For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణ సినిమా అందుకే ఫ్లాప్.. రాత్రికి రాత్రే చిరంజీవితో.. రాయ్ లక్ష్మీ (ఇంటర్వ్యూ)

  |

  బాహుభాషా నటి రాయ్ లక్ష్మీ తాజాగా నటించిన చిత్రం వేర్ ఈజ్ వెంకటలక్ష్మి. ఈ చిత్రం మార్చి 1న రిలీజ్‌కు ముస్తాబవుతున్నది. ఈ క్రమంలో చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్ రాయ్ లక్ష్మీ తెలుగు ఫిల్మీ బీట్‌తో ముచ్చటించింది. తెలుగులో తన తొలి చిత్రం కాంచన మాల కేబుల్ టీవీ, బాలకృష్ణతో కలిసి నటించిన అనుభవం, చిరంజీవి, పవన్ కల్యాణ్‌తో స్పెషల్ సాంగ్స్ చేయడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఆమె ఏమన్నారంటే..

  స్టార్ హీరో లేకపోవడం వల్లనే

  స్టార్ హీరో లేకపోవడం వల్లనే

  కాంచనమాల కేబుల్ టీవీ చిత్రం ద్వారా నేను తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం అయ్యాను. అంతకుముందే తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించాను. తెలుగుకు వచ్చే సరికి నా సినిమాలో హీరోకు అప్పటికీ పెద్దగా పేరు లేదు. స్టార్ హీరో ఉండి ఉండే క్రేజ్ మరోలా ఉండేది. అంతేకాకుండా ఆ సినిమా ఆడకపోవడంతో అవకాశాలు తగ్గిపోయాయి. ఇతర భాషల్లో బిజీ అయిపోవడం కూడా తెలుగులో మంచి సినిమాపైనే దృష్టిపెట్టాను.

  మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను

  మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను

  ఎప్పటి నుంచో తెలుగులో మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాను. నేను చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేదు. సినీ జీవితం అంటేనే సక్సెస్, ఫెయిల్యూర్స్ కాంబినేషన్. కొన్నిసార్లు సినిమాలు పెద్దగా ఆడకపోయినా పోషించిన పాత్రలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

  అన్యాయంగా తొక్కేసారు... ప్రతీకారం తీర్చుకోవడం దారుణం: రాయ్ లక్ష్మీ

  బాలకృష్ణ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం

  బాలకృష్ణ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం

  నందమూరి బాలకృష్ణతో అధినాయకుడు సినిమా చేశాను. ఆ చిత్రం కొన్ని కారణాల వల్ల వాయిదాల మీద వాయిదా పడింది. చివరకు రాంగ్ సమయంలో సినిమా రిలీజైంది. తెలుగులో నా రెండో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపలేకపోయింది. దాంతో టాలీవుడ్‌లో మళ్లీ నా కెరీర్ మొదటికి వచ్చింది.

  నాకు స్పెషల్ సాంగ్స్ చేయడమంటే

  నాకు స్పెషల్ సాంగ్స్ చేయడమంటే

  ప్రస్తుత జనరేషన్‌లో చాలా మార్పులు వస్తున్నాయి. మారిన పరిస్థితులను బట్టి మనం మారుతూ ఉండాలి. నాకు స్పెషల్ సాంగ్స్ చేయడమంటే చాలా ఇష్టం. ఎందుకంటే హీరోయిన్ కంటే ఎక్కువగా ఒకేఒక స్పెషల్ సాంగ్ పైనే క్రేజ్ ఉంటుంది. ఖైదీ నంబర్ 150, పవన్ కల్యాణ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేయడం వల్ల నాకు మంచి మైలేజ్ వచ్చింది.

  ఖైదీ నంబర్ 150 సినిమాలో

  ఖైదీ నంబర్ 150 సినిమాలో

  చిరంజీవి తన 150 చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారంటే.. ఆ చిత్రంలో చాలా మంది ఒక్క సీన్ చేసినా బాగుంటుందని అనుకొన్నారు. అలాంటి క్రమంలో నాకు స్పెషల్ సాంగ్‌ చేయమని అడిగారు. రాత్రి ఫోన్ చేశారు. ఉదయం పాట షూటింగ్ అన్నారు. చేయాలా వద్దా అనే విషయం గురించి ఆలోచించే సమయయే దక్కలేదు. సాంగ్ కోసం ప్రాక్టీస్ కూడా లేదు. సెట్‌కు వెళ్లే సరికి క్యాస్టూమ్స్ కూడా రెడీగా ఉన్నాయి.

   రత్తాలు అని పిలుస్తున్నారు..

  రత్తాలు అని పిలుస్తున్నారు..

  ఖైదీ నంబర్ 150లోని రత్తాలు రత్తాలు పాట నాకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ పాటలో నటించిన తర్వాత నన్ను రత్తాలు అని పిలువడం మొదలుపెట్టారంటే అది ఎంత సక్సెస్ సాధించిందో అర్ధమవుతుంది. థియేటర్లో ఆడియెన్స్ రెస్పాన్స్ చూస్తే పిచ్చెక్కింది. సోషల్ మీడియాలో ఆ పాటను ట్యాగ్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది.

  English summary
  Actress Raai Lakshmi's latest movie is Where is Venkata Lakshmi. She is playing teacher cum Ghost role in this movie. This movie is set to release on March. In this occassion, She spokes to Telugu Filmibeat exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X