రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి పక్కా రూరల్.. ఫుల్లుగా రొమాన్స్.. కొంచెం క్రైమ్!

తెలుగు సినిమా పరిశ్రమలో రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్లకు మంచి ఆదరణ దక్కుతున్నది. ఇప్పటికే అలాంటి చిత్రాలు భారీ విజయాలను అందుకొన్నాయి. అదే కోవలో రొమాన్స్, క్రైమ్ కథతో వస్తున్న పక్కా గ్రామీణ నేపథ్యం ఉన్న చిత్రం రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి. ఈ చిత్రానికి సత్యరాజ్ దర్శకత్వం వహించగా.. రవితేజ నున్నా తొలి చిత్ర నటుడిగానే కాకుండా నిర్మాతగా కూడా టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు. ఆయన సరసన హిందీ టెలివిజన్ సీరియల్ నటి నేహా జురేల్ నటిస్తున్నది.

ఈ సినిమాను వెంకట శివసాయి ఫిల్మ్స్, తన్విక అండ్ మోక్షికా క్రియేషన్స్ బ్యానర్‌పై కుమారి నున్నా, ముత్యాల రాందాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ద్వారా సంగీత దర్శకుడు కోటి కుమారుడు రోషన్ సాలూరి మ్యూజిక్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. ఈ సినిమా మార్చి 9వ తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో దర్శకుడు సత్యరాజ్, హీరో రవితేజ నున్నా ఫిలింబీట్‌తో మాట్లాడుతూ..

Raju Gari Ammayi Naidu Gari Abbayi is rural drama with Romance and Crime says Satya Raj

రాజు గారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి కథ విషయానికి వస్తే.. పనిపాటా లేకుండా జాలీగా తిరిగే యువకుడు ఓ అమ్మాయితో ప్రేమలో పడుతాడు. వారి ప్రేమకు స్థానికంగా ఉన్న ఫ్యాక్షన్ గొడవలు అడ్డుపడుతాయి. అంతలోనే ఆ అమ్మాయి హత్య జరుగుతుంది. ఆ హత్యానేరం యువకుడిపై పడుతుంది. ఇలాంటి కథను రొమాన్స్, యాక్షన్, హ్యుమర్, థ్రిల్స్‌ మేళవించి తీశాం అని సత్యరాజ్ చెప్పారు.

మా స్వస్థలం అమలాపురం. మా ప్రాంతంలో చాలా సినిమాల షూటింగ్ జరుగుతుంటాయి. అలా షూటింగులు చూసి, సినిమాలు పిచ్చిగా చూసి డైరెక్షన్ చేయాలనే కోరిక పుట్టింది. ఆ ప్రయత్నమే రాజు గారి అమ్మాయి. నాయుడు గారి అబ్బాయి. రెండు కుటుంబాల మధ్య జరిగే కథనే ఈ సినిమా కథ. ఈ సినిమా టైటిల్‌ను కులాలను బట్టి పెట్టలేదు. కథకు యాప్ట్ అయ్యే టైటిల్ అని సత్యరాజ్ అన్నారు.

Raju Gari Ammayi Naidu Gari Abbayi is rural drama with Romance and Crime says Satya Raj

మా సినిమా ట్రైలర్ చూస్తే మీకు మేము ఎలాంటి మూవీని తీశామో అర్ధం అవుతుంది. పక్కాగా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ కథలో ఉండే ట్విస్టులు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతాయి. ఈ సినిమాను తప్పకుండా థియేటర్‌లోనే చూడాలి. ఈ చిత్రంలో మంచి ప్రేమకథ కూడా ఉందని చెప్పడానికి ప్రమోషన్స్‌లో చెప్పాం. ఈ సినిమాలో ఓ ఆసక్తికరమైన పాయింట్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంది అని సత్యరాజ్ అన్నారు.

ఈ సినిమా వినోదాత్మకంగా సాగే పక్కా రూరల్ స్టోరి. ఈ సినిమాలోని పాత్రలు మనచుట్టూ తిరిగేలా ఉంటాయి. పాత్రల మధ్య ఎమోషన్స్ ఈ మూవీకి ప్రాణం. అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. మంచి విజయం సాధిస్తుందని భావిస్తున్నాం. ఈ సినిమాను మార్చి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నాం. ఈ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ కోటి కుమారుడు సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. నాకు సహకరించిన నిర్మాతలకు రుణపడి ఉంటాను అని సత్యరాజ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X