Pindam పిండం షూటింగ్‌లో భయంకర సంఘటనలు.. షాకింగ్ విషయాలను వెల్లడించిన నిర్మాత యశ్వంత్
హీరో, దర్శకుడు అవసరాల శ్రీనివాస్, ప్రముఖ హీరో శ్రీరామ్, ఖుషీ రవి జంటగా సాయికిరణ్ దైదా దర్శకత్వంలో రూపొందిన చిత్రం పిండం. ఈ చిత్రానికి ది స్కేరియస్ట్ ఫిల్మ్ ట్యాగ్ లైన్. కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత యశ్వంత్ దగ్గుమాటి మీడియాతో మాట్లాడుతూ..
అమెరికాలో యువ పారిశ్రామిక వేత్త యశ్వంత్ దగ్గుమాటి ఐటీ కంపెనీల అధినేతగా రాణిస్తున్నారు. అయితే ఐటీ వ్యాపారంలో ఉన్న సినిమా రూపొందించాలనే కోరికతో ఉన్నారు. అయితే పిండం సినిమా నిర్మాణం చేపట్టానికి సంబంధించిన పరిస్థితులను వివరించారు. ఈ సినిమా ద్వారా తన వ్యాపార భాగస్వామి సాయికిరణ్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.

మంచి కథతో సినిమా చేద్దామని ఇండియాకు వచ్చాం. ముందుగా వేరే కథతో సినిమా ప్రారంభించాం. అలాగే సిద్దూ జొన్నలగడ్డతో డల్లాస్‌లో దేశీ దొంగలు సినిమా చేయాలనుకొన్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఈ క్రమంలో సాయికిరణ్ చేసిన కథ విన్న తర్వాత పిండం అనే సినిమాను ప్రారంభించాం. మనిషి పుట్టుక పిండం నుంచే వస్తుంది. అలాగే మనిషి మరణం తర్వాత పిండం పెడుతారు. జనన, మరణాల విషయంలో పిండం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అందుకే ఈ సినిమాకు ఆ టైటిల్ పెట్టాం అని యశ్వంత్ తెలిపారు.
పిండం సినిమా విషయానికి వస్తే.. 1990లో, 1930 సంవత్సరాల్లో కథ మొదలవుతుంది. మొత్తం మూడు కాలాలపాటు జరిగే కథ ఇది. ఈ సినిమా కథ వినడానికి ముందు యశ్వంత్ హాలీవుడ్‌లో రూపొందించిన స్కోక్ అనే సినిమాను శ్రీనివాస్ అవసరాల చూశాడు. ఆ తర్వాత పిండ కథ వినగానే 15 నిమిషాల్లో ఒకే చేశాడు. అలాగే శ్రీరామ్ కూడా ఈ సినిమాలోని పాత్రకు కచ్చితంగా సరిపోతాడు అని యశ్వంత్ తెలిపారు.
పిండం సినిమా షూటింగ్ సమయంలో అనుకోని సంఘటనలు జరిగడం కొంత ఆందోళనకు గురిచేసింది. షూటింగ్ సమయంలో ఒకరు ఫిట్స్ వచ్చి పడిపోయారు. ఒకరికి కాలు విరిగింది. ఓసారి సెట్‌లోకి పాము వచ్చింది. మరోసారి ఈశ్వరీరావు గారి తలకు గాయమైంది. ఈ సినిమాలో ఇద్దరు పిల్లలు నటించారు. అమావాస్య ఆదివారం రోజున షూట్‌లో ఏదో భయపడుతుంటే అమ్మవారి ఆలయం నుంచి కుంకుమ తెప్పించి బొట్టు పెట్టించాం అని నిర్మాత యశ్వంత్ చెప్పాడు.
హారర్ చిత్రాలతో పోల్చుకొంటే పిండం కథ డిఫరెంట్‌గా ఉంటుంది. ఇలాంటి కథతో హారర్ సినిమా రావడం ఇదే తొలిసారి. ఈ సినిమా కథకు వెనక ఓ కారణం ఉంది. మా డైరెక్టర్ అమ్మమ్మ ఓ ఇంటిని చూపించి కథ చెప్పింది. దాని ఆధారంగా పిండం సినిమా కథను రాశారు. మేము అనుకొన్న బడ్జెట్ కంటే తక్కువ బడ్జెట్‌లోనే సినిమా చేశాం. ఈ సినిమా అందర్నీ ఆకట్టుకొంటుంది అని యశ్వంత్ అన్నారు.


Click it and Unblock the Notifications











