జూ.ఎన్టీఆర్‌తో అలాంటి దురదృష్టం.. రెండుసార్లు రిజెక్ట్.. రిచ‌ర్డ్ ప్ర‌సాద్‌

Recommended Video

Cinematographer Richard Prasad Interesting Comments In His Latest Interview || Filmibeat Telugu

టాలీవుడ్‌లోస్వామిరారా, కొత్త‌జంట‌, బాబు బంగారం, దోచెయ్‌ సినిమాల‌కు అద్భుత‌మైన విజువ‌ల్స్‌ను అందించిన సినిమాటోగ్రాఫ‌ర్ రిచ‌ర్డ్ ప్రసాద్‌. ప్ర‌స్తుతం ఈయ‌న సినిమాటోగ్ర‌ఫీ అందించిన చిత్రం ఓ బేబీ. జూలై 5న విడుద‌లైంది. స‌మంత అక్కినేని టైటిల్ పాత్ర‌లో న‌టించారు. సీనియ‌ర్ న‌టి ల‌క్ష్మి, నాగ‌శౌర్య‌, తేజ స‌జ్జ త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ధారులు. సినిమా ఘన విజ‌యం సాధించిన నేప‌థ్యంలో రిచ‌ర్డ్ ప్ర‌సాద్ మీడియాతో మాట్లాడుతూ ...

నా వ్యక్తిగత జీవితం గురించి

నా వ్యక్తిగత జీవితం గురించి

నాన్న రిజిస్ట్రార్‌గా పని చేసేవారు. అమ్మ టీచ‌ర్‌. ఆమె త‌న జాబ్‌కి రిజైన్ చేసి ఇంటి వ్య‌వ‌హారాల‌ను చూసుకునేవారు. ఇప్పుడు ఆవిడ లేరు. చనిపోయారు. మా సిస్ట‌ర్‌ను నా స్నేహితుడే పెళ్లి చేసుకున్నాడు. మా బావ‌గారు కూడా సినిమాటోగ్రాఫ‌ర్‌. నేను విజువ‌ల్ క‌మ్యూనికేష‌న్స్ చదివాను. అందులో జ‌ర్న‌లిజం, ఫోటోగ్ర‌ఫీ, పెయింటింగ్ అన్నీ ఉండేవి. చ‌దువు పూర్తి చేసుకున్న త‌ర్వాత జ‌య టీవీలో పార్ట్ టైమ‌ర్‌గా జాయిన్ అయ్యాను. జ‌య టీవీ వెబ్‌సైట్‌ను నేనే స్టార్ట్ చేశాను. వెబ్ డిజైనింగ్ చేసేవాడిని. ఓ సారి స్పీల్‌బ‌ర్గ్ `సిల్వ‌స్ట‌ర్ ` సినిమా చూశాను. అప్పుడు డైరెక్ట‌ర్ కావాల‌నుకున్నాను కానీ.. నాకు డైరెక్ష‌న్ కంటే ఫోటోగ్ర‌ఫీ అంటేనే ఆస‌క్తిఉంద‌ని గ్ర‌హించాను. అన్నిక్రాఫ్ట్స్ తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉండేది. అందువ‌ల్ల సినిమాటోగ్ర‌ఫీలో కోర్సు చేయాల‌నుకున్నాను. అంత కంటే ముందే నేను చదువుకునే రోజుల్లో ఎడిటింగ్‌పై ప‌ట్టు సాధించాను. ఎడిటింగ్ అవ‌గాహ‌న ఉంటే సీన్ డివిజ‌న్, సౌండింగ్ అన్ని తెలుస్తాయి.

