twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ మ్యూజిక్ డైరెక్టర్ నా అవకాశాలను లాక్కున్నాడు.. అప్పుడు చాలా బాధేసింది.. రఘు కుంచె కామెంట్స్

    |

    కామెడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి.. రూటు మార్చి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తెరకెక్కించాడు. చివరగా ఢమరుకం సినిమాతో పలకరించిన ఈ డైరెక్టర్.. ప్రస్తుతం రాగల 24గంటల్లో అనే మూవీతో పలకరించేందుకు సిద్దమయ్యాడు. అనేక మలుపులతో కూడిన ఈ సినిమాలో తెలుగమ్మయి ఈషారెబ్బా సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలవబోతోన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే మంచి అంచనాలను ఏర్పరిచిన చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను పెంచేసింది. ఈ క్రమంలో సంగీత దర్శకుడు రఘుకుంచె మీడియాతో ముచ్చటించి పలు విషయాలను వెల్లడించారు.

    అనేక ట్విస్ట్‌లు..

    అనేక ట్విస్ట్‌లు..

    ఈ దర్శకుడితో తనకిది రెండో చిత్రమని, ఇంతకుముందు మామా మంచు అల్లుడు కంచు చేశానని తెలిపాడు. ఇన్ని రోజులు కామెడీని హ్యాండిల్ చేసిన ఆయన..థ్రిల్లర్‌ను ఎలా చేసి ఉంటాడా? అని అనుకున్నాను. అయితే కథ వింటున్నప్పుడు చాలా థ్రిల్‌కు గురయ్యా..చాలా ట్విస్ట్‌లు ఉంటాయి..ఫస్టాఫ్‌లో వేసిన ముళ్లను సెకండాఫ్‌లో బాగా చూపించాడు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ రెండు కళ్లు అంటూ ఆయన చెప్పుకుంటూ వచ్చాడని తెలిపాడు. సినిమాలో మూడు పాటలే ఉంటాయని పేర్కొన్నాడు.

    ప్రత్యేక ఆకర్షణగా నేపథ్య సంగీతం..

    ప్రత్యేక ఆకర్షణగా నేపథ్య సంగీతం..

    థ్రిల్లర్ సినిమాలనేవి నేపథ్య సంగీతంతోనే ముడిపడి ఉంటాయి. ఇంటెన్స్.. చెప్పీ చెప్పనట్లు అండర్ లేయర్‌గా ఉండేది, ప్రేక్షకుడిని క్షణం ఆలోచించుకునే సమయం ఇవ్వకుండా ముందుకు తీసుకెళ్లేది ఇలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్‌లో రెండు రకాలుగా ఉంటాయని తెలిపాడు. కొంత మందికి ఈ చిత్రాన్ని చూపించాము.. నేపథ్య సంగీతం బాగుందని అందరూ ప్రశంసించారు.

     రెండో ట్యూన్ చేసే అవకాశం రాలేదు..

    రెండో ట్యూన్ చేసే అవకాశం రాలేదు..

    తాను ఇంత వరకు రెండో ట్యూన్ చేసే అవకాశమే రాలేదని, చివరకు మోహన్ బాబుతో చేసిన చిత్రంలో కూడా.. ఆయన ఫస్ట్ ట్యూన్‌కే ఓకే అన్నారని చెప్పుకొచ్చాడు. పాటల విషయంలో తనకు అలాంటి ఇబ్బంది ఎప్పుడు రాలేదని తెలిపాడు. తాను ఒక సింగర్ కావడం వల్ల.. ఏ ట్యూన్ బాగుంటుందో లేదో మొదటే తెలుస్తుందని చెప్పుకొచ్చాడు. కానీ రీరికార్డింగ్ విషయంలో అలా కుదరదని చెప్పుకొచ్చాడు.

    అలాంటి పాటలు కావాలని చెబుతారు..

    అలాంటి పాటలు కావాలని చెబుతారు..

    కొందర దర్శకులు అలాంటి పాటలు, సంగీతం కావాలని చెబుతారు.. అయితే దాన్నే ఉన్నది ఉన్నట్లుగా వాడటం తప్పు.. అలా చేస్తే అదికాపీ అవుతుంది. కానీ అందులోని ఫీల్‌ను తీసుకుని కొత్తగా ప్రయత్నించడం తప్పుకాదని చెప్పుకొచ్చాడు. పైగా అలా చెబితే వర్క్ కూడా ఈజీ అవుతుందని చెప్పుకొచ్చాడు.

    Recommended Video

    Cine Box : RRR Updates,Rajamouli Fully Focused On NTR And Ram Charan For RRR !
     అవకాశాలను లాక్కున్నాడు..

    అవకాశాలను లాక్కున్నాడు..

    తాను మ్యూజిక్ చేసిన రెండు మూడు సినిమాలకు వేరే వారు ఆర్ఆర్ చేశారు. సినిమాను ప్రమోట్ చేస్తానని నిర్మాతలకు చెప్పి.. అలా ఆ చాన్స్‌లను లాక్కున్నాడని చెప్పుకొచ్చాడు. తీరా ఆర్ఆర్ చేసే సమయానికి నా స్నేహితులే నన్ను తప్పించారు. అప్పడు చాలా బాధేసిందని చెప్పుకొచ్చాడు. సినిమా మొదటి నుంచి పనిచేసిన వారికి మధ్యలో వచ్చి పని చేసిన వారికి తేడా ఉంటుందని.. నాటి సంఘటనను గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ సదరు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది మాత్రం చెప్పలేదు. రాగల 24 గంటలు అనే చిత్రం తనకు కచ్చితంగా మంచి పేరు తెస్తుందని చెప్పుకొచ్చాడు.

    English summary
    Music Director Raghu Kunche Interview. He Tells Interesting Facts About Ragala 24 Gantallo Movie. This Movie Is Directed By Damarukham Fame Sreenivasa Reddy.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X