Adipurush సక్సెస్‌తో రిలాక్స్ అవ్వం.. ఫెయిల్యూర్స్ మమ్మల్ని నిలువరించవు.. టీజీ విశ్వ ప్రసాద్ (ఇంటర్వ్యూ)
టాలీవుడ్‌లో అత్యధిక సినిమాలను నిర్మిస్తున్న ఏకైక సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ. ఇటీవల ఈ బ్యానర్ నిర్మించిన ధమాకా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఈ బ్యానర్ నుంచి ఆదిపురుష్ రిలీజ్ అవుతున్నది. ప్రపంచవ్యాప్తంగా సంచలన రీతిలో క్రేజ్ సంపాదించుకొన్న ఆదిపురుష్ థియేట్రికల్ హక్కులు పొందడం గురించి నిర్మాత టీజీ విశ్వప్రసాద్ వివరణ ఇచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రయాణం గురించి, ఆదిపురుష్ గురించి ఆయన వెల్లడిస్తూ..
తెలుగు రాష్ట్రాల్లో ఆదిపురుష్ థియేట్రికల్ రైట్స్ మేము సొంతం చేసుకొన్న విషయం నిజమే. బిజినెస్ స్ట్రాటెజీలో భాగంగానే సినిమా థియేట్రికల్ రైట్స్ తీసుకొన్నాం. ఆదిపురుష్ టీజర్‌లో రిలీజైన తర్వాత వచ్చిన వైబ్రేషన్స్ చూసి బాక్సాఫీస్ వద్ద సినిమా హిట్ అనే అభిప్రాయం కలిగింది. పబ్లిక్‌లో మంచి క్రేజ్ కనిపించడంతో ఫ్యాన్సీ రేటుకు ఆదిపురుష్ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకొన్నాం అని నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ టీ సిరీస్ ఆదిపురుష్ సినిమాను ప్రభాస్‌తో తెరకెక్కించారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ భాషకు ఒక్కొక్కరు నిర్మాతగా ఉన్నారు. టీ సిరీస్‌తో మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. దాంతో తెలుగు భాష థియేట్రికల్ హక్కులను మేము తీసుకొన్నాం. భవిష్యత్‌లో టీ సిరీస్ నిర్మించే సినిమాలను తెలుగులో మేమే రిలీజ్ చేస్తాం అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.
తిరుపతిలో జరిగిన ఆదిపురుష్ ఈవెంట్‌లో టీజీ విశ్వప్రసాద్, పీపుల్స్ మీడియాతో మంచి బాండింగ్ ఉందని ప్రభాస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరితో మంచి రిలేషన్స్ ఏర్పరుచుకోవాలన్నది మా వ్యక్తిగత అభిప్రాయం. ప్రభాస్‌తో మాకు మంచి అనుబంధం ఏర్పడటం చాలా లక్కీగా భావిస్తున్నాం.
ఆదిపురుష్ సినిమా హక్కులు కొనాలనే ఐడియా నాదే. ప్రభాస్ నుంచి వచ్చిన ఆఫర్ కాదు. ప్రభాస్‌తో చాలా సార్లు మాట్లాడిన సమయంలో ఆయన చెప్పిన మాటలతో ఆదిపురుష్ సినిమా తీసుకోవాలనే కోరిక బలంగా కలిగింది అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా సినిమాలను ఓ ఫ్యాక్టరీ మోడల్‌గా రూపొందించాలని అనుకొన్నాం. అదే విధంగా సినిమాలను నిర్మిస్తూ సక్సెస్ రేట్ సాధిస్తున్నాం. సక్సెస్, ఫెయిల్యూర్‌లను ఒకే మాదిరిగా.. ఒకే రకంగా తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాం. సక్సెస్‌తో రిలాక్స్ అవ్వం. ఫెయిల్యూర్స్ మమ్మల్ని నిలువరించలేవు. ఫెయిల్యూర్స్ వస్తే.. ఎక్కడ తప్పు చేశామనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకొంటాం అని టీజీ విశ్వ ప్రసాద్ చెప్పారు.
మేము సొంతంగా నిర్మించిన దానికంటే, ఇతర బ్యానర్స్ భాగస్వామ్యంతోనే ఎక్కువ విజయాలు అందుకోవడం యాదృచ్చికంగా జరిగిందే. పరాజయాలకు భాగస్వామ్యానికి సంబంధం లేదు. మేం ఇతర నిర్మాణ సంస్థలతో కలిసి చేసిన వాటిలో పరాజయంపాలైనవి ఉన్నాయి. అలాగే మేం సోలోగా నిర్మించిన వాటిలోనూ పరాజయం చెందినవి ఉన్నాయి. భాగస్వామ్యంతో చేసినా ఎక్కువ శాతం మా ప్రమేయం ఉంటుంది. కాబట్టి జయాపజయాల్లోనూ మా బాధ్యత ఉంటుంది అని టీజీ విశ్వ ప్రసాద్ తెలిపారు.


Click it and Unblock the Notifications