అసిస్టెంట్ అని భావిస్తాను

అసిస్టెంట్ అని భావిస్తాను

నేను ప్ర‌తి సినిమాకు సినిమాటోగ్రాఫ‌ర్ అనే భావ‌న‌తో కాకుండా అసిస్టెంట్ డైరెక్ట‌ర్ అనే భావ‌న‌తో పనిచేస్తాను. ఒక్కొక్క డైరెక్ట‌ర్ ఒక్కొక్క ఎమోష‌న్‌ను ఎలా క్యారీ చేస్తార‌నే దాన్ని అబ్జ‌ర్వ్ చేసేవాడిని. కానీ పూర్తి ఫోక‌స్ అంతా ఫోటోగ్ర‌ఫీపైనే ఉండేది. నేను కోర్సు పూర్తి చేయ‌గానే క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్‌కు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను. ఓసారి థియేట‌ర్‌లో పాట‌ల ర‌చ‌యిత కృష్ణ చైత‌న్య‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. అక్క‌డ నుండి సుధీర్ వ‌ర్మ‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇక్క‌డ వారితో క‌లిసి షార్ట్ ఫిలింస్‌కు ప‌నిచేస్తూ వ‌చ్చి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. తొలిసారి `స్వామిరారా`తో సినిమాటోగ్రాఫర్‌గా మారాను. త‌ర్వాత కొత్త‌జంట‌, దోచెయ్‌, బాబు, బంగారం సినిమాల‌కు ప‌నిచేశాను.

 నాన్నకు ప్రేమతో సినిమాలో ఆఫర్

నాన్నకు ప్రేమతో సినిమాలో ఆఫర్

దోచెయ్‌`లో నా వ‌ర్క్ చూసిన ఎన్టీఆర్‌గారు, సుకుమార్‌గారు ..`నాన్న‌కు ప్రేమ‌తో` సినిమాలో అవ‌కాశం ఇచ్చారు. సినిమాలో లండ‌న్ షూట్ చేయాలి. నేను రెండు సార్లు వీసాకు అప్లై చేశాను. కానీ రెండు సార్లు రిజెక్ట్ అయ్యింది. వీసా ఉండుంటే ఎన్టీఆర్ లాంటి స్టార్‌తో ప‌నిచేసే అవ‌కాశం దక్కి ఉండేది. మిస్ అవ‌డం నా దుర‌దృష్టం.

 స్పీల్ బర్గ్, క్రిస్టోఫర్ డైల్ అంటే ఇష్టం

స్పీల్ బర్గ్, క్రిస్టోఫర్ డైల్ అంటే ఇష్టం

డైరెక్ష‌న్ ప‌రంగా నాకు స్పీల్‌బ‌ర్గ్ అంటే చాలా ఇష్టం. సినిమాటోగ్ర‌ఫీ ప‌రంగా ఇద్ద‌రినీ బాగా ఇష్ట‌ప‌డ‌తాను. జాన్ క‌మిన్స్‌స్కి అనే హాలీవుడ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేశాను. క్రిస్టోఫ‌ర్ డైల్‌గారంటే చాలా ఇష్టం. అలాగే పి.ఎస్‌.వినోద్‌గారు, ర‌త్న‌వేలుగారు కెమెరావర్క్ బాగా న‌చ్చుతాయి. నేను సినిమాల‌ను ఎక్కువ‌గా చూస్తుంటాను. భాష‌తో సంబంధం లేకుండా అన్ని సినిమాలు చూస్తాను. అలాగే మ‌న చుట్టూ జ‌రిగే ప్ర‌తి విష‌యాన్ని బాగా అబ్జ‌ర్వ్ చేస్తుంటాను. ఎందుకంటే సినిమా అంటే అన్నింటి క‌ల‌యికే అని నా ఉద్దేశం.

ఫాంటసీ మూవీ కోసం

ఫాంటసీ మూవీ కోసం

ఓ బేబీ` సినిమా విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుత స‌మ‌యంంలో జ‌రిగే ఫాంట‌సీ మూవీ. కాబ‌ట్టి క‌ల‌ర్స్ ఎంపిక‌లో చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. వారు వేసుకునే డ్రెస్‌ను బేస్ చేసుకుని టోన్ ఉండేలా కేర్ తీసుకున్నాను. సాధార‌ణంగా టోన్ ఆధారంగా డ్రెస్ సెల‌క్ట్ చేసుకుంటారు. కానీ మేం రివ‌ర్స్‌గా వెళ్లాం. మ‌న సినిమాల్లో కెమెరా స్టైల్ కొరియ‌న్‌, ఫిలిఫైన్, థాయ్ మూవీస్ స్టైల్లో ఉంటాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X