Rajisha Vijayan ఎవరీ మలయాళ భామ? రామారావు ఆన్ డ్యూటీలో రవితేజ పక్కన ఆఫర్ ఎలా వచ్చిందంటే?
తెలుగు సినీ తెరకు మరో కొత్త భామ పరిచయం కాబోతున్నది. మలయాళంలో ఇప్పటికే డజనుకుపైగా సినిమాలు చేసిన అనుభవంతో తెలుగు ప్రేక్షకుల మదిలో స్థానం సంపాదించుకోవడానికి రజిషా విజయన్ రెడీ అవుతున్నది. మాస్ మహారాజా రవితేజ, శరత్ మండవ కాంబినేషన్‌లో వస్తున్న రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో విభిన్నమైన పాత్రతో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రామారావు ఆన్ డ్యూటీలో ఎలా అవకాశం లభించింది? రజీషా విజయన్ బ్యాక్ గ్రౌండ్ ఏమిటనే విషయాల్లోకి వెళితే..

కేరళలో పుట్టి.. ఉత్తరాదిలో పెరిగి
కేరళలోని కోజికోడ్‌కు సమీపంలోని పెరంబ్రా అనే ప్రాంతంలో రజీషా విజయన్ జన్మించింది. ఆమె బాల్యం, విద్యాభ్యాసం అంతా ఉత్తరాది భారతంలోనే జరిగింది. ఆమె నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ నుంచి మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేసింది. జర్నలిస్టు కావాలనుకొన్న ఆమె టెలివిజన్ రంగంలోకి ప్రవేశించి ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టింది.

మలయాళంలో ఇండస్ట్రీలో
మలయాళ టెలివిజన్‌లో ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్‌గా, యాంకర్‌గా రాణిస్తున్న సమయంలో 2016లో అనురాగ కారిక్కిన్ వెల్లమ్ అనే సినిమాతో నటిగా ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. తమిళంలో ధనుష్‌తో చేసిన కర్ణన్, సూర్యతో జై భీమ్ చిత్రాలు రజీషా విజయన్‌కు మంచి పేరు సంపాదించిపెట్టాయి.

కర్ణన్ సినిమా చూసి ఆఫర్
తమిళ భాషలో నేను నటించిన కర్ణన్ సినిమా చూసి దర్శకుడు శరత్ మండవ కాల్ చేశారు. రామారావు ఆన్ డ్యూటీ మూవీలోని మాలిని అనే పాత్రను నేరేట్ చేస్తూ అద్బుతమైన కథ చెప్పారు. బలమైన పాత్రతో కావడంతో మరోసారి ఆలోచించలేదు. ఒక భాషలో ప్రేక్షకులకు పరిచయం కావాలంటే ఇలాంటి పాత్ర ఉండాల్సిందే. మంచి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కావడం చాలా సంతోషంగా ఉంది అని రజీషా విజయన్ చెప్పారు.

రవితేజకు పాన్ ఇండియా క్రేజ్
నేను ఉత్తరాది భారతంలో పెరగడం వల్ల రవితేజ నటించిన హిందీ డబ్బింగ్ సినిమాలు చూశాను. నా స్నేహితులందరికి కూడా రవితేజ అంటే ఇష్టం. ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల గురించి చర్చ బాగా జరుగుతుంది. ఆ రేంజ్ రీచ్ రవితేజకు ఎప్పుడో ఉంది. ఆయన మాస్ ప్రేక్షకులకు చేరువైన హీరో. ఆయన సెట్స్‌లో ఉంటే.. ఒక పాజిటివ్ ఎనర్జీ వైబ్ ఉంటుంది అని రజీషా విజయన్ అన్నారు.

శరత్ మండవ క్లారిటీ ఉన్న డైరెక్టర్
శరత్ మండవ తాను కావాలనుకొన్నది తెరమీదకు తీసుకొచ్చేంత పర్‌ఫెక్షనిస్టు. రామారావు ఆన్ డ్యూటీ మాస్ సినిమా, వినోదంతోపాటు యాక్షన్, డ్యాన్స్ లాంటి అంశాలు పుష్కలంగా ఉన్నాయి. బలమైన కథతోపాటు చాలా ఎలిమెంట్స్‌తో సినిమా తీయాలంటే దర్శకుడిలో చాలా క్లారిటీ ఉండాలి. అంతటి క్లారిటీతో ఉన్న దర్శకుడు శరత్.ఈ చిత్రంలో సాంకేతిక విలువలతో చాలా మంచి క్యాలిటీతో రూపొందించారు అని రజీషా విజయన్ చెప్పారు.


Click it and Unblock the Notifications











