The Ghost హీరోలు రెమ్యునరేషన్స్ ఎందుకు తగ్గించుకోవాలి? నిర్మాత సునీల్ నారంగ్ సంచలన వ్యాఖ్యలు
శ్రీ వెంకటేశ్వర సినిమాస్, నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కర్ రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మాణ సారథ్యంలో ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సోనాల్ చౌహాన్ జంటగా నటించిన చిత్రం ది ఘోస్ట్. దసరా కానుకగా ఈ సినిమా అన్ని హంగులతో అక్టోబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. ఈ నేపథ్యంలో ది ఘోస్ట్ సినిమా గురించి, సినిమా టికెట్ రేట్లు, హీరోల రెమ్యునరేషన్లపై నిర్మాతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా హీరోల రెమ్యునరేషన్స్‌పై ఫిల్మీబీట్ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానం ఇస్తూ..
హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాలనే డిమాండ్ సరికాదు. హీరోల డిమాండ్ ఉంటే ఎంతైనా ఇచ్చుకోవడం నిర్మాత వ్యక్తిగత నిర్ణయం. పెద్ద హీరోలు ఉంటే రెమ్యునరేషన్ ఇవ్వాలి. కొత్త వారితో సినిమా తీస్తే.. ఫ్రీగా చేయించుకొంటాం అని సునీల్ నారంగ్ అన్నారు.

దేశంలో 150 కోట్ల జనాభా ఉంది. అంత జనాభా నుంచి 2 వేల మంది హీరోలు కూడా లేరు. హీరోలే సినీ నిర్మాతకు కలెక్షన్లు తెప్పిస్తారు. వారి డిమాండ్ ఉంది కాబట్టే వాళ్లు రెమ్యునరేషన్ ఎక్కువ అడుగుతారు. వారికి డిమాండ్ లేకపోతే వారు అడగరు. మేము ఇవ్వం అని సునీల్ నారంగ్ ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు.
సినీ రంగంలో హీరోలు దేవుళ్లు. డిమాండ్, సప్లై సూత్రం ప్రకారమే రెమ్యునరేషన్ ఉంటుంది. హీరోలు డేమీ గాడ్స్. కాబట్టి వారి రెమ్యునరేషన్ తగ్గించుకోవాలన్నది తప్పు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అని సునీల్ నారంగ్ తెలిపారు. కొన్ని సినిమాలు హీరోల రేంజ్ కారణంగానే నడుస్తాయి. వారి కోసం బడ్జెట్, రెమ్యునరేషన్ విషయంలో ఎవరూ కూడా రాజీ పడకూడదు అని సునీల్ నారంగ్ అన్నారు.


Click it and Unblock the Notifications











