సైరా బడ్జెట్.. చిరు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? రాంచరణ్ చెప్పిన ప్రకారం..
ధ్రువ, రంగస్థలం చిత్రాల తర్వాత మెగా పవర్ స్టార్ రాంచరణ్ మరింత పరిణితి చెందిన నటుడిగా, నిర్మాతగా కనిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవితో సైరా నర్సింహారెడ్డి చిత్రాన్ని ఓ పక్క నిర్మిస్తూనే.. బోయపాటి శ్రీను నటించిన వినయ విధేయ రామలో నటించారు. కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం జనవరి 11న రిలీజ్ కానున్నది. సినిమా ప్రమోషన్‌లో భాగంగా రాంచరణ్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడారు. ఆయన వినయ విధేయ రామ, సైరా తదితర చిత్రాల గురించి పలు విషయాలను వెల్లడించారు. రాంచరణ్ వెల్లడించిన విషయలు ఆయన మాటల్లోనే..

సైరా షూటింగ్ కొంత ఆలస్యం
సైరా నర్సింహారెడ్డి చిత్రం అనుకొన్న దానికంటే షూటింగ్ ఆలస్యం అయింది. అందుకు రకరకాల కారణాలు ఉన్నాయి. వాస్తవానికి వేసవిలో విడుదల చేయాలని అనుకొన్నాం. కానీ అది వాయిదా పడింది. సినిమా రీషూట్స్ జరుగుతున్నాయనే రూమర్స్‌లో వాస్తవాలు లేవు.

దక్షిణాదికే పరిమితం చేయాలని
సైరా చిత్రాన్ని కేవలం దక్షిణాదికే పరిమితం చేయాలని అనుకొన్నాం. కానీ ఆ చిత్రానికి ఉన్న రేంజ్‌ను దృష్టిలో ఉంచుకొని హిందీ భాషల్లోకి కూడా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకొన్నాం. దాంతో ఈ చిత్రం జాతీయ ప్రాజెక్ట్‌గా మారింది. సైరా సినిమా దేశవ్యాప్తంగా ప్రేక్షకుల ఆదరణ చూరగొనడంలో ఎలాంటి సందేహం లేదు.

రెండు నెలల్లో సైరా షూటింగ్ పూర్తి
సైరా చిత్రం దాదాపు పూర్తి కావొచ్చింది. మరో రెండు నెలల్లో షూటింగ్ పూర్తి అవుతుంది. ఆతర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వ్యవహారాలు జరుపుకొని ఈ సంవత్సరం రెండోభాగంలో విడుదల అవుతుంది. దాదాపు దసరా పండుగకు రిలీజ్ చేయాలని అనుకొంటున్నాం అని రాంచరణ్ తెలిపారు.

సైరా మూవీ బడ్జెట్ ఎంతంటే
అమితాబ్ బచ్చన్, సుదీప్ కిచ్చ, విజయ్ సేతుపతి లాంటి నటులతో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకొంటున్న బడ్జెట్ రూ.200 కోట్ల వరకు ఉంటుంది. నాన్న కోసం ఎంతైనా పెట్టాలనే ఉద్దేశంతో సినిమా బడ్జెట్‌ను రివీల్ చేయలేదు. కానీ సినిమా రేంజ్ కోసం బడ్జెట్‌ను చెప్పాల్సి వచ్చింది.

చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే
సైరా చిత్రంలో నటించినందుకు ఎంత రెమ్యునరేషన్ ఇస్తున్నారని ప్రశ్నకు సమాధానంగా రాంచరణ్ మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకొనే
హీరో. ఆయన స్థాయికి తగ్గకుండా నేను రెమ్యునరేషన్ ఇస్తున్నాను. కావాలంటే ఆయననే అడిగి తెలుసుకోండి. మా అమ్మ సురేఖ, నా నిర్మాణ సారథ్యంలో నిర్మిస్తున్న సైరాలో ఆయన నటిస్తున్నందుకు ఆయనకు ఏమాత్రం లోటుపాటు రాకుండా బాగా చూసుకొంటున్నాం అని అన్నారు.

భార్య ఉపాసన గురించి
సైరా చిత్ర నిర్మాణంలో ఉపాసన ఎలాంటి బాధ్యతలు తీసుకోలేదు. ఆమెకు అపోలో హాస్పిటల్‌లోనే మంచి బాధ్యత ఉంది. ఆ తర్వాత నా గురించి సోషల్ మీడియాలో అప్‌డేట్స్ ఇచ్చే పాత్రను కూడా పోషిస్తున్నది. ఈ రోజుల్లో హీరోల భార్యలకు భర్తల గురించి అప్‌డేట్స్ ఇవ్వడాన్ని ఓ బాధ్యతగా స్వీకరిస్తున్నారు అని రాంచరణ్ అన్నారు.


Click it and Unblock the Notifications











