For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిండు గర్బిణి బిడ్డకు జన్మనిచ్చినట్టు ఉంది.. కృష్ణ వ్రింద విహారి రిలీజ్ గురించి నిర్మాత ఉషా మూల్పూరి

  |

  ఐరా క్రియేషన్స్ పతాకంపై అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వంలో యువ హీరో నాగ శౌర్య కథా నాయకుడిగా నిర్మాత ఉషా మూల్పూరి నిర్మిస్తున్న చిత్రం కృష్ణ వ్రింద విహారి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం టీజర్, పాటలకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు నిర్మాత ఉషా మూల్పూరి ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు ఏమిటంటే?

  కరోనా సమయంలో స్టార్ట్ చేసి..

  కరోనా సమయంలో స్టార్ట్ చేసి..

  కృష్ణ వ్రింద విహారి కథను మొదట కథ నాగశౌర్య విన్నారు. కథ చాలా బాగుంటడటం ప్రాజెక్టు మొదలైంది. కరోనా సమయంలో స్టార్ట్ చేశాం. కృష్ణ వ్రింద విహారి కమర్షియల్ ఎంటర్ టైమెంట్ ఫ్యామిలీ మూవీ. ఈ కథకి ఒక తల్లిగా కనెక్ట్ అయ్యాను. అలాగే పిల్లల ప్రేమ, మా పెద్దబ్బాయి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్, ఇలా అన్ని ఎలిమెంట్స్‌కు కనెక్ట్ అయ్యాం అని ఉషా మూల్పూరి తెలిపారు.

   అంటే సుందరానికి పోలీక లేదు అంటూ

  అంటే సుందరానికి పోలీక లేదు అంటూ

  అంటే సుందరానికీ కథకు ఎలాంటి పోలిక లేదు. బ్రహ్మణ కులం అనేది కథకు ఓ పాయింట్. ఆ సినిమాకు మా సినిమాకు ఎలాంటి సంబంధం లేదు. అంటే సుందరానికి సినిమా దర్శకుడు అనీష్ చూశారు. దానికి దీనికి ఎక్కడ పోలిక లేదు అని చెప్పారు. బ్రహ్మణ యువకుడి పాత్ర అంటే కొంచెం కష్టమే. ఆ డిక్షన్ కోసం నాగశౌర్య ప్రిపేర్ అయ్యారు. బ్రహ్మణ సంప్రదాయాలు, కట్టుబొట్టు, ఆచారాలపై అవగాహన కల్పించుకోవడానికి రెండు నెలలు ట్రైనింగ్ తీసుకున్నారు. ఇందుకోసం దర్శకుడు ఒక ట్రైనర్‌ను ఏర్పాటు చేశారు. డబ్బింగ్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకున్నారు అని ఉషా మూల్పూరి తెలిపారు.

  సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా

  సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా


  కృష్ణ వ్రింద విహారి చిత్రంలో ఒక పల్లెటూరి బ్రాహ్మిణ కుర్రాడిగా, సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా, కొడుకుగా, ప్రేమికుడిగా, భర్తగా, స్నేహితుడిగా ఇలా భిన్నమైన కోణాల్లో నాగశౌర్యని చూస్తారు. శౌర్య కెరీర్‌లో కృష్ణ వ్రింద విహారి ఒక బెస్ట్ మూవీ అవుతుంది. పాండమిక్ కారణంగా పాండమిక్ కారణంగా మొదట అనుకున్న విడుదల తేది వాయిదా పడింది. మంచి సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడానికి మంచి డేట్, సమయం చూసి రిలీజ్ చేయాలని భావించాం. అందుకే సెప్టెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నాం అని ఉషా ముల్పూరి అన్నారు.

  200 మంది డ్యాన్సర్స్‌తో పాట

  200 మంది డ్యాన్సర్స్‌తో పాట


  కథ డిమాండ్ మేరకు 200 మంది డ్యాన్సర్స్‌తో ఏముందిరా పాటకు చాలా మంచి స్పందన వచ్చింది. దర్శకుడు ఆ సందర్భానికి అలాంటి సాంగ్ గ్రాండ్‌గా ఉంటే బాగుంటుందని అనుకున్నారు. మ్యూజిక్ వచ్చింది చక్కగా కుదిరింది. .పాటలకు సాహిత్యం అద్భుతంగా కుదిరింది. విజయ్ మాస్టర్ చక్కని కొరియోగ్రఫీ చేశారు. డీవోపీ సాయిశ్రీరామ్ కూడా చాలా అందంగా ఆ పాటని చిత్రీకరించారు. 95 శాతం సినిమా పూర్తయింది. ఇప్పటివరకూ వచ్చిన అవుట్‌పుట్‌పై ఒక నిర్మాతగా చాలా ఆనందంగా వున్నాను అని ఉషా మూల్పూరి ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

   సినిమాను రిలీజ్ చేయడం అలాంటి అనుభూతి

  సినిమాను రిలీజ్ చేయడం అలాంటి అనుభూతి

  కృష్ణ వ్రిందా విహారి తర్వాత కొన్ని ప్రాజెక్టులు లైనప్‌లో ఉన్నాయి. కథలు కొన్ని విన్నాం. కొన్ని కథలు వింటున్నాం. అయితే ఇప్పుడు కొత్త సినిమా ఆలోచన లేదు. ఈ సినిమాను విడుదల చేయడం నిండు గర్భిణి బిడ్డని కనడం లాగా ఉంది. ఈ సినిమా తర్వాతే మరో బిడ్డ లాంటి సినిమా గురించి ఆలోచిస్తున్నాం. ప్రస్తుతం మా ఆ పరిస్థితి అలా ఉంది. ప్రస్తుతం నా ద్రుష్టి అంతా ఈ చిత్రం విడుదలపైనే ఉంది అని ఉషా మూల్పూరి తెలిపారు.

  English summary
  Naga Shourya's latest movie is Krishna Vrinda Vihari. This movie is going to release on September 23rd. Here is the exclusive interview of Producer Usha Mulpuri
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X