Pooja Hegde ప్రభాస్‌తో బుట్ట బొమ్మ రొమాన్స్ మరో రేంజ్‌లో.. పూజా హెగ్డే, భాగ్యశ్రీని ఎలా ఒప్పించామంటే?

రాధే శ్యామ్ సినిమా ఆలస్యం కావడానికి, ఆ సినిమా షూట్‌లో జరిగిన సంఘటనల గురించి దర్శకుడు రాధాకృష్ణ కుమార్ వెల్లడిస్తూ.. ప్రభాస్‌కు తల్లి క్యారెక్టర్ కోసం సీనియర్ నటి కోసం వెతుకుతుండగా భాగ్యశ్రీ ఫోటోను చూశాం. ఆమెను సంప్రదించగా కథ విని వెంటనే ఒప్పుకొన్నారు. ప్రభాస్ పక్కన నటిస్తే తనకు కూడా మంచి రీ ఎంట్రీగా ఉంటుందని భావించారు. అందుకే ఆమె కూడా సానుకూలంగా స్పందించారు.

ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే.. రాధే శ్యామ్ సినిమాలో ప్రభాస్ పక్కన హీరోయిన్ ఎవరైతే బాగుంటుందనే విషయం గురించి ఆలోచించే సమయంలో ఓ రోజు పార్క్ హయత్ హోటల్‌లో పూజా హెగ్డేను చూశాను. ఆమెను కలిసినప్పుడు చాలా గ్లామరస్‌గా కనిపించింది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్రకు ఆమె కరెక్ట్ అని భావించాను. ఆమెకు కథ చెప్పగానే ఎక్సైట్ అయ్యారు. వెంటనే సినిమాను ఆమె ఒప్పుకొవడం కూడా వెంటనే జరిగిపోయింది.

Radha Krishna Kumar about Prabhas on screen chemistry and romance with Pooja Hegde

తెలుగు, హిందీ వెర్షన్‌కు వేర్వేరుగా మ్యూజిక్ డైరెక్టర్లు ఉండటంపై స్పందిస్తూ.. టీ సిరీస్ ఫిల్మ్స్ ఛాయిస్. హిందీలో మిథున్, అమాల్ మాలిక్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు. తెలుగులో జస్టిన్ ప్రభాకర్ చేశారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు.

రాధేశ్యామ్‌ హైలెట్స్ పాయింట్స్ ఏమిటంటే.. స్టోరి. విజువల్ ప్రోయెట్రీ మాదిరిగా ఉంటుంది. ఈ సినిమా కథ అందర్నీ ఆకట్టుకొంటుంది. హస్త సాముద్రికం (పామిస్ట్రీ) నేపథ్యంగా ఏ భాషలోను సినిమాలు వచ్చిన దాఖలాలు లేవు. ఈ సినిమా తప్పకుండా అందర్నీ మెప్పిస్తుంది. ప్రభాస్, పూజా హెగ్డే క్యారెక్టర్లు తెర బాగుంటాయి. వారి మధ్య మెమిస్ట్రీ ఫెంటాస్టిక్‌గా ఉంటుంది. ప్రభాస్‌కు తగినట్టుగా హైట్ ఉండటం ప్లస్. వారిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ రొమాన్స్ బాగుంటుంది అని రాధే శ్యామ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X