twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Mission Impossible స్పూర్తిగా రాజా విక్రమార్క.. జేడీ లక్ష్మీనారాయణ కోణంలో.. దర్శకుడు శ్రీ సరిపల్లి ..

    |

    RX 100 ఫేమ్ కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన చిత్రం రాజా విక్రమార్క. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. కార్తికేయ సరసన సీనియర్ తమిళ హీరో రవిచంద్రన్ మనవరాలు తాన్యా రవిచంద్రన్ కథానాయికగా కనిపించన్నారు. నవంబర్ 12న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రీ సరిపల్లితో ఇంటర్వ్యూ...

     విజయవాడలో పుట్టి పెరిగి.. యూనివర్సల్ స్టూడియోలో

    విజయవాడలో పుట్టి పెరిగి.. యూనివర్సల్ స్టూడియోలో

    నేను విజయవాడలో పుట్టి పెరిగాను. అక్కడే 22 ఏళ్లు ఉన్నాను. తర్వాత అమెరికా వెళ్లాను. యూనివర్సల్ స్టూడియోస్‌లో మాస్టర్ ఆఫ్ ఫిలిం మేకింగ్ చేశాను. నాలుగేళ్లుఅక్కడిఇండిపెండెంట్ సినిమాలకు పని చేశా. తర్వాత ఇండియా వచ్చి వీవీ వినాయక్ గారి దగ్గర దర్శకత్వ శాఖలో జాయినయ్యా. నాయక్, అల్లుడు శీను తదితర సినిమాలకు పని చేశా. ఇప్పుడు 'రాజా విక్రమార్క'తోదర్శకుడిగా పరిచయం అవుతున్నాను అని శ్రీ సరిపల్లి తెలిపారు.

    రాజా విక్రమార్క కథ ఇదే..

    రాజా విక్రమార్క కథ ఇదే..

    NIAలోకొత్తగా జాయిన్ అయిన యువకుడిగా కార్తికేయ కనిపిస్తారు. క్రమశిక్షణ లేకపోవడం వలన ఎలా ఇబ్బంది పడ్డాడు? ఓ ఆయుధాల అమ్మకాలు సాగించే డీలర్ దగ్గర సగం ఇన్ఫర్మేషన్ తీసుకునిచంపేస్తాడు. మిగతా ఇన్ఫర్మేషన్ సంగతేంటి? ఏమైంది? అనేది సినిమా. యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ మేలవించి రాజా విక్రమార్కను రూపొందించాం. యాక్షన్ అంటే ఊరమాస్ మాదిరిగా ఇరవైమందిని కొట్టడం ఉండదు. కథలో భాగంగా యాక్షన్ పార్ట్ ఉంటుంది. రాజా విక్రమార్క సినిమాను మిషన్ ఇంపాజిబుల్ స్ఫూర్తిగా తీశాను అని శ్రీ సరిపల్లి చెప్పారు.

     యాక్షన్ ప్రధానంగా సాగే కథ ఇది..

    యాక్షన్ ప్రధానంగా సాగే కథ ఇది..

    యాక్షన్ నేపథ్యంగా సాగే కథలో కామెడీ ట్రాక్‌ను పక్కాగా రాసుకొన్నాను. నేను సీబీఐ కాలనీ పక్కన ఉండేవాడిని. కిటికీలోంచి చూస్తే ఓ కుర్రాడు కనిపించేవాడు. నేను అతను డ్రైవర్ లేదా చిన్న పోస్టులో పనిచేసే వ్యక్తి అయ్యిఉంటాడని అనుకున్నాను. తర్వాత ఆయన జేడీ లక్ష్మీనారాయణబృందంలో కీలక సభ్యుడు అని తెలిసింది. నేను అనుకున్నట్టు చాలామంది అనుకుని ఉంటారు కదా! ఆ కోణంలో సన్నివేశాలు రాశా. కామెడీ అంటే సిట్యువేషనల్కామెడీ ఉంటుంది. క్యారెక్టర్లు జోకులు వేయవు. ఆ సన్నివేశాల్లో ఉండే ఫన్ చూస్తే ప్రేక్షకులకు నవ్వు వస్తుంది అని శ్రీ సరిపల్లి పేర్కొన్నారు.

    కార్తీకేయనే నిర్మాతగా మారి చేద్దామని..

    కార్తీకేయనే నిర్మాతగా మారి చేద్దామని..

    నా కథకు యంగ్ హీరోనే కరెక్ట్ అనుకొన్నాను. ఒకరిద్దరు హీరోలకు కథ చెప్పేందుకు ప్రయత్నాలు చేశా. ఆ సమయంలోనే ఆర్ఎక్స్ 100 మూవీలో కార్తికేయనుచూశా. అప్పుడు నా కథకు కార్తీకేయ సెట్ అవుతారని అనుకున్నాను. తర్వాత మేం అనుకున్న క్యారెక్టర్‌లో ఉన్న టైమింగ్అతనిలోఉందనితెలిసింది. నేను చెప్పిన కథ నచ్చడంతో కార్తికేయనే ప్రొడ్యూస్ చేయాలనిఅనుకున్నాడు. క్రియేటివ్‌గా, కమర్షియల్ గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కరోనా వల్ల సినిమా ఆలస్యమైంది. సినిమా తీయడానికి రెండేళ్లు పట్టినా... షూటింగ్ చేసింది 70 రోజులే అని దర్శకుడు శ్రీ సరిపల్లి తెలిపారు.

    Recommended Video

    Hero Sudheer Babu Interaction With His Lady Fan
    చిరంజీవి సినిమా టైటిల్ ఎందుకంటే...

    చిరంజీవి సినిమా టైటిల్ ఎందుకంటే...

    రాజా విక్రమార్క చిత్రంలో దేశంలోని ఓ సమస్యపైన ఐఎన్ఐ పోరాడుతుంది. సెకండాఫ్ 36 గంటల్లో జరుగుతుంది. చాలా రేసీగా స్క్రీన్ ప్లేఉంటుంది.మా దగ్గర ఉన్న టైటిళ్లలో ఇదే బెస్ట్ ఆప్షన్. అందులో నో డౌట్. చిరంజీవిగారి టైటిల్ పెట్టాలని అనుకోవడం కాదు కదా! దానికి ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉండాలి కదా! అందుకని, ఆలోచించా. హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్‌కు రాజా విక్రమార్క సూటవుతుందని పెట్టేశాం అని చెప్పారు. ఏ జానర్ సినిమా చేసినా... అందులో వినోదం ఉండేలా చూసుకుంటాను. నెక్ట్ సినిమా స్క్రిప్ట్ రెడీగా ఉంది. లాక్ డౌన్ లో రాశా అని చెప్పారు.

    English summary
    Raja Vikramarka movie is coming to Theatres on November 12th. In this occassion Director Sri Saripally speaks to media. He said, Raja Vikramarka is inspiration from Mission Impossible
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X