు ఉన్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో నిర్మాత నాగ వంశీ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

అసలు బడ్జెట్ ఇదీ...
విజయ్ దేవరకొండ కెరీయర్ లోనే ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించడం విశేషం. అయితే ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ఇప్పటి వరకు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. కానీ తాజాగా నిర్మాత నాగ వంశీ అసలు బడ్జెట్ వివరాలను వెల్లడించారు. కింగ్డమ్ చిత్రానికి ఏకంగా రూ.150 కోట్లు ఖర్చైందని చెప్పుకొచ్చారు. అన్నీ విధాలు సినిమాను తీర్చిదిద్దడానికి ఎక్కడా ఖర్చుకు వెనకాడ లేదని వెల్లడించారు.

Producer Naga Vamsi revealed actual budget

భారీ అంచనాలు పెంచేస్తూ..
ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి జెర్సీ చిత్రంతో ఐకానిక్ ఫిల్మ్ ను ప్రేక్షకులకు అందించిన సంగతి తెలిసిందే. మరోవైపు స్టార్ హీరో విజయ్ దేవరకొండ కూడా తన క్రేజ్ ను సినిమా సినిమాను పెంచుకుంటూనే ఉన్నారు. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో కింగ్డమ్ చిత్రం రూపుదిద్దుకోవడంతో భారీ అంచనాలు నెలకున్నాయి. ఇక నిర్మాత నాగ వంశీ కూడా సినిమాలో అన్నీ వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఉన్నాయని, ఎక్కడా కింగ్డమ్ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరచదని చెప్పుకొచ్చారు.

కింగ్డమ్ ప్రీ రిలీజ్ బిజినెస్..
మరో 10 రోజుల్లో కింగ్డమ్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ను ప్రారంభిస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్, పోస్టర్ల కారణంగా ఈ చిత్రానికి భారీ హైప్ నెలకొంది. దాంతో నార్త్ అమెరికాలో 2.1 మిలియన్ డాలర్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అక్కడ 18 కోట్ల రూపాయలు తిరిగి రాబట్టాల్సి ఉంది.

కింగ్డమ్ మూవీ వివరాలు..
విజయ్ దేవరకొండ 12వ చిత్రంగా కింగ్డమ్ చిత్రం రూపుదిద్దుకుంది. సితారా ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్యూన్ ఫర్ క్రియేషన్స్, శ్రీకర స్టూడియో బ్యానర్లలో సంయుక్తంగా రూపు దిద్దుకుంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్యలు నిర్మాతలుగా వ్యవహరించారు. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది. సత్యదేవ్ కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X