అతడు నా రాఖీ బ్రదర్.. లివింగ్ రిలేషన్స్‌పై రకుల్ ప్రీత్ క్లారిటీ

అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ కేవలం దక్షిణాదిలోనే కాదు.. బాలీవుడ్‌లో కూడా వరుస సినిమాలతో ఆలరిస్తున్నది. ఇటీవల ఆమె నటించిన దే దే ప్యార్ దే చిత్రంతో భారీ హిట్‌ను ఖాతాలో వేసుకొన్న రకుల్.. దాదాపు అలాంటి కథతో మన్మథుడు 2 సినిమాలో నటించింది. వయసు మీరిన హీరోతో ప్రేమలో పడిన యువతిగా నటించింది. నాగార్జునతో కలిసి నటించిన మన్మథుడు 2 సినిమా ఆగస్టు 10న రిలీజ్ కానున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రకుల్ ప్రీత్ మీడియాతో మాట్లాడుతూ..

లివింగ్ రిలేషన్ షిప్‌పై రకుల్ క్లారిటీ

లివింగ్ రిలేషన్ షిప్‌పై రకుల్ క్లారిటీ

మన్మథుడు 2 సినిమా లివింగ్ రిలేషన్ షిప్‌ గురించి తీసిందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. రెండు రోజులు ఆగితే సినిమా కథేంటో తెలుస్తుంది అని రకుల్ అన్నారు. నిజ జీవితంలో లివింగ్ రిలేషన్ షిప్‌పై అభిప్రాయం ఏమిటనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను రిలేషన్‌షిప్‌లో లేను. అలాంటిది ఇంక లివింగ్ రిలేషన్‌షిప్ గురించి నేనెలా చెప్పగలను. లివింగ్ రిలేషన్ షిప్ అనేది ఆయా వ్యక్తులకు సంబంధించినది. నాకు వివాహ వ్యవస్థను నమ్ముతాను. ఈ ప్రపంచం చాలా విశాలమైనది.. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఒకరి అభిప్రాయాలపై నా ఓపినియన్ చెప్పలేను అని రకుల్ అన్నారు.

నేను రీమేక్‌కు వ్యతిరేకం కాదు

నేను రీమేక్‌కు వ్యతిరేకం కాదు

మన్మథుడు 2 సినిమా రీమేక్ కాదు. ఈ సినిమాను అంగీకరించిన తర్వాత మన్మథుడు సినిమా చూశాను. మన్మథుడు 2 మూవీ కథలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. దే దే ప్యార్ దే సినిమా రీమేక్‌లో నేను నటించడం లేదు. నన్ను చేయమని అడుగలేదు. అడిగినా నేను ఆ సినిమాలో నటించను. నేను నటించిన సినిమాకు సంబంధించిన రీమేక్‌లో నేను నటించడం ఇష్టం ఉండదు. అలా అని నేను రీమేక్‌ సినిమాలకు వ్యతిరేకం కాను రకుల్ చెప్పారు.

రాహుల్ రవీంద్రన్ సెన్సిబుల్ డైరెక్టర్

రాహుల్ రవీంద్రన్ సెన్సిబుల్ డైరెక్టర్

రాహుల్ రవీంద్రన్ సెన్సిబుల్ డైరెక్టర్. ఆయన టాలెంట్ ఏంటో ఈ సినిమా వెల్లడిస్తుంది. ఆయన రాసిన మాటలు బాగున్నాయి. షూట్‌లో కూల్‌గా ఉంటారు. యాక్టర్లందరినీ మూడ్‌లోకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాడు. మన్మథుడు 2 సినిమా అందరికీ నచ్చేలా పనిచేశాడు. నాకు రాహుల్ రవీంద్రన్ నా మొదటి సినిమా నుంచి తెలుసు. నాకు అతను రాఖీ బ్రదర్. అతనితో నాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని రకుల్ ప్రీత్ అన్నారు.

 హీరోయిన్ పాత్రను అద్భుతంగా రాశారు

హీరోయిన్ పాత్రను అద్భుతంగా రాశారు

మన్మథుడు 2 మూవీ స్క్రిప్టును ఒక నెల ముందే ఇచ్చారు. సెట్స్‌పైకి వెళ్లే ముందే నాకు సినిమా కథ అంతా తెలుసు. ప్రతీ సీన్‌కు ముందు, వెనుక ఏం జరుగుతుందో తెలుసు. అలా ప్రతీ యాక్టర్‌ను కథలో లీనమయ్యేలా చేశారు. ప్రతీ యాక్టర్‌ను మూడ్‌లోకి తీసుకెళ్లడానికి చొరవ తీసుకొన్నారు. షూటింగ్ జరిగినన్నీ రోజులు ఎన్నడూ ఎవరూ కూడా కోపం తెచ్చుకొన్న దాఖలాలు లేవు. హీరోయిన్‌కే కాదు ప్రతీ పాత్రను చాలా అద్భుతంగా రాశారు అని రకుల్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X