800 మూవీ నాని చేయనన్నాడు.. మురళీధరన్ బయోపిక్‌ను నేచురల్ స్టార్ ఎందుకు రిజెక్ట్ చేశారంటే? శివలెంక కృష్ణప్రసాద్

శ్రీలంక క్రికెటర్, లెజండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ లైఫ్ హిస్టరీ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన చిత్రం 800. సెన్సేషనల్ బయోపిక్‌‌కు ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించారు. ముత్తయ మురళీధరన్‌గా స్లమ్ డాగ్ మిలియనీర్ ఫేమ్ మధుర్ మిట్టల్ నటించారు. ఈ సినిమాలో మలయాళ హీరోయిన్ మహిమా నంబియార్ కీలక పాత్రలో నటించారు.

ప్రముఖ నిర్మాత, శ్రీదేవీ మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, సింహాళీ భాషల్లో అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ..

Producer Sivalenka Krishna Prasad reveals that Hero Nani rejected Muthiah Muralidaran biopic 800: Here is the reason

దర్శకుడు ఎంఎస్ శ్రీపతి గురించి: స్వర్గీయ బాలసుబ్రమణ్యం అంకుల్‌కు, నాకు ఓ కామన్ ఫ్రెండ్ ఉన్నారు. ఆయన ద్వారా శ్రీపతి పరిచయం అయ్యారు. కోయంబత్తూరులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన ఆయనకు సినిమా రంగమంటే చాలా ఇష్టం. కామన్ ఫ్రెండ్ సూచనతో శ్రీపతిని ఎస్పీ చరణ్‌తో తీసిన వర్షం తమిళ రీమేక్‌ సమయంలో అసిస్టెంట్‌గా చేరారు.

ఆ తర్వాత దర్శకుడు వెంకట్ ప్రభు వద్ద కొన్ని సినిమాలకు పనిచేశారు. అతడితో ఉన్న రిలేషన్‌ వల్ల మా బ్యానర్‌లోనే పరిచయం చేయాలని భావించాం. కానీ అనుకోకుండా ముత్తయ మురళీధరన్ బయోపిక్ చేస్తున్నానని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యాను అని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

Producer Sivalenka Krishna Prasad reveals that Hero Nani rejected Muthiah Muralidaran biopic 800: Here is the reason

ముత్తయ్య మురళీధరన్ ఫోన్ చేసి: ముత్తయ్య మురళీధరన్ సినిమా కథ మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతీ దశలోను నాతో ప్రతీ విషయాన్ని పంచుకొనే వారు. 800 సినరిమా పూర్తి చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి.. సినిమా రిలీజ్ బాధ్యతను మీరు తీసుకోవాలని చెప్పారు. దాంతో మురళీధరన్‌‌తో మాట్లాడమని చెప్పాను. ఆ తర్వాత ముత్తయ్య మురళీధరన్ స్వయంగా ఫోన్ చేసి.. మీ గురించి శ్రీపతి ఎప్పుడూ చెబుతుంటారు. మీరు 800 సినిమా విడుదల చేస్తే చాలా సంతోషమని అన్నారు.దాంతో నేను 800 మూవీని పాన్ ఇండియా వైడ్ సినిమాను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యాను అని శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పారు.

Producer Sivalenka Krishna Prasad reveals that Hero Nani rejected Muthiah Muralidaran biopic 800: Here is the reason

ముత్తయ్య మురళీధరన్ ఎన్నో కష్టాలను: ముత్తయ్య మురళీధరన్ జీవితం ఎన్నో కష్టాలు, సమస్యలతో అనేక అవరోధాలతో సాగింది. ఒక మనిషి జీవితంలో ఈ రకమైన కష్టాలు ఉంటాయా? అనే ఆవేదన కలుగుతుంది. అలాగే మంచి కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులు ఉన్నాయి. మురళీధరన్ అనుమతితో శ్రీపతి పక్కాగా స్క్రిప్టు రాసుకొన్నారు. శ్రీపతి రాసుకొన్న స్క్రిప్టులో మేము జోక్యం చేసుకోలేదు. 800 మూవీ మార్పులు చేయడానికి సినిమా కాదు.. వాస్తవ కథ. దాంతో శ్రీపతి, మురళీధరన్ నిర్ణయించుకొన్న విధంగా ఉన్నది ఉన్నట్టే తీశాం అని శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు.

Producer Sivalenka Krishna Prasad reveals that Hero Nani rejected Muthiah Muralidaran biopic 800: Here is the reason

విజయ్ సేతుపతి తప్పుకోవడంతో: ముత్తయ్య మురళీధరన్ సినిమాను ముందుగా విజయ్ సేతుపతితో చేయాలని ప్లాన్ చేశారు. తమిళనాడులో కొన్ని వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో విజయ్ సేతుపతి తప్పుకొన్నాడు. ఆ తర్వాత నేచురల్ స్టార్ నానితో చేయాలని ఆయనను సంప్రదించాం. కానీ అప్పటికే ఆయన జెర్సీ చేసి ఉన్నాడు. దాంతో జెర్సీ తర్వాత వెంటనే క్రికెట్ నేపథ్యంగా సినిమా చేయలేనని నిజాయితీగా చెప్పారు. అయితే కథ మాత్రం విన్నాడు. కథ విన్నాక నాని చాలా ఎమోషనల్ అయ్యారు అని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

Producer Sivalenka Krishna Prasad reveals that Hero Nani rejected Muthiah Muralidaran biopic 800: Here is the reason

సచిన్, సౌరవ్, కుంబ్లేతో: నా మూడు దశాబ్దాలకుపైగా ఎందరో అగ్ర నటులతో అనుబంధం ఏర్పడింది. ముత్తయ్య మురళీధరన్ సినిమాతో భాగమైన తర్వాత ఎన్నో అనుభూతులు నాకు మిగిల్చాయి. ఈ ప్రమోషన్స్‌లో భాగంగా క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, జయసూర్య లాంటి వారిని కలవడం గొప్ప అనుభూతి. ప్రతీ అనుభూతి మరిచిపోలేనిది. ప్రతీ ఒక్కరు చాలా గొప్పవారు. వారితో జర్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే విషయం అని శివలెంక కృష్ణ ప్రసాద్ అన్నారు.

Producer Sivalenka Krishna Prasad reveals that Hero Nani rejected Muthiah Muralidaran biopic 800: Here is the reason

1100 పైగా థియేటర్లలో 800 మూవీ: 800 మూవీని ఇండియాలో 1100 థియేటర్లలకుపైగా రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా నిర్మాతగా నాకు గొప్ప పేరు తెచ్చే సినిమాగా, గర్వాన్ని పెంచే చిత్రంగా అవుతుంది. 800 తర్వాత శ్రీపతి చేయబోయే సినిమాను నేనే నిర్మిస్తున్నాను. పవన్ సాదినేనితో సినిమా చేస్తున్నాను. యశోద డైరెక్టర్స్, వదలడు దర్శకుడు సాయి శేఖర్‌తో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం అని శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X