రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్.. ఎందుకు మధ్యలోనే ఆగిపోయిందో తెలుసా?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాలని ఎంతగానో ప్రయత్నించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అందుకు తగ్గట్టుగానే ప్రాజెక్ట్ ను కూడా అనౌన్స్ చేశారు. ఆర్సీ16 ప్రాజెక్ట్ ను గౌతమ్ తిన్ననూరినే డైరెక్ట్ చేయాల్సి ఉండింది. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో కథ ఉంటుందని అప్పట్లో చర్చ కొనసాగింది. కట్ చేస్తే.. ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్లింది. అసలు అర్ధంతరంగా ప్రాజెక్ట్ ఆగిపోవడానికి కారణం ఏంటనేది? చాలా మందికి అర్థం కాలేదు. ఇక రీసెంట్ గా అసలు విషయాన్ని దర్శకుడు గౌతమ్ తిన్ననూరి బయట పెట్టారు. ఆ వివరాల్లోకి వెళితే..
చరణ్ అవ్వడంతో విజయ్ తో..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయాల్సి ఉండగా అనుకోని కారణాల వల్ల అది మధ్యలోనే ఆగిపోయింది. దాంతో రామ్ చరణ్ అభిమానులు చాలా అప్సెట్ అయ్యారు. జెర్సీ వంటి బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చిన గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ సినిమా మిస్ అయింది. ఇక ఆ వెంటనే గౌతమ్ తిన్ననూరి స్టార్ హీరో విజయ్ దేవరకొండతో సినిమాను ప్రకటించారు. జూలై 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.

రామ్ చరణ్ కు చెప్పిన కథ కింగ్డమ్ నా?
ఇటీవల ఇంటర్వ్యూలో గౌతమ్ తిన్ననూరి రామ్ చరణ్ తో సినిమాపై మాట్లాడారు. అయితే రామ్ చరణ్ కు చెప్పిన కథ విజయ్ దేవరకొండతో తీసిన కింగ్డమ్ కథ ఒకటేనా అనే ప్రశ్న ఎదురైంది. దీంతో గౌతమ్ తిన్ననూరి ఆ కథకు ఈ కథకు అసలు సంబంధమే లేదని చెప్పారు. రామ్ చరణ్ కు చెప్పిన కథ పూర్తిగా భిన్నంగా ఉంటుందని సమాధానం ఇచ్చారు.
రామ్ చరణ్ తో సినిమా ఎందుకు ఆగిపోయింది?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా ఆగిపోవడానికి గల కారణాలు ఏంటనే వాటిపై ఇటీవల గౌతమ్ తిన్ననూరి స్పందించారు. రామ్ చరణ్ గారికి ఒక ఐడియాతో కొంత స్టోరీ చెప్పానని అన్నారు. మొదట ఐడియాను చరణ్ బాగా ఎంజాయ్ చేశారని, కానీ పూర్తి కథతో వెళ్లినప్పుడు మాత్రం ఎందుకు ఆయన సంతృప్తి చెందలేక పోయారని తెలిసిందన్నారు. అందుకే తానే ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నానని గౌతమ్ తిన్ననూరి చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ తో నార్మల్ సినిమా తీయొద్దని, సాలిడ్ కంటెంట్ తో మళ్లీ తిరిగి వెళ్తానని బలంగా నిర్ణయించుకున్నట్టు చెప్పుకొచ్చారు. ఇక మళ్లీ వీరి కాంబినేషన్ లో ఎప్పుడు సెట్ అవుతుందో చూడాలి.
పెద్ది చిత్రం..
రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ 300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, బాలీవుడ్ యంగ్ స్టార్ దివ్యేందు, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం విశేషం.


Click it and Unblock the Notifications











