Deepavali బలగం లాంటి ఎమోషనల్ మూవీ దీపావళీ.. దర్శకుడు ప్రాణం పెట్టి.. స్రవంతి రవికిషోర్!

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ స్రవంతి మూవీస్ బ్యానర్‌పై నిర్మాత స్రవంతి రవికిషోర్ నిర్మించిన చిత్రం దీపావళీ. తమిళ నటులు పూ రాము, కాళీ వెంకట్ తదితరులు నటించిన ఈ సినిమా దీపావళీ పండుగ సందర్భంగా రిలీజ్ అవుతున్నది. ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకొన్న ఈ సినిమా నవంబర్ 11వ తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో స్రవంతి రవికిషోర్ మాట్లాడుతూ..

దీపావళీ సినిమా విషయానికి వస్తే.. మంచి కథలో కోసం వెతుకుతుంటే.. స్నేహితుడి ద్వారా ఈ కథను విన్నాను. ఆ తర్వాత ఆ సినిమాకు సంబంధించిన నిర్మాత వల్ల సినిమా తీయలేకపోవడంతో నా వద్దకు కథ వచ్చింది. దర్శకుడు ప్రాణం పెట్టి చేసుకొన్న ఆ కథను మరోసారి విన్న తర్వాత.. బడ్జెట్ ఇచ్చి నేను సినిమా చేశాను. సినిమా కథను నమ్మి పెట్టుబడి పెట్టాను. డబ్బులు వస్తాయా? లేదా? అనే ఆలోచించలేదు అని ఆయన అన్నారు.

Producer Sravanthi Ravi Kishore excited and revealed Deepavali movie Emotions

దీపావళీ (కీడా) సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత కొందరు చూసి మూవీ బాగుంది. అవార్డులకు పంపించకపోయారా? అని అన్నారు. దాంతో నేను గతేడాది ఇఫీలో ఇండియన్ పనోరమాకు పంపించాను. అక్కడ ఈ సినిమాకు స్టాండింగ్ ఓవేషన్ లభించింది. మా సినిమాకు అవార్డు కూడా లభించింది. కమర్షియల్‌గా ఎన్నో సక్సెస్‌లు చూశాను. కానీ ఈ సినిమా వల్ల మంచి అనుభూతి లభించింది.దీపావళీ పండుగ నేపథ్యంగా కథ సాగుతుంది అని స్రవంతి రవికిషోర్ చెప్పారు.

Producer Sravanthi Ravi Kishore excited and revealed Deepavali movie Emotions

దీపావళీ సినిమాలో పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్ ఆకట్టుకొంటాయి. నటీనటులు పండించిన భావోద్వేగాలు అలరిస్తాయి. పేరున్న నటీనటులు లేకపోయినా వారి ఫెర్పార్మెన్స్‌ను హృదయాన్ని భారంగా చేస్తుంది. తమిళ నటులు కాళీ వెంకట్, పూ రాము, ఇతర నటీనటులు వారి పాత్రల్లో ఒదిగిపోయారు. అందుకే దీపావళీ పండుగల లాంటి సినిమా అని స్రవంతి రవి కిషోర్ చెప్పారు. ఈ సినిమా తమిళంలో తీసినా.. తెలుగు ప్రేక్షకులను తప్పకుండా నచ్చుతుంది అన్నారు.

తమిళంలో దీపావళీని రిలీజ్ చేసే క్రమంలో బలగం సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత మా సినిమాకు కూడా తెలుగులో ఆదరణ లభిస్తుందనే నమ్మకం కలిగింది. తాజాగా దిల్ రాజు చూసి సినిమాపై ప్రశంసలు కురిపించారు. అలాగే చెన్నైలో మీడియాకు ప్రదర్శించగా అందరూ స్టాండింగ్ ఓవేషన్‌తో ప్రశంసించారు అని స్రవంతి రవికిషోర్ చెప్పారు.

Producer Sravanthi Ravi Kishore excited and revealed Deepavali movie Emotions

దీపావళీ సినిమాలో పేరున్న నటీనటులు లేకపోయినా అందర్ని మెప్పిస్తుంది. అందుకే ఈ సినిమాను ప్రేక్షకలు వద్దకు తీసుకెళ్లే బాధ్యతను మీడియాపై పెట్టాం. మీడియా స్పందించే తీరుతో సినిమా అందరికి చేరువ అవుతుందని నమ్ముతున్నాం. చూసిన ప్రతీ ఒక్కరికి నచ్చుతుందని అనుకొంటున్నాం. ఈ దీపావళీకి మంచి అనుభూతి కలిగించే ఎమోషనల్ సినిమాగా అవుతుంది అని స్రవంతి రవికిషోర్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X