కొరటాల శివ, రాజమౌళి అలా ఉండమన్నారు.. 2020 వరకు భరించాల్సిందే: రాహుల్ రామక‌ృష్ణ

అర్జున్ రెడ్డితో స్టార్ కమెడియన్‌గా మారిన రాహుల్ రామకృష్ణ టాలీవుడ్‌లో బిజీ ఆర్టిస్టుగా స్థిరపడ్డారు. విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల వచ్చిన చిలసౌ, భరత్ అనే నేను ఆయన నటనా ప్రతిభకు అద్దపట్టాయి. ప్రస్తుతం హుషారుతోపాటు రాజమౌళి దర్శకత్వంలో RRR మూవీలో నటిస్తున్నారు. హుషారు సినిమా డిసెంబర్ 14న రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ నేపథ్యంలో రాహుల్ రామకృష్ణ తెలుగు ఫిల్మీబీట్‌తో ముచ్చటించారు. రాహుల్ చెప్పిన విషయాలు ఆయన మాటల్లోనే..

హర్ష చెప్పిన హుషారు కథ నచ్చి

హర్ష చెప్పిన హుషారు కథ నచ్చి

దర్శకుడు హర్ష చెప్పిన హుషారు కథ నచ్చి ఈ చిత్రంలో నటించాను. ఈ సినిమాలో ఫ్రస్టేటెడ్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తాను. సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కంటే నాకు వంట చేయడం అంటే ఇష్టం. నలుగురు యువకుల, యువతీ జీవితాల నేపథ్యంగా సినిమా నడుస్తుంది.

సెకండాఫ్‌లో నా పాత్ర ఎమోషనల్‌గా

సెకండాఫ్‌లో నా పాత్ర ఎమోషనల్‌గా

సెకండాఫ్‌లో నా పాత్ర ఉంటుంది. యువతీ, యువకులను కలిసిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి అనే కోణంలో సినిమా కథ ఉంటుంది. కామెడీ ప్రధానంగా నడిచే ఈ చిత్రంలో కొన్ని చోట్లు ఎమోషన్స్ ఉంటాయి. అవి ఆకట్టుకొనేలా ఉంటాయి. కొన్ని సన్నివేశాలు అద్బుతంగా ఉంటాయి. సీట్లలో ప్రేక్షకులు లేచి లేచి నవ్వడం ఖాయం.

పిచాక్ పాటకు మంచి రెస్పాన్స్

పిచాక్ పాటకు మంచి రెస్పాన్స్

నాపై చిత్రీకరించిన పిచాక్ పాటకు అనూహ్య స్పందన వచ్చింది. అది చాలా సంతోషంగా ఉంది. కానీ నా కుటుంబ సభ్యులు నాపై డౌట్ పడ్డారు. త్వరలోనే పెళ్లి కాబోతున్నది. అన్ని కరెక్ట్‌గా ఉన్నాయా? అంత సవ్యంగానే ఉందా నీ పరిస్థితి అని అడిగారు. ఆ పాట నా లైఫ్ అలా ప్రభావం చూపింది.

అర్జున్ రెడ్డి మూవీ తర్వాత

అర్జున్ రెడ్డి మూవీ తర్వాత

అర్జున్ రెడ్డికి వచ్చిన రెస్పాన్స్ హుషారుకు వస్తుందా అంటే కచ్చితంగా ఇప్పుడే చెప్పలేను. కానీ ఇప్పటి వరకు నేను పోషించిన పాత్రల్లో ఇది నాకు బాగా నచ్చింది. ఇతర సినిమాలు కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. కాకపోతే భారీ సినిమాలు కావడం వల్ల నా పాత్రకు స్పేస్ తగ్గింది. చిలసౌ, భరత్ అనే నేను చిత్రాల్లోని పాటలు నాకు సంతృప్తిని కలిగించాయి.

గెడ్డంతో గొడవ అదే

గెడ్డంతో గొడవ అదే

నాకు ఎలాంటి పాత్రలు వచ్చిన గెడ్డం తప్పనిసరి అవుతున్నది. భరత్ అనే నేను సినిమాలో గెడ్డం కావాలని కొరటాల శివ అడిగాను. ఇప్పుడు RRR మూవీలో నటిస్తున్నాను. ఆ సినిమాలో కూడా గెడ్డం కావాలని రాజమౌళి చెప్పారు. 2020 వరకు నేను గెడ్డంలోనే కనిపిస్తాను. అప్పటి వరకు భరించాల్సిందే.

నా సినీ రంగ ప్రవేశం ఇలా

నా సినీ రంగ ప్రవేశం ఇలా

నా మొదటి సినిమా జయమ్ము నిశ్చయంబురా. ఆ తర్వాత అర్జున్ రెడ్డి నటించాను. అప్పటికే నాకు విజయ్‌ దేవరకొండతో పరిచయం ఉంది. నేను పెళ్లిచూపులు సినిమాకు మూడు పాటలు రాశాను. ఒకరోజు సందీప్ రెడ్డికి విజయ్ కల్పించడంతో అర్జున్ రెడ్డిలో నటించాను. ఓ శుక్రవారం నా జీవితాన్ని మలుపుతిప్పింది. చేతినిండ అవకాశాలతో ప్రస్తుతం బిజీగా ఉన్నాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X