మంత్రి మల్లారెడ్డిని అలా ఒప్పించాం. మేమ్ ఫేమస్ ప్రమోషన్స్‌కు అలా వైబ్.. నిర్మాత శరత్ చంద్ర

ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ , లహరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం మేమ్ ఫేమస్. ఈ సినిమాకు సుమంత్ ప్రభాస్ నటించడమే కాకుండా దర్శకత్వం, రచన బాధ్యతలను చేపట్టాడు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి నటించారు. అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 26న రిలీజ్‌కు సిద్దమైంది. ఈ సందర్భంగా అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

మూడు చిత్రాలు చేద్దామని..: చాయ్ బిస్కెట్, లహిరి మ్యూజిక్ కలిసి మూడు చిత్రాలు చేద్దామని అనుకొన్నాం. ఆ క్రమంలో చేసిన చిత్రం రైటర్ పద్మభూషణ్. రెండోది మేము ఫేమస్. మూడో చిత్రం కూడా త్వరలోనే చేద్దామని అనుకొంటున్నాం. కోవిడ్ సమయంలో చాయ్ బిస్కెట్, లహిరి ఫిల్మ్ ఈ నిర్ణయం తీసుకొన్నాం. రెండు సంస్థలు కూడా ఒకరిపై మరొకరు నమ్మకంతో ముందుకు వెళ్తున్నాం. మూడో ప్రాజెక్ట్‌ను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తాం అని నిర్మాత శరత్ చంద్ర తెలిపారు.

Producer Sharat Chandra

సుమంత్ ప్రభాస్‌ను పిలిచి...: కొత్త వారిని ఎంకరేజ్ చేయడం చాయ్ బిస్కెట్ ఎజెండా. అందులో భాగంగా యూట్యూబ్‌లో సుమంత్ ప్రభాస్ చేసిన సిరీస్ చూసి పిలిచాం. అయితే ఆ సమయంలో ఓటీటీలో సినిమా చేద్దామని అనుకొన్నాం. కానీ సుమంత్ ప్రభాస్ మాత్రం ఫీచర్స్ ఫిలిం చేద్దామని కాన్ఫిడెన్స్‌గా మాట్లాడాడు. దాంతో సరే నీవు కథ రాయి.. సినిమా చేద్దామని చెప్పాం. వాస్తవానికి సుమంత్ ప్రభాస్‌ను రైటర్, డైరెక్టర్‌గానే అనుకొన్నాం అని శరత్ చంద్ర చెప్పారు.

sharat chandra

సుమంత్ ప్రభాస్‌ను హీరోగా: సుమంత్ ప్రభాస్ కథ రాసుకొని వచ్చారు. మంచి ఫన్‌తో కూడిన స్క్రిప్ట్ రాశాడు. అయితే సుమంత్ ప్రభాస్ కథ చెప్పిన ఒక వైబ్ కనిపించింది. హీరో కోసం చాలా మందిని ప్రయత్నం చేశాం. కానీ సుమంత్ ప్రభాస్ చెప్పిన వైబ్ హీరోల్లో కనిపించలేదు. ఆ సమయంలో నేనే హీరోగా చేస్తానని అన్నాడు. కానీ మేము కొంత సందేహించాం. చివరకు సుమంత్ ప్రభాస్‌ను హీరోగా తీసుకొన్నాం అని నిర్మాతలు తెలిపారు.

sharat chandra

మేమ్ ఫేమస్ యూత్‌ఫుల్‌గా: మేమ్ ఫేమస్ మూవీని చాలావరకు కొత్త వారితో తీసాం. మొత్తంగా దాదాపు 45-50 మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లను పరిచయం చేసాం. ఇది సరైన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ అని చెప్పగలం. ఎందుకంటే 23 ఏళ్ల యువకుడు 23 ఏళ్ల యువకుడిలా నటిస్తున్నాడు. అందుకే నటీనటుల ఎంపిక ప్రక్రియకు సమయం పట్టింది. మొత్తానికి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సినిమా వచ్చింది. అందరికి నచ్చే విధంగా ఉంటుంది అని నిర్మాతలు తెలిపారు.

sharat chandra

పెళ్లిచూపులు, జాతిరత్నాలు కలిస్తే..: ఏ సినిమాకైనా కథ కంటే చెప్పే విధానం ముఖ్యం. స్క్రీన్ ప్లే బలంగా ఉంటుంది. మేము ఫేమస్ సినిమాను కథగా చెప్పాలంటే పెళ్లి చూపులు, జాతి రత్నాలు కలిస్తే మేమ్ ఫేమస్ అవుతుంది. యూత్ కోసం సినిమా తీసిన ఫ్యామిలీలు చూసేలా మేమ్ ఫేమస్ ఉంటుంది. రచయిత-దర్శకుడు సుమంత్ ప్రభాస్ ఎలాంటి అనుభవం లేకుండా వచ్చినా చాలా క్లారిటీ తో తీశాడు అని నిర్మాతలు చెప్పారు.

సిద్దూతో టీజర్ ప్లాన్..:
మేము ఫేమస్ టీజర్ లాంచ్ చేయడానికి చాలా మంది హీరోలను ట్రై చేశాం. సిద్దూ చేత రిలీజ్ చేద్దామని అనుకొన్నాం. అయితే సిద్దూ బిజీగా ఉండటంతో వర్కవుట్ కాలేదు. ఓ సారి మంత్రి మల్లారెడ్డి వీడియోను సిద్దూ షేర్ చేసిన విషయం గుర్తుకొచ్చింది. వెంటనే పీఆర్ వంశీ శేఖర్లకు ఫోన్ చేసి మల్లారెడ్డి నంబర్ సంపాదించాం. వెంటనే ఆయన అపాయింట్ కోసం ఆయనను కలిశాం అని నిర్మాతలు తెలిపారు.

మల్లారెడ్డిని ఎలా ఒప్పించామంటే?: అయితే మల్లారెడ్డి షెడ్యూల్ బిజీగా ఉండటంతో ఆయన కుదరదని చెప్పారు. అయితే మేము మీరు రావాల్సిందే అంటూ పట్టుపట్టి అక్కడే కూర్చున్నాం. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వస్తామని చెప్పాం, చివరకు మంత్రి మల్లారెడ్డి గారు తన షెడ్యూల్‌లో కొన్ని ప్రొగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని మా టీజర్ లాంచ్‌కు వచ్చారు. ఆయన చేతుల మీదుగా టీజర్ లాంచ్ చేసిన తర్వాత మేమ్ ఫేమస్ సినిమాకు మంచి వైబ్ క్రియేట్ అయింది అని నిర్మాత శరత్ చంద్ర చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X