For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సిగరెట్ తాగితే బోల్డ్ హీరోయినా? వయసు మీరిన హీరోతో చేస్తే తప్పా? రకుల్

|

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కేవలం దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలతో ఆలరిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన దే దే ప్యార్ దే చిత్రంతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకొన్న రకుల్.. దాదాపు అలాంటి కథతో మన్మథుడు 2 సినిమాలో నటించింది. వయసు మీరిన హీరోతో ప్రేమలో పడిన యువతిగా నటించింది. నాగార్జునతో కలిసి నటించిన మన్మథుడు 2 సినిమా ఆగస్టు 10న రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రకుల్ ప్రీత్ మీడియాతో మాట్లాడుతూ..

మెచ్యురిటీతో ఉన్న యువతిగా

మెచ్యురిటీతో ఉన్న యువతిగా

మన్మథుడు 2 నా క్యారెక్టర్ పేరు అవంతిక. ఇందులో నేను చాలా ఫన్ క్యారెక్టర్‌లో నటించాను. మెచ్యురిటీ ఉన్న అమ్మాయిగా కనిపిస్తాను. లుక్ కూడా మోడర్న్‌గా కనిపిస్తాను. అవంతిక పాత్ర నా కెరీర్‌లో అత్యంత ఇష్టమైనది. ఫన్ కాకుండా అన్ని రకాలు ఎమోషన్స్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తాను. నేను ఎక్కువగా ఎంజాయ్ చేసిన రోల్ ఇది. నాగ్ సార్ సామ్ క్యారెక్టర్‌లో కనిపిస్తారు. నాగ్ సార్‌కు నాకు మధ్య సన్నివేశాలు అందరికీ నచ్చేలా ఉన్నాయి. ఈ సినిమాలో లక్ష్మీ, ఝాన్సీ లాంటి సీనియర్ నటులు ఉండటం వల్ల ఓ ఫ్యామిలీగా కలిసిపోయాం అని రకుల్ ప్రీత్ అన్నారు.

నాగార్జున చాలా సపోర్టివ్

నాగార్జున చాలా సపోర్టివ్

నాగ్ సార్.. చాలా సపోర్టివ్ కో-స్టార్. ఇతర పాత్రలకు, కథకు గౌరవం ఇచ్చి చాలా జాగ్రత్తలు తీసుకొన్నాడు. వ్యక్తిగతంగా నాగ్ సార్ చాలా మంచి వ్యక్తి. నాగార్జున సార్ మంచి వ్యక్తి అని చెప్పడానికి ఓ ఉదాహరణ చెప్పదలచుకొన్నాను. స్విట్జర్లాండ్‌లో సాంగ్ షూటింగ్ చేయడానికి వెళితే.. వేర్వేరు చోట్ల హోటళ్లు ఎందుకని.. అందరితో కలిసి ఓకే హోటల్‌లో ఉన్నాడు. మాతో కలిసి ప్రయాణం చేశాడు అని రకుల్ ప్రీత్ చెప్పారు.

మన్మథుడు 2: యూనిట్ అందరి గురించి చెప్పేసిన నాగార్జున

 నాగార్జునతో నా కెమిస్ట్రీ

నాగార్జునతో నా కెమిస్ట్రీ

నాగార్జున గారు, నేను వయసుకు తగిన పాత్రలను పోషించాం. మా మధ్య కెమిస్ట్రీ బాగున్నది. మా మధ్య చాలా డైలాగ్స్ కూడా అందరికీ నచ్చేలా ఉన్నాయి. అందుకే ఈ వయసులో లవ్ ఫెయిల్యూర్ అయితే తట్టుకోలేవు అని డైలాగ్స్ నా చేత చెప్పించారు. బోల్డ్‌గా కనిపిస్తున్నారనడం సమంజసం కాదు. నేను సిగరెట్లు తాగడం పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసమే. సిగరెట్ తాగితే తప్పేముంది.. ప్రపంచం చాలా మారి పోతున్నది. అంతేగానీ నేను ఎంత బోల్డ్ అనేది సినిమా చూస్తే తెలుస్తుంది అని రకుల్ పేర్కొన్నారు.

 వయసు మీరిన హీరోలతో నటించడం

వయసు మీరిన హీరోలతో నటించడం

వయసు మీరిన హీరోలతో నటించడం, రొమాన్స్ చేయాల్సి రావడం కథ నచ్చడం వల్లే. దే దే ప్యార్ దే సినిమాకు ప్రేక్షకాదరణ దక్కింది. ఆ సినిమా రూ.100 కోట్ల వసూలు చేసింది. అలాంటి సినిమాలో ఏజ్డ్ హీరో పక్కన 25 ఏళ్ల యువతిగా నటించాల్సి వస్తే.. ఆ వయసు వాళ్లే చేయాలి. ఆ పాత్రకు 40 ఏళ్లకుపైబడిన హీరోయిన్‌తో చేయిస్తే అది సరిగా ఉండదు. నా ఫ్రెండ్ ఒకరు తన తండ్రి కంటే ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొన్నారు అని రకుల్ అన్నారు.

English summary
Manmadhudu 2Shoot of King Nagarjuna's 'Manmadhudu 2' started today. Film is being Produced by Akkineni Nagarjuna, P. Kiran on Manam Enterprises, Anandi Art Creations banners Directed by Rahul Ravindran. Senior writer Satyanand handed over the Script to Director Rahul Ravindran. Amala Akkineni clapped the first shot. YuvaSamrat Naga Chaitanya Switched-on the camera. First shot picturised on God's photos. Sumanth, Sushanth, Nagasuseela, Yarlagadda Surendra, Akkineni Family graced the event with their presence. After a week schedule in Hyderabad film unit will move to Portugal for further shoot. Rakul Preet Singh will be seen as heroine alongside King Nagarjuna in this film.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more