అలా ఆశపెట్టుకొంటే హార్ట్ ఎటాక్.. జాక్ డిజాస్టర్ రిజల్ట్‌పై నిర్మాత షాకింగ్ కామెంట్స్
తెలుగు సినిమా పరిశ్రమలో 2025 సంవత్సరం అత్యంత నిరాశజనకంగా సాగుతున్నది. ఈ ఏడాది స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ కాకపోవడంతో ప్రేక్షకులు కూడా ముఖం చాటేస్తున్నారు. దాంతో సింగిల్ థియేటర్లు వెలవెలపోతున్నాయి. దాంతో మంచి సినిమాలు కూడా ప్రేక్షకులను రప్పించలేపోతున్నాయనే వాదన కూడా వినిపిస్తున్నది. అయితే ఈ ఏడాది భారీ అంచనాలతో వచ్చిన ఓ సినిమా గురించి డిస్టిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారు. థియేటర్ల మూసివేత అంశంలో ఆ సినిమాను పదే పదే టార్గెట్ చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అ సినిమా గురించిన వివరాల్లోకి వెళితే..
ఇటీవల తెలంగాణ ఫిలిం ఛాంబర్ కార్యవర్గం సమావేశం ఏర్పాటు నేపథ్యంలో ఆ కమిటీ చైర్మన్, సెక్రెటరీ, తదితరులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగిల్ థియేటర్లకు పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఈ సినిమా థియేటర్లు ఫంక్షన్ హాల్స్, గోదాములుగా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పటికే చాలా థియేటర్లు మూత పడుతున్నాయనే ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక సుమారుగా 6 నెలల కాలంలో కేవలం మూడు సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి. సంక్రాంతి వస్తున్నాం. మ్యాడ్, కోర్టు సినిమాలు మాత్రమే లాభాలను తెచ్చిపెట్టాయి. ఇక ఓ సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల రూపాయలు కూడా వసూలు చేయలేదు. కానీ ఆ సినిమా హీరోకు 13 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇలా ఉంటే సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ఏం కావాలి అంటూ జాక్ సినిమా కలెక్షన్ల తీరును అని ఆయన ప్రశ్నించారు.
ఇక తాజాగా ప్రముఖ నిర్మాత, డిస్టిబ్యూటర్ కూడా జాక్ సినిమా ఫలితంపై సెటైర్లు వేశారు. కుబేరా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా గుల్తే ఛానెల్‌తో మాట్లాడుతూ... ఈ సినిమా తప్పకుండా మంచి సినిమా అవుతుంది. ఏ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో చెప్పలేం. నా కుడి చేయి.. నా ఎడమ చేయిని కూడా నమ్మదు. ఎందుకంటే.. సినిమా పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను అంచనా వేయలేం అని సునీల్ నారంగ్ అన్నారు.
సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తొలి నాళ్లలో నాకు ఓ ఆశ ఉండేది. ఓ సమయంలో మృగరాజు, నరసింహనాయుడు ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అయితే మృగరాజు సినిమా బాగా ఆడుతుందని గట్టిగా నమ్మాను. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. నాకు అంచనాలు లేని నరసింహనాయుడు సినిమా సూపర్ హిట్ అయింది. సినిమా ఇండస్ట్రీ, పాలిటిక్స్‌లో ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఒకవేళ అంచనా పెట్టుకొంటే హార్ట్ ఎటాక్ రావడం గ్యారెంటీ అని అన్నారు.

ఒకప్పుడు కొన్ని సినిమాలపై అంచనాలు పెట్టుకొనే వాళ్లం. ఇప్పుడు సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఏమీ ఉండటం లేదు. ఒకసారి జాక్ సినిమా రిజల్ట్ చూసిన తర్వాత ఏముంటుంది? హార్ట్ ఎటాక్ ఒక్కటే తక్కువ అనే విధంగా అంతకంటే ఏమైనా ఊహించగలమా? అంటూ సునీల్ నారంగ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే.. జాక్ సినిమాను నైజాంలో ఏషియన్ ఫిలింస్ తరఫున సునీల్ నారంగ్ రిలీజ్ చేసి భారీ నష్టాలను కొని తెచ్చుకొన్నాడు అని స్వయంగా ఆయనే ఒప్పుకోవడం భారీ చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











