బెడ్ రూమ్ సీన్‌లో మేమిద్దరం.. చంద్రముఖి 2 మూవీలో ఆ విషయం లీక్ చేసిన రాఘవ లారెన్స్
బ్లాక్ బస్టర్ విజయం అందుకొన్న చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న చిత్రం చంద్రముఖి 2. రజనీకాంత్, జ్యోతిక, నయనతార కాంబినేషన్‌లో వచ్చిన ఆ చిత్రం సంచలనం విజయం అందుకొన్నది. అలాంటి సినిమాకు సీక్వెల్‌గా చంద్రముఖి 2 వస్తుందనే వార్త నేపథ్యంలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఫిల్మీబీట్‌తో చంద్రముఖి 2 టీమ్ మాట్లాడుతూ..
రజనీకాంత్, వడివేలు కాంబినేషన్‌లో :చంద్రముఖి మూవీలో మాదిరిగా రజనీకాంత్, వడివేలు కాంబినేషన్‌లో కామెడి ఉంటుంది. కానీ ఓ డిఫరెంట్ ట్రాక్‌లో కామెడీ నడుస్తుంది. వారిద్దరి మధ్య ఉండే సమస్య కారణంగా లారెన్స్, వడివేలు మధ్య కామెడీ ట్రాక్ ఉంటుంది. ఇద్దరి మధ్య జరిగే సంభాషణ ఫుల్లుగా నవ్విస్తుంది. అయితే కథకు తగినట్టుగా కామెడీ ఉందో.. ఫైట్స్ కూడా ఉంటాయి. కానీ ఇది ఫైట్ సినిమా కాదు అని పీ వాసు చెప్పారు.
వడివేలు కామెడీ టైమింగ్:కామెడీ ట్రాక్ గురించి లారెన్స్ రాఘవ మాట్లాడుతూ.. వడివేలుకి మంచి కామెడి టైమింగ్ అద్బుతంగా ఉంటుంది. అలాగే నాకు ఓ కామెడీ టైమింగ్ ఉంటుంది. పీ వాసు రాసిన సీన్ల కారణంగా మా మధ్య కామెడీ టైమింగ్ వర్కవుట్ అయింది. బెడ్ రూమ్ సీన్‌లో హిలేరియస్‌గా ఉంటుంది అని అన్నారు.

పీ వాసు నుంచి పర్మిషన్:డైరెక్టర్ గారు.. ఓ డైలాగ్ చెప్పి పంపిస్తారు. వడివేలు దానిని ఇంప్రూవ్ చేసి తన వెర్షన్‌లో చెబుతారు. నాకు చెప్పిన వెర్షన్‌కు కాకుండా వడివేలు చెప్పిన వెర్షన్‌కు నేను మరికొంత ఇంప్రువైజ్ చేసి చెబితే.. రెండు పేజీల డైలాగ్ పది పేజీలు అవుతుంటాయి. అలా ఇంప్రూవ్ చేసిన సీన్‌కు పీ వాసు నుంచి పర్మిషన్ తీసుకొన్నాం అని లారెన్స్ మాస్టర్ అన్నారు.

వడివేలు కామెడీ అంటే ఇష్టం:నాకు సాధారణంగా కామెడీ అంటే ఇష్టం. అలాగే డైరెక్టర్‌గారి ఎంత పెద్ద యాక్షన్ సినిమా చేసినా కామెడీ మిస్ అవ్వరు. ఇక వడివేలు ఉన్న సమయంలో సీన్ తీసుకొని రాసిన తీసుకొన్న సీన్లు ప్రేక్షకులను బాగా నవ్విస్తాయి. డైరెక్టర్ విజన్ వల్ల వడివేలు, నాతో ఉన్న సీన్లు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారని అనుకొంటున్నాను అని లారెన్స్ అన్నారు.

వడివేలుకు ఎందుకు పాట పెట్టామంటే? :చంద్రముఖి 2 పాటలో వడివేలుకు డ్యాన్స్ స్టెప్పులే ఇచ్చి లారెన్స్‌ను తొక్కేయలేదు. వడివేలుతో ఎక్కువ స్టెప్పులు వేసి పాట షూట్ చేయాలని లారెన్స్ నిర్ణయం తీసుకొన్నారు. లారెన్స్ మాస్టర్ చేయడం రెగ్యులర్‌గా ఉంటుంది. ఒక డ్యాన్స్ మాస్టర్ చేత మరో డ్యాన్స్ మాస్టర్.. వేరే ఒక నటుడికి స్టెప్పులు వేయడం చాలా గొప్ప విషయం. ఆ విషయంలో లారెన్స్ మాస్టర్ గొప్పగా నిర్ణయం తీసుకొన్నారు అని పీ వాసు చెప్పారు.

వడివేలుకు నేను పెద్ద ఫ్యాన్‌ను:వడివేలు కమెడియన్, యాక్టర్ మాత్రమే కాదు. ఆయన మంచి డ్యాన్సర్ కూడా. వడివేలు బాడీ లాగ్వేంజ్ డిఫరెంట్‌గా ఉంటుంది. ఆయనకు నేను ఫ్యాన్‌ను. ఆయన డ్యాన్స్ చేస్తే ఎలా ఉంటుందో చూడాలనే కోరిక. అలాగే వడివేలు డ్యాన్స్ చేస్తే పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి నేను ఎలాంటి కోచింగ్ ఇవ్వలేదు అని లారెన్స్ మాస్టర్ అన్నారు.


Click it and Unblock the Notifications











