100 మందిని చంపితే హిట్.. 300 మందిని చంపితే..? నాన్నను అనుసరిస్తున్నా రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటించిన తాజాచిత్రం వినయ విధేయ రామ. మెగాస్టార్‌ చిరంజీవితో సైరా నర్సింహారెడ్డి చిత్రాన్ని ఓ పక్క నిర్మిస్తూనే.. బోయపాటి శ్రీను నటించిన వినయ విధేయ రామలో నటించారు. కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ కానున్నది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాంచరణ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఈ సందర్బంగా బోయపాటి శ్రీను మేకింగ్ గురించి.. సినిమా విశేషాలను వెల్లడించారు. ఆయన ఏమన్నారంటే..

 బోయపాటి ముద్రతో

బోయపాటి ముద్రతో

వినయ విధేయ రామ చిత్రంలో విధ్వంస రాముడే కనిపించడానికి కారణం దర్శకుడు బోయపాటి. ఆయన మేకింగ్ ముద్ర కనిపించాలని ట్రైలర్ ప్లాన్ చేశాం. అందుకే బోయపాటి ఎలిమింట్స్ ఎక్కువగా కనిపించాయి. కాకపోతే సినిమాలో అన్ని రకాలు ఎమోషన్స్ ఉంటాయి. సంక్రాంతి పండుగకు అన్ని వర్గాల ప్రేక్షకులను సంతృప్తి పరిచే చిత్రం.

పవర్‌ఫుల్ టైటిల్‌ కావాలని కోరుకోలేదు

పవర్‌ఫుల్ టైటిల్‌ కావాలని కోరుకోలేదు

వినయ విధేయ రామ అని టైటిల్ చెప్పినప్పుడు చాలా బాగుంది. నేను పవర్ ఫుల్ టైటిల్ కావాలని కోరలేదు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన జయ జానకి నాయక అనే టైటిల్ నాకు బాగా నచ్చింది. ఆ తరహాలో టైటిల్ ఉండటం బాగా నచ్చింది. ప్రతీ ఇంట్లో మంచి మనిషి, మరిది లాంటి వ్యక్తులు ఉంటే బాగుంటుందనే విధంగా ఈ చిత్రంలో పాత్రలను, క్యారెక్టర్‌లను డిజైన్ చేశాం.

నాన్నను అనుసరిస్తున్నాను

నాన్నను అనుసరిస్తున్నాను

రంగస్థలం తర్వాత అన్ని రకాల జోనర్లలో నటించాలనే ఉద్దేశంతో వినయ విధేయ రామ చిత్రంలో నటించాను. నాన్న చిరంజీవి అన్ని రకాల జోనర్ల సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ఆ క్రమంలోనే నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. నేను కూడా జోనర్ల సినిమాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను.

 రంగస్థలం మూవీ తర్వాత

రంగస్థలం మూవీ తర్వాత

రంగస్థలంలో సాధారణ వ్యక్తి పాత్రలో నటించాను. ఆ తర్వాత వెంటనే వినయ విధేయ రామ లాంటి సినిమాల్లో నటించాడానికి కొంత కష్టపడ్డాను. కొంత గ్యాప్ ఉండి ఉంటే ఇంకాస్త బాగుండేది అనిపించింది. కానీ బోయపాటికి వేరే కమిట్‌మెంట్స్ ఉన్నాయి. నాకు వేరే కమిట్స్ ఉండటంతో తొందరగా ఈ సినిమా చేయాల్సి వచ్చింది.

 ప్రతీది రంగస్థలం మాదిరిగా

ప్రతీది రంగస్థలం మాదిరిగా

రంగస్థలం లాంటి మంచి సినిమా ఎప్పుడూ రావాలని కోరుకోవడం కష్టమే. అలాంటి స్క్రిప్టుల కోసమే చూస్తే కుదరదు. ప్రతీ సినిమా రంగస్థలం మాదిరిగా హిట్ కావాలని ఆలోచిస్తే మాకు ఇబ్బందే. ఆడియెన్స్‌గా మంచి కథ వినడం, ఆ తర్వాత సినిమా చేయడమే మాముందు ఆపన్స్ ఉంటాయి.

బోయపాటి శ్రీను మూవీలో హింస

బోయపాటి శ్రీను మూవీలో హింస

సాధారణంగా బోయపాటి శ్రీను సినిమాలో హింస ఎక్కువ ఉంటుందని అంటారు. కానీ వినయ విధేయ రామ చిత్రంలో హింస ఉండదు. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను మెప్పించే విధంగా ఉంటాయి. హింస అనేది సినిమాకు అడ్డంకి కాదు. మూడొందల మందిని చంపారా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ నేను వంద మందిని చంపిన చూసి హిట్ చేశారు. మూడొందల మందిని చంపినా కథ బాగుంటే చూస్తారు. అది తప్పు కాదు అని రాంచరణ్ అన్నారు.

గ్యాంగ్ లీడర్ సినిమా కాదు

గ్యాంగ్ లీడర్ సినిమా కాదు

వినయ విధేయ రామ చిత్రానికి, వినయ విధేయ రామ చిత్రానికి ఏలాంటి పోలీకలు ఉండవు. నేను గ్యాంగ్ లీడర్ లాంటి సినిమాను చేయాలని అనుకొన్నాను. కానీ ఆ సినిమా ఇది కాదు. ఇది నలుగురు వ్యక్తులు ఎలా కలిశారు. ఎలా ఫ్యామిలీగా మారారనేది కథ. సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి అని రామ్ చరణ్ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X