నాగార్జునకు శివ.. నాగచైతన్యకు కస్టడీ.. చై కెరీర్‌లోనే హయ్యెస్ట్.. నిర్మాత శ్రీనివాస చిట్టూరి (ఇంటర్వ్యూ)

యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, విలక్షణ దర్శకుడు వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో తెలుగు, తమిళంలో రూపొందిన చిత్రం కస్టడీ. అందాల తార కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ భారీ నిర్మాణ విలువలు, సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు. పోలీస్ కథా నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పించగా.. నిర్మాత శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. మే 12న సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

వెంకట్ ప్రభు మైండ్ సెట్ : గ్యాంబ్లర్ సినిమా చూసినప్పటి నుంచి దర్శకుడు వెంకట్ ప్రభుతో సినిమా చేయాలని చూస్తున్నాం. ఎంతటి సీరియస్ సబ్జెక్ట్‌నైనా మంచి స్క్రీన్ ప్లేతో ఎంటర్‌టైనింగ్‌గా చెప్పగలడు. అతడి మైండ్ సెట్ చాలా బాగుంటుంది. ఎంత పెద్ద ఇష్యూ అయినా చాలా సింపుల్‌గా డీల్ చేస్తాడు. కథ, మంచి స్క్రీన్ ప్లేతో తెలుగు ఎమోషన్స్ ఉండే హాలీవుడ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో కథ చాలా ఎమోషనల్‌గా సాగుతుంది అని శ్రీనివాస చిట్టూరి అన్నారు.

 custodysiva

తెలుగు, తమిళంలో ప్రాపర్‌గా : రామ్ పోతినేనితో ది వారియర్ సినిమా తర్వాత మళ్లీ నాగచైతన్యతో కస్టడీ సినిమాతో పోలీస్ కథ చేశాం. ఎక్కడ? దేనితో పోగొట్టుకొన్నామో.. అక్కడ దానితోనే సంపాదించాలని మళ్లీ పోలీస్ కథను ఎంచుకొన్నాం. మేము తొలుత తెలుగులో చేయాలని అనుకొన్నాం. ఆ తర్వాత తమిళంలో చూసి ద్విభాషా చిత్రంగా చేశాం. ఈ సినిమాను ప్రాపర్‌గా తెలుగు, తమిళంలో షూట్ చేశాం. ఎక్కడ డబ్బింగ్ చేయలేదు. ప్రతీ సీన్‌ను తెలుగు, తమిళంలో చేశాం అని శ్రీనివాస చిట్టూరి చెప్పారు.

 srinivasachitturi

మంచి రెస్సాన్స్‌తో కస్టడీ బిజినెస్‌ : కస్టడీ చిత్రంలో సెన్సిబులిటీస్, ఎమోషన్స్, రా ఎలిమెంట్స్ ఉంటాయి. సాధారణ పోలీస్ కానిస్టేబుల్ కథ. ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. తెలుగులో వెన్నెల కిషోర్ చేసిన పాత్రను తమిళంలో ప్రేమ్ జీ చేశారు. మిగితా యాక్టర్లందరూ తెలుగు, తమిళ భాషల్లో ఉన్నారు.బిజినెస్ పరంగా తెలుగు, తమిళ భాషల్లో మంచి రెస్సాన్స్ వస్తున్నది అని శ్రీనివాస చిట్టూరి తెలిపారు.

 srinivasachitturi

ఇళయరాజా, యువన్ శంకర్ రాజా ఎందుకంటే : కస్టడీ సినిమా 90వ దశకం ఆరంభంలో సాగే కథ. అప్పుడప్పుడే సెల్‌ఫోన్స్ వచ్చే వాతావరణం. చిన్న పిరియాడిక్ బ్యాక్ డ్రాప్‌తో కథ సాగుతుంది. అందుకే పిరియాడిక్ ఫీల్ రావడానికి ఇళయరాజాను వాడుకొన్నాం. లేటేస్ట్ ఫీల్ రావడానికి యువన్ శంకర్ రాజాను ఉపయోగించుకొన్నాం. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్ల వల్ల బడ్జెట్ పెరిగినప్పటికీ..క్వాలిటీ కోసం మేము ఈ నిర్ణయం తీసుకొన్నాం అని నిర్మాత శ్రీనివాస చిట్టూరి అన్నారు.

 srinivasachitturi

శివ పేరు పెట్టాలని అనుకొన్నాం : కస్టడీ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో హయ్యెస్ట్ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం. నాగచైతన్య కెరీర్‌లోనే ఎక్కువ థియేటర్లలో రిలీజయ్యే సినిమా అవుతుంది. తమిళనాడులో 200 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నాం. బిజినెస్ కూడా బాగా జరుగుతుంది. నాగ చైతన్య కెరీర్‌లో ది బెస్ట్ సినిమా అవుతుంది. నాగార్జునకు శివ ఎలానో.. నాగచైతన్యకు అలాంటి సినిమాగా కస్టడీ మూవీ గుర్తుండిపోతుంది. తొలుత ఈ సినిమాకు శివ అని పేరు పెట్టాలని అనుకొన్నాం. కానీ పోలీకలు వస్తాయని వద్దని చైతు చెప్పారు. ఇక అరవింద్ స్వామి, శరత్ కుమార్, ప్రియమణి క్యారెక్టర్లు కూడా గుర్తుండిపోతాయి అని

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X