బ్లఫ్ మాస్టర్ మరో అర్జున్‌రెడ్డి.. రాసుకోండి.. ఖడ్గం.. లౌక్యం సెంటిమెట్ రిపీట్.. పృథ్వీ

తనదైన మేనరిజం, పంచ్ డైలాగ్స్‌, హస్యంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొంటున్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ తాజాగా నటించిన చిత్రం బ్లఫ్ మాస్టర్. తమిళంలో సూపర్ డూపర్ హిట్ అయిన శతురంగ వేట్టై సినిమాకు ఇది రీమేక్. తెలుగు నేటివిటికి అనుగుణంగా ఆసక్తికరమైన మార్పులు చేసి ఈ సినిమాను తెరకెక్కించారు. సత్యదేవ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో పృథ్వీ కీలక పాత్రను పోషించారు. ఈ సినిమా డిసెంబర్ 28న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో పృథ్వీ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. పృథ్వీ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

అతిగా ఆశపడే శెట్టి పాత్రలో

అతిగా ఆశపడే శెట్టి పాత్రలో

బ్లఫ్ మాస్టర్ సినిమాలో నా పాత్ర పేరు ధనశెట్టి. డబ్బు కోసం అత్యాశపడే నైజం ఉన్న పాత్ర నాది. ఆ పాత్ర గెటప్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ధనశెట్టి పాత్ర కోసం నేను చాలా బరువైన, పాతకాలం నాటి చెవి దుద్దులు ధరించాలి. అలాంటి దుద్దుల కోసం హైదరాబాద్‌లోని ఆడవాళ్ల షాపులన్నీ తిరిగి సంపాదించాను. శెట్టి పాత్ర కోసం చిన్న నెత్తికి ఆముదం రాసి, ముఖంపై మీసాలు పెట్టి పాత్ర గెటప్‌ను బాగా తీర్చి దిద్దారు.

మోసానికి గురయ్యే శెట్టి పాత్రలో

మోసానికి గురయ్యే శెట్టి పాత్రలో

అతిగా ఆశపడే శెట్టిని ఓ సందర్భంలో మోసానికి గురవుతుంటారు. ఆ మోసానికి శెట్టి ఎలా స్పందించారు. క్లైమాక్స్‌లో శెట్టి పాత్రకు ఉన్న ఇంపార్టెంటెన్స్ ఏమిటి అనేది కొత్త పాయింట్. నటుడు బ్రహ్మాజి కారణంగా ఈ సినిమాలో గోవిందా అనే మేనరిజాన్ని ఇంప్రూవైజ్ చేశాను. వెంకన్న చౌదరీ మాదిరిగా నా పాత్ర చెప్పే మేనరిజం ప్రేక్షకులను బాగా ఆకట్టుకొంటుంది. ప్రతీ సీన్‌లో హస్యంతోపాటు ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది.

ఖడ్గం, లౌక్యం సెంటిమెంట్

ఖడ్గం, లౌక్యం సెంటిమెంట్

కొన్ని సినిమాలు చేసేటప్పుడు ఆ చిత్రానికి సంబంధించిన సత్తా తెలుస్తుంది. ఖడ్గంలో నటించేటప్పుడు సినిమా బ్రహ్మండంగా ఆడుతుందనే నమ్మకం కలిగింది. లౌక్యం సినిమా చేస్తున్నప్పుడు అది సెన్సేషనల్ క్రియేట్ చేస్తుందనే నమ్మకం కలిగింది. ఇప్పుడు బ్లఫ్ మాస్టర్ సినిమాలో నటిస్తున్నప్పుడే భారీ హిట్ కొడుతుందనే ఫీలింగ్ మనసులో కలిగింది. ఈ సినిమాతో గోపి గణేష్‌కు మంచి బ్రేక్ లభిస్తుంది. చాలా రెస్పాన్సిబిలిటీతో డైరెక్టర్ వ్యవహరించారు.

గోపి గణేష్ ఎడిట్ వెర్షన్ డైరెక్టర్

గోపి గణేష్ ఎడిట్ వెర్షన్ డైరెక్టర్

బ్లఫ్ మాస్టర్ సినిమా గురించి చెప్పాలంటే ముందుగా డైరెక్టర్ గోపి గణేష్ గురించి చెప్పాలి. డైరెక్టర్‌గా అతని విజన్ నన్ను బాగా ఆకట్టుకొన్నది. నటీనటులతో చాలా ఫ్రెండ్లీగా ఉంటూ అవుట్‌పుట్‌ను రాబట్టుకొంటాడు. కొంతమంది డైరెక్టర్ల మాదిరిగా కాకుండా ఎడిట్ వెర్షన్ డైరెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఎంత షూట్ చేయాలో అంతే షూట్ చేస్తాడు. ఏదో ఒకటి షూట్ చేసి ఎడిట్ టేబుల్ వద్ద చూసుకొందామని అనుకోడు. అందుకే ఫైనల్ అవుట్ అద్భుతంగా వచ్చింది.

హీరో సత్యదేవ్ గురించి

హీరో సత్యదేవ్ గురించి

బ్లఫ్ మాస్టర్ సినిమాలో హీరో సత్యదేవ్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తాడు. ఆయన చెప్పిన డైలాగ్స్ ఇప్పటికే ట్రెండింగ్‌గా మారాయి. మోసపోయేవాడు ఉన్నాడు కాబట్టే మోసం చేశాను అనే థీమ్ డైలాగ్ భలేగా ఉంది. టాలీవుడ్‌లో అర్జున్‌రెడ్డి-2019‌గా బ్లఫ్ మాస్టర్ కావడం గ్యారెంటి. మీరు రాసిపెట్టుకొవచ్చు. ఈ సినిమాలో చాలా మంచి పాయింట్లు ఉన్నాయి అని పృథ్వీ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X