twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పూరీ కనెక్ట్స్ సీఈవోగా ఎలా అయ్యానంటే.. పూరీ జగన్నాథ్‌తో అలాంటి రిలేషన్.. విషు రెడ్డి

    |

    పూరి కనెక్ట్స్, బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం లైగర్. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన లైగర్ ట్రైలర్, పాటలు ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా అంచనాలను పెంచాయి. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో ఆగస్ట్ 25న లైగర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన విషు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

    Vishu Reddy

    సినిమాల్లోకి రాకముందే పూరీ జగన్నాథ్ సినిమాలకు అడిక్ట్ అయ్యా. కాలేజ్ ఎగ్గొట్టి ఆయన సినిమాలు చూస్తుండేవాడిని. నేను ఆయనకి పెద్ద ఫ్యాన్‌ను. నా మార్షల్ ఆర్ట్స్ వీడియోస్ చూసి నన్ను పిలిపించారు. 2015లో ఆయనను కలిసా. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో సినిమా చేస్తానని అప్పుడే లైగర్ ఐడియా చెప్పి టచ్ లో ఉందామని చెప్పారు. ఆయన మెహబూబా, ఇస్మార్ట్ శంకర్, రొమాంటిక్ చిత్రాలు చేశాను. ఎట్టకేలకు లైగర్‌తో నా కల తీరింది. పూరి గారు, విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ, మైక్ టైసన్ ఒక డ్రీం కాంబినేషన్. చాలా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు.

    పూరి గారి దగ్గరికి రాకముందు కొన్ని సినిమాలు చేశా. జోష్ తన తొలి చిత్రం. అందులో ఒక చిన్న నెగిటివ్ పాత్ర చేశా. తర్వాత ప్రొడక్షన్, సహాయ దర్శకుడిగా కూడా పని చేసి ఇండస్ట్రీని అర్ధం చేసుకున్నాను. మెహబూబా ప్రొడక్షన్ నేనే చేశా. పూరి గారు నాపై నమ్మకం వుంచి సీఈవోగా చేశారు అని విషు రెడ్డి తెలిపారు.

    English summary
    Puri Connects CEO Vishu Reddy about Vijay Deverakonda's Liger movie
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X