నితిన్ జూనియర్ హీరో.. తండ్రి కంటే ఎక్కువ వయసు వ్యక్తితో.. రకుల్

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కేవలం దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలతో ఆలరిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన దే దే ప్యార్ దే చిత్రంతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకొన్న రకుల్.. దాదాపు అలాంటి కథతో మన్మథుడు 2 సినిమాలో నటించింది. వయసు మీరిన హీరోతో ప్రేమలో పడిన యువతిగా నటించింది. నాగార్జునతో కలిసి నటించిన మన్మథుడు 2 సినిమా ఆగస్టు 10న రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రకుల్ ప్రీత్ మీడియాతో మాట్లాడుతూ..

వయసు మీరిన హీరోలతో నటించడం, రొమాన్స్ చేయాల్సి రావడం కథ నచ్చడం వల్లే. దే దే ప్యార్ దే సినిమాకు ప్రేక్షకాదరణ దక్కింది. ఆ సినిమా రూ.100 కోట్ల వసూలు చేసింది. అలాంటి సినిమాలో ఏజ్డ్ హీరో పక్కన 25 ఏళ్ల యువతిగా నటించాల్సి వస్తే.. ఆ వయసు వాళ్లే చేయాలి. ఆ పాత్రకు 40 ఏళ్లకుపైబడిన హీరోయిన్‌తో చేయిస్తే అది సరిగా ఉండదు. నా ఫ్రెండ్ ఒకరు తన తండ్రి కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొన్నారు అని రకుల్ అన్నారు.

Rakul Preet Singh about acting with senior heroes

సీనియర్ హీరోలతో నటిస్తే.. యంగ్ హీరోలతో అవకాశాలు తగ్గుతాయని అంటుంటారు. కానీ నా విషయంలో అలాంటివి జరుగడం లేదు. ప్రస్తుతం నితిన్‌తో నటిస్తున్నాను. ఆయన జూనియర్ హీరో కాదా? హిందీలో అజయ్ దేవగన్‌‌తో నటించిన తర్వాత సిద్ధార్థ్ మల్హోత్రా, మరో యంగ్ హీరోతో నటిస్తున్నాను. త్వరలోనే బాలీవుడ్ సినిమాకు సంబంధించిన వివరాలు చెప్పారు.

హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించడం లేదంటే.. మంచి కథలు రావడం లేదు. ఒకవేళ వస్తే తప్పుకుండా అలాంటి సినిమాలు చేస్తాను. కమర్షియల్ సినిమాలో హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తున్నాను. అవంతిక పాత్ర హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు ఏ మాత్రం తగ్దదు అని రకుల్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X