DJ Tillu: త్రివిక్రమ్ హ్యాండ్ తో నెక్స్ట్ లెవల్ కి.. అందుకే అలా ప్లాన్ చేశామన్న నాగవంశీ

యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం DJ టిల్లు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ నిర్మించిన ఈ సినిమా ప్రమోషన్స్ మంచి జోరుగా సాగుతున్నాయి. ముందుగా హీరో సిద్ధూ జొన్నలగడ్డ మీడియాతో ఇంటరాక్షన్ కాగా తాజాగా నిర్మాత మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. డీజే టిల్లు సినిమా గురించి నాగ వంశీ పంచుకున్న విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం

Recommended Video

DJ Tillu Sequel ? /Sidhu Jonnalagadda Clarifies | Neha Shetty | Filmibeat Telugu
సినిమా మరో లెవల్ కి

సినిమా మరో లెవల్ కి


సిద్దు జొన్నలగడ్డ హీరోగా నేహా శెట్టి హీరోయిన్ గా విమల్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం డీజే టిల్లు. పూర్తి అవుట్ అండ్ అవుట్ యూత్ అండ్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఫిబ్రవరి 11వ తేదీన విడుదల చేయాలని అనుకున్నారు కానీ ఒక రోజు వెనకకు వాయిదా వేసి 12 వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, నాగవంశీ డీజే టిల్లు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతోంది అని పేర్కొన్నారు.

సినిమా మరో లెవల్ కి

సినిమా మరో లెవల్ కి

సినిమా అవుట్‌పుట్‌తో మేము సంతోషంగా ఉన్నాము, ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నానని నిర్మాత నాగ వంశీ పేర్కొన్నారు. సినిమా కథతో ప్రేక్షకులు కనెక్ట్ అవుతారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నామని ఆయన అన్నారు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సహకారంతో, ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించడంతో ఈ సినిమా మరో లెవల్ కి వెళ్ళింది అని ఆయన పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సుదర్శన్‌ థియేటర్‌లో డీజే టిల్లు హౌస్‌ ఫుల్‌గా బుక్‌ అయిందని ఆయన తెలిపారు.

అందుకే యూత్ ఫుల్ సినిమా

అందుకే యూత్ ఫుల్ సినిమా

సినిమా కథ చెబుతున్న సమయంలోనే చాలా ఎంజాయ్ చేసాము అని సిద్ధు కథ చెబుతున్న సమయంలో నవ్వు ఆపుకోలేక పోయాను అని ఆయన చెప్పుకొచ్చారు. వింటున్న సమయంలో అలా ఉంటే సినిమా తెరకెక్కిన తర్వాత ఏ లెవల్లో ఉంటుందో తాను ఊహించగలనని ఆయన అన్నారు. ఇక సినిమా రీషూట్ జరిగిందా అని ప్రశ్నించగా కొన్ని సీన్స్ రీషూట్ చేశారని చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా ఇంకా థియేటర్ లోకి రావడం లేదని అందుకే యూత్ ఫుల్ సినిమా చేయడానికి ఆసక్తి చూపించామని వెల్లడించారు.

కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు

అయితే ఇది బోల్డ్ సినిమా మాత్రమేనని రొమాంటిక్ సినిమా కాదని చెప్పుకొచ్చారు. రవితేజ సినిమాతో పోటీగా విడుదల చేయడం ఎందుకు అనే ఉద్దేశంతో ఒక రోజు లేటుగా వస్తున్నామని అయినా సరే వాలెంటైన్స్ డే ఉండడంతో మా సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సినిమా అందరి అంచనాలను అందుకుంటుందని కచ్చితంగా థియేటర్లకు వచ్చి ఎంజాయ్ చేయవచ్చని ఆయన అన్నారు. ఎలాంటి లాజిక్స్ లేకుండా ఈ సినిమా చూస్తే కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.

ఏపీ సర్కార్ కోసమే వెయిటింగ్

ఏపీ సర్కార్ కోసమే వెయిటింగ్

పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాకు కూడా నాగ వంశీ కూడా నిర్మాత కావడంతో ఆ సినిమా రిలీజ్ మీద కూడా స్పందించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆ సినిమా గురించి మాట్లాడుతూ, తాము సినిమాతో సిద్ధంగా ఉన్నామని, రాత్రి కర్ఫ్యూ మరియు థియేటర్లలో 50 శాతం సీటింగ్ కెపాసిటీ వంటి కోవిడ్ ఆంక్షలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఎత్తి వేయడం కోసం మాత్రమే వేచి చూస్తున్నామని చెప్పారు.టికెట్ ధర గురించి ఇబ్బంది లేదు, అయితే థియేటర్లలో 100 శాతం ఆక్యుపెన్సీ కోసం వేచి ఉన్నాము, అలా అయితే ఎక్కువమంది వచ్చి సినిమాను చూసేందుకు వీలు కల్పిస్తుంది అని తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X