Samantha డెడికేషన్‌కు హ్యాట్పాఫ్.. చేతికి సెలైన్ పెట్టుకొని అంటూ నిర్మాత కృష్ణ ప్రసాద్ ఎమోషనల్
యశోద సినిమాను అన్ని భాషల్లో శ్రీదేవీ మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది. తెలుగులో ఏషియన్ మూవీస్ సునీల్ నారంగ్ రిలీజ్ చేస్తున్నారు. తమిళంలో హీరో సూర్య డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మలయాళం, హిందీ భాషల్లో సొంతంగా మేము రిలీజ్ చేసుకొంటున్నాం. సినిమా, కథ బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్‌కు వస్తారని ఇటీవల కొన్ని చిత్రాలు నిరూపించాయి అని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. ఇంకా యశోద సినిమా గురించి నిర్మాత కృష్ణ ప్రసాద్ మరిన్నీ వివరాలు వెల్లడిస్తూ..

యశోదపై మాకు ఫుల్ కాన్ఫిడెన్స్
యశోద సినిమాపై మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కంటెంట్, సమంత ఫెర్ఫార్మెన్స్, ఇతర నటీనటులు యాక్టింగ్ అన్నీ సానుకూలమైన అంశాలు. ప్రతీ ఒక్కరిని సినిమా మెప్పిస్తుంది. అందుకే ప్యాన్ ఇండియా స్థాయిలో మేమే రిలీజ్ చేస్తున్నాం. అది మా నమ్మకానికి ఓ బలం అని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.

భారీగా ప్రమోషన్స్ ప్లాన్
సమంత రుత్ ప్రభుతో దేశవ్యాప్తంగా ప్రమోషన్ కార్యక్రమాలు డిజైన్ చేశాం. ముంబై, కొచ్చిన్, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌లో భారీగా ప్రమోషన్స్ చేయాలని అనుకొన్నాం. కానీ ఆమె తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ సమంతకు ఉన్న క్రేజ్ వల్ల మా సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడింది అని శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పారు.

అనారోగ్యానికి గురి కావడంతో సమంత
సమంత రుత్ ప్రభు స్వల్ప ఆనారోగ్యానికి గురైందని తెలుసు. అయితే ఆమె కాస్త ఇబ్బందిగా ఉన్నప్పటికీ.. తెలుగు, తమిళ భాషలో డబ్బింగ్ కోసం వచ్చారు. డాక్టర్ల పర్యవేక్షణలో మా కోసం డబ్బింగ్ చెప్పారు. అయితే ఆమె పడుతున్న బాధను చూసి ఒకట్రెండు రోజులు ఆగి చేద్దామని చెప్పాను. కానీ ఆమె రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.. లేదు.. నేను నా డబ్బింగ్ పూర్తి చేస్తాను అని చెప్పారు. ఒక దశలో ఆమె చేతికి సెలైన్ పెట్టుకొని డబ్బింగ్ చెప్పారు అని కృష్ణ ప్రసాద్ వెల్లడించారు.

ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా డబ్బింగ్
హిందీ సినిమా కోసం డబ్బింగ్ విషయంలో సమంతకు దగ్గరగా ఉండే వాయిస్‌ను మ్యాచ్ చేసుకొని డబ్బింగ్ చెప్పించాం. సినిమాలో చాలా ఎమోషనల్ సీన్లు ఉన్నాయి. ఎమోషనల్ సీన్లకు డబ్బింగ్ చెప్పడానికి చాలా ఎనర్జీ కావాలి. అందుకే నేను కొంత విశ్రాంతి తీసుకొమని చెప్పాని. అయినా ఆమె తన ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా సినిమాకు డబ్బింగ్ చెప్పారు.

మీడియాలో రకరకాల కథనాలు
అయితే మాకు కూడా సమంత అనారోగ్యం గురించి అందరికంటే రెండు రోజుల ముందే తెలిసింది. ఆమె యూఎస్‌కు వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఇంటికే పరిమితమయ్యారు. కానీ ఆమె ప్రతికూల పరిస్థితులను ఎదురించిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అయితే సమంత ఆరోగ్యం విషయంలో చాలా రకాలుగా మీడియాలో వచ్చాయి. అందుకే నేను అసలు ఏం జరిగిందనే విషయాన్ని వెల్లడించాల్సి వచ్చింది.


Click it and Unblock the Notifications











