‘రీ రిలీజ్‌ల వెనుక అలాంటి మాఫియా.. స్టార్ హీరో భార్యల చేతివాటం..అలా నిర్మాతల నోర్లు కొడుతున్నారు’
తెలుగు సినిమా ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ కొనసాగుతున్నది. ఈ సినిమాలు బాక్సాఫీస్‌ను ఎంత ప్రభావితం చేస్తున్నాయంటే? కొత్త సినిమాలను కూడా భారీగా దెబ్బ తీస్తున్నాయి. తాజాగా ఇలాంటి అంశాలపై చిన్న నిర్మాత సంఘం తరఫున తన గళాన్ని వినిపించే నట్టి కుమార్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. థియేటర్ల బంద్ నుంచి రీ రిలీజ్ సినిమాల వెనుక కొనసాగుతున్న మాఫియాను నిర్మాత నట్టి కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. తెలుగు ఫిల్మీబీట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ కార్తీక్, వీడియో జర్నలిస్టు రామకృష్ణతో మాట్లాడుతూ..
స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేయడం వెనుక అసలు కారణం వేరే ఉంది. రీ రిలీజ్ కల్చర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేసింది నేనే. అయితే కొత్త సినిమాలపై రీ రిలీజ్‌లు భారీ ప్రభావం చూపుుతున్నాయి. దాంతో ఈ సినిమాలను సండే గానీ, సొమవారం గానీ రిలీజ్ చేయాలనే ప్రతిపాదన వస్తున్నది. అలా చేయడం వల్ల సినిమా పరిశ్రమకు మేలు జరుగుతుంది. కొత్త సినిమాల కలెక్షన్లపై ప్రభావం ఉండదు. ఇటీవల మంచి సినిమా భైరవం కలెక్షన్లను మహేష్ బాబు ఖలేజా రీ రిలీజ్ దెబ్బ తీసింది అని నిర్మాత నట్టి కుమార్ చెప్పారు.

గతంలో సికింద్రాబాద్‌లోని ఆర్పీ రోడ్డులో 104 డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు ఉండేవి. విశాఖపట్నంలో 75 ఆఫీసులు ఉండేవి. రాజమండ్రిలో 35 ఆఫీసులు ఉండేవి. వాళ్లందరి పరిస్థితి దీనస్థితిగా ఉంది. వారు డిస్ట్రిబ్యూటర్ అసోసియేషన్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కనిపిస్తున్నారే తప్పా.. సినిమా రిలీజ్ సమయంలో కనిపించడం లేదు. చాలా రకాలుగా నష్టపోయారు. అలాంటి వారికి సహాయం అందించే విధంగా రీ రిలీజ్ ప్లాన్ చేయాలని అనుకొన్నాం. కానీ సినిమాల రీ రిలీజ్‌ల్లో స్టార్ హీరోల భార్యలు, ఫ్యాన్స్, నిర్మాతలు తలదూర్చుతున్నారని నట్టి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
చిన్న నిర్మాతలు బతికేందుకు వీలుగా రీ రిలీజ్ చిత్రాలను ఇవ్వాలి. కానీ వాటిపై కూడా సినీ పెద్దలుగా చెప్పుకొనే బకాసురులు కన్నేస్తున్నారు. ఏపీ, తెలంగాణలో మూడు, నాలుగు ఆఫీసులు రన్ చేస్తున్నారో.. పెద్ద నిర్మాతలు, స్టార్ హీరోల భార్యలు, ఫ్యాన్స్, ఏపీలు రీ రిలీజ్ సినిమాల జోక్యం చేసుకొంటున్నారు. అలాంటి పరిస్థితి తీసుకొస్తే.. కోట్ల రూపాయల రెమ్యునరేషన్లు తీసుకొనేది హీరోలే.. ఇక రీ రిలీజ్ విషయంలో వారి వర్గం జోక్యం చేసుకొంటూ నిర్మాతను బతకనివ్వడం లేదు అని నట్టి కుమార్ అన్నారు.
స్టార్ హీరోల టీమ్, పెద్ద నిర్మాతలు బతకడానికో రీ రిలీజ్ ఉండకూడదు. చిన్న నిర్మాతలు బతికేందుకు రీ రిలీజ్ సినిమాల అవకాశం ఇవ్వాలి. పెద్ద సినిమాలు మీకే కావాలి. అధిక రెమ్యునరేషన్లు మీకే కావాలి? ఏదైనా సినిమా రి రీలీజ్ అయితే హీరోకు ఓ ట్రస్ట్ ఉంది. దానికి కలెక్షన్లలో మీరు కొంత పర్సంటేజ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి పర్సంటేజ్‌లు హీరోలు తమ రెమ్యునరేషన్ నుంచి 10 శాతమో.. లేదా కొంత మొత్తాన్ని తమ ట్రస్టుకు కేటాయించవచ్చు కదా? అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
స్టార్ హీరోల సినిమాలు రీ రిలీజ్ చేసే నిర్మాతల నుంచి డబ్బు లాగడం ఎందుకు? వారి నోరు కొట్టేది ఎందుకు? మీ ఫారిన్ ట్రిప్స్ ఆపుకొని ట్రస్ట్‌కు కేటాయించవచ్చు కదా. చిన్న సినిమా నిర్మాతను బతకనివ్వకుండా వారే మింగేస్తున్నారు. హీరో వద్ద ఉన్న ఫ్యాన్స్, పీఏ, ఫీఎస్ అందరూ మూకుమ్ముడిగా దాడి చేస్తున్నారు. మహేష్ బాబు సినిమాలు ఆయన ఫ్యాన్స్, పీఏలే చేస్తారు. భరత్ అనే నేను సినిమా రీ రిలీజ్ చేశాను. అయితే మేము రిలీజ్ చేస్తేనే సినిమా చూడండి అంటూ హీరో ఫ్యాన్స్ హుకుం జారీ చేశారు. దాంతో నేను చాలా నష్టపోయాను. కొన్ని సినిమాల్లో డబ్బులు వస్తాయి, పోతాయి.. ఇలాంటి వ్యవహారాన్ని చూసి.. హీరోల ఫ్యాన్స్‌కు, పీఏకు చెప్పకుండా ఖలేజా సినిమాను నేరుగా రిలీజ్ చేశారు. 12 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది అని నట్టికుమార్ పలు విషయాలు బయటపెట్టారు.


Click it and Unblock the Notifications











