‘చిరంజీవిపై అలాంటి కోపం.. ఆ విషయంలో పవన్ కల్యాణ్ ఫెయిల్యూర్’
ఆంధ్ర ప్రదేశ్‌లో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిరణ్ కొండేటి అలియాస్ కేకు పేరు తెలుగు రాష్ట్రాల రాజకీయ ముఖ చిత్రంపై మార్మోగింది. ఎన్నికల ఫలితాలను అంచనా వేయడంలో తనదైన సర్వే రిపోర్టును అందించి సంచలనం రేపారు. ఆయన చెప్పిన సర్వే రిపోర్టు నూటికి నూరు శాతం వర్కవుట్ అయింది. దాంతో ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా సెలబ్రిటీగా మారిపోయారు. తాజాగా ఫిల్మీబీట్‌తో జరిగిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో యాంకర్ కార్తీక్, వీడియో జర్నలిస్టు రామకృష్ణతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చిరంజీవిపై తన అభిమానాన్ని, పవన్ కల్యాణ్ జనసేన గురించి పలు విషయాలు వెల్లడిస్తూ..
నేను కాలేజీలో చదివేటప్పుడు అంటే 17, 18 ఏళ్ల వయసులో నేను చిరంజీవి అభిమానిని. ఆ సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. అయితే ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని మారుస్తారని అనుకొన్నాను. కానీ ఆ దిశగా అడుగులు పడకపోవడంతో నిరాశ చెందాను. కానీ చిరంజీవి సినిమాలు చూడటం ఆపలేదు. ఆయనపై ఉన్న అభిమానం అలాగే ఉంది అని కేకే చెప్పారు.
నేను కాలేజీలో చదువుకొనేటప్పుడు చిరంజీవికి అభిమానిని. ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీ పెట్టారో అప్పుడే ఆయన నుంచి డిస్ కనెక్ట్ అయ్యాను. నాకున్న భావజాలానికి ఆయన పార్టీ సిద్దాంతాలు, ఆయన వ్యూహాలు అంతగా నచ్చలేదు. అందుకే ఆ పార్టీకి దూరంగా ఉన్నాను. కానీ ఆయనకు ఎప్పటికీ వీరాభిమానినే. ఆయన సినిమాలు చూస్తూనే ఉన్నాను. కానీ రాజకీయ నేతగా ఆయన అనుసరించిన విధానాలు నాకు నచ్చలేదు అని కేకే అన్నారు.

రాజకీయాలకు చిరంజీవీ పనికిరాడు అని చెప్పడానికి నాకు ఆ అర్హత లేదు. ఇప్పుడు ఉన్న స్థాయికి నేను కామెంట్స్ చేయడం తగదు. కానీ రాజకీయాలు తనకు తగవని ఆయన తీసుకొన్న నిర్ణయం కరెక్ట్. కాకపోతే నాకు ఆయనపై ఓ రకమైన కోపం ఉండేది. ఎందుకంటే.. రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన ఛాయిస్ ఉన్నప్పటికీ.. ఆ దిశగా ఆయన అడుగులు వేయలేదు. జీవితంలో కొన్ని అరుదైన అవకాశాలు వస్తుంటాయి. అలాంటి అరుదైన అవకాశాన్ని ఆయన జారవిడుచుకొన్నారు అని కేకే అభిప్రాయపడ్డారు.
రాజకీయాలను మలుపు తిప్పే అవకాశం ఉన్నా.. అదే రాజకీయ నాయకులతో చేర్చుకోవడం.. పాత సీసాలో కోత్తసీసా మాదిరిగా రాజకీయ వ్యూహాలను రచించారు. అందుకే ఆయన పార్టీపై అంతగా ఆసక్తి కలగలేదు. ఆయనను కొంత మంది వెన్నుపోటు పొడిచారా? అంటే అందుకు నేను అంగీకరించాను. ఎందుకంటే.. నాయకుడు అనే వాడు అన్ని కోణాల్లో ఆలోచించాలి. ఎలాంటి ఫలితం వచ్చినా దానికి ఆయనే బాధ్య వహించాలి అని కేకే చెప్పారు.
ప్రజారాజ్యం పార్టీకి సక్సెస్, ఫెయిల్యూర్‌కు బాధ్యత చిరంజీవి గారిదే. ఆయన తీసుకొన్న నిర్ణయాలకు ఆయనే జవాబుదారీ. ప్రజారాజ్యం నుంచి జనసేన నేర్చుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ పరిణామక్రమం, అనుభవాలే అన్నీ నేర్పుతాయి. అయితే పార్టీ సంస్థాగత నిర్మాణం విషయాల్లో పవన్ కల్యాణ్ వెనకపడ్డారు. రాజకీయ పక్షాల ఏకీకరణ, కూటమి ఏర్పాటు విషయంలో తన వ్యూహాన్ని రచించిన తీరు బాగుంది అని కేకే అన్నారు.


Click it and Unblock the Notifications











