‘తమిళ రాజమౌళి ఈయనే.. అందరికంటే నాగార్జునే స్పెషల్’.. కూలిపై రజనీకాంత్ రివ్యూ

ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. 70 ఏళ్ల వయస్సు దాటినా కూడా యాక్షన్ సినిమాల్లో నటిస్తూ యంగ్ హీరోలకు పోటీనిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద కూడా సెన్సేషనల్ వసూళ్లు సాధిస్తున్నారు. ఈ క్రమంలో నెక్ట్స్ రజనీకాంత్ నుంచి మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ రాబోతుండటం విశేషం. భారీ గ్యాంగ్ స్టర్ అండ్ భారీ యాక్షన్ ఫిల్మ్ గా కూలి (Coolie) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఒక స్పెషల్ వీడియోను విడుదల చేస్తూ ఆసక్తికరంగా మాట్లాడారు. సినిమాలో నటించిన స్టార్ కాస్ట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

భారీ బడ్జెట్ తో కూలి..
కూలి.. కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న చిత్రం కూలి. ఈ చిత్రం ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇక ఈ చిత్రాన్ని తమిళ చిత్ర పరిశ్రమలోని టాప్ ప్రొడక్షన్ కంపెనీ సన్ పిక్చర్స్ నిర్మించింది. నిర్మాత కళానిధి మారన్ 350 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. చిత్రంలో భారీ స్టార్ కాస్ట్, టాప్ టెక్నీషియన్లు పనిచేయడంతో సినిమాకు పెద్ద మొత్తంలో ఖర్చైందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Rajinikanth Special Video on Coolie Movie

ఇక తాజాగా రజనీకాంత్ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. అందులో ఆయన మాట్లాడుతూ.. నేను ఇండస్ట్రీకి వచ్చి 50 ఏళ్లు పూర్తైంది. ఈ ఈయర్ లో సన్ పిక్చర్స్ నిర్మించిన, లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన చిత్రం కూలి. ఆగస్టు 14న వస్తోంది. లోకేష్ కనగరాజ్ ఇక్కడ రాజమౌళిలాగా. రాజమౌళి తీసిన చిత్రాలన్నింటి లాగే కనగరాజ్ తీసిన చిత్రాలు కూడా సక్సెస్ అందుకున్నాయి. కూలి చిత్రం మరో గొప్ప విషయం స్టార్ కాస్ట్. సత్యరాజ్ తో చాలా ఏళ్లు తర్వాత మళ్లీ కలిసి పనిచేస్తున్నాను. శృతి హాసన్ కూడా ఉన్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర కూడా ఇందులో కీలక పాత్ర చేశారు. సౌబిన్ విలన్ గా నటించారు. ఇక అమీర్ ఖాన్ సౌత్ ఇండియా ఫిల్మ్స్ లో స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆయన కెరీర్ లోనే ఫస్ట్ టైమ్ స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్న చిత్రమిది. ఇక కూలి చిత్రానికి అతిపెద్ద ఎట్రాక్షన్ అక్కినేని నాగార్జున. విలన్ గా చేస్తున్నారు. కూలి కథ విన్న వెంటనే సైమన్ పాత్ర నేనే చేయాలని అనుకున్నాను. మొదటి నుంచి నేను విలన్ కాబట్టి ఆ పాత్ర చేయాలని ఆశ ఉండింది.

ఆ పాత్ర చాలా స్టైలిష్ గా, అద్భుతంగా ఉంటుంది. 6 నెలలుగా ఆ పాత్ర గురించి డిస్కస్ చేస్తున్నానని, త్వరలోనే మీకు చెబుతానని లోకేష్ అన్నారు. ఆ తర్వాత వచ్చి సైమన్ పాత్రకు యాక్టర్ దొరికారని చెప్పారు. ఎవరని అడిగితే నాగార్జున అని చెప్పాడు. దాంతో షాక్ అయ్యాను. అసలు ఆయన ఒప్పుకున్నారా? అని అడిగాను. అవునని చెప్పారు. కచ్చితంగా ఆయన డబ్బు కోసం చేసే వారు కాదు. ఇక ఆయనకే(నాగార్జునకు) అనిపించి ఉంటుంది. ఎన్నాళ్లని మంచి వాళ్లుగా పాత్రలు చేస్తామని అనుకుని ఉంటారు. ఇక నాగార్జున గారెతో 33 ఏళ్ల కింద ఓ చిత్రంలో కలిసి పనిచేశాను. ఆ తర్వాత కూలితో మళ్లి కలిశాం. అప్పుడు ఎలా చూశానో దానికంటే ఎక్కువ యంగ్ గా ఉన్నారు.

నాకంత జుట్టు ఊడిపోయింది. కానీ నాగార్జున మాత్రం చాలా యంగ్ గా, ఫిట్ గా, ఫిజిక్ ఉండటం, స్కిన్ టోన్ చూసి నాకు ఆశ్చర్యమేసింది. దాంతో ఏంటీ రహస్యమని అడిగాను. రెగ్యులర్ ఎక్సర్ సైజ్, స్విమ్మింగ్, డైట్, 6:30లోపు డిన్నర్, అలాగే మా నాన్నగారు చెప్పినట్టు ఏదీ పెద్దగా సీరియస్ తీసుకోకూడదనే సూత్రాలు పాటిస్తున్నానని చెప్పారు. ఇక 17 రోజులు థాయిలాండ్ లో నాగార్జన గారితో కలిసి పనిచేశాను. ఆయన్ని నా లైఫ్ లో మర్చిపోలేను. మీ సలహాలు, మీ ఆలోచనలు, నాల్డెజ్ అస్సలు మర్చిపోను. మీరు హ్యాండ్సమే కాదు జెంటిల్ మెన్ సార్.ఇక సైమన్ పాత్రలో నాగార్జున పెర్ఫామెన్స్ కు నాకే వచ్చి నటించాలనిపించింది. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది. సూపర్ గా ఉంటుంది.' అని చెప్పుకొచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X